“గ్రీన్ కార్డ్” గణేషుని గుడి @ నాష్ విల్లె

 
 

ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. మనిషి తన మూలాలను మరిచిపోడు అనటానికి అమెరికా లోని నాష్ విల్లె (టెన్నిసీ స్టేట్ లో వున్నది) లో వెలిసిన గణేషుని గుడి చక్కటి ఉదాహరణ. హైదరాబాదు లో చిల్కూరు బాలాజీ గుడి కెళ్తే యు. ఎస్. వీసాలు మంజూరు అవుతాయని ఎలా నమ్మకం ఉందొ.. ఈ గుడి దేవుని దర్శనం చేసుకుంటే.. “శీఘ్రమేవ గ్రీన్ కార్డ్ ప్రాప్తిరస్తు” అని ఇక్కడి మన వారికి నమ్మకం. అందుకే  “గ్రీన్ కార్డ్” గణేషుని గుడి గా కూడా ఈ గుడిని పిలుస్తారు.

  
ఈ గుడి 1981 లో  కొంత చిన్న ప్రాంతం లో వెలిసింది. ఇక్కడి భారతీయులు… ముఖ్యం గా ఆంధ్రులు.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఒకటిగా చేరి.. ఈ గుడి నిర్వహణ మొదలెట్టారు. భక్తుల స్పందన బాగా ఉండడటం తో ఇంకొంత   భూమిని కొనుగోలు చేసి, పెద్ద ఆవరణ లో గుడి నిర్మాణం 1982 లో మొదలుపెట్టి , మూడేళ్ళలో పూర్తి చేసారు. సుబ్రమణ్యన్ అనే శిల్పి, అతనితో పాటు మరో పన్నెండు మంది శిల్పులను మన దేశం నుండి ప్రత్యేకంగా రప్పించి, ఇక్కడి గుడి ప్రాకారాలను చెక్కించి శోభాయమానంగా తీర్చి దిద్దారు.  నిర్మాణానికి ఇక్కడి సామగ్రితో అచ్చులు తయారు చేసి , వాటిని శిల్పాలు గా మన శిల్పులు చెక్కారు. ముఖ్య దైవం గణేశుడైనా  .. అందరు దేవుళ్ళ విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడి ఒడిష భక్తులను దృష్టి లో పెట్టుకుని, జగన్నాథుని విగ్రహం కూడా ఏర్పరచారు. అందరు దేవుళ్ళ మూర్తులను మాత్రం మన దేశం నుండే తెప్పించారు. సుమారు పద్దెనిమిది ఎకరాల స్థలం కొనుగోలు చేసారు.. ఈ గుడి కోసం. గుడి కింది ఆవరణ లో ఒక ఆడిటోరియం నిర్మించారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న దానాలు చేస్తుంటారు. పూజారి కోసం ఇంటిని కూడా గుడి ప్రక్కనే నిర్మించారు. మన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువుల (దుస్తులు, హారాలు లాంటివి), పుస్తకాల  విక్రయం కూడా జరుగుతూంది.
 

గుడి లోపల

వూరి చివరగా ప్రశాంతమైన వాతావరణం లో వెలిసిన ఈ గుడి కి వెళ్తే, మన దేశం లో వున్న.. ఇంకా చెప్పాలంటే,, మన వూళ్ళో వున్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ తెలుగు వాళ్ళే కనపడుతారు. ఇక్కడి స్థానికులు కార్యనిర్వాహక  వర్గం లో ఉండి, ఆలయ నిర్వహణలో ఇతోధిక కృషి చేస్తున్నారు. ఈ రోజు.. యు. ఎస్. లో వున్న పేరెన్నిక గన్న దేవాలయాలలో ఇదీ ఒకటి కావటానికి వీరు చేసిన కృషి అభినందనీయం. ప్రతి శని, ఆదివారాలలో రద్దీ ఎక్కువ గ (అంటే 400 నుండి 500 మంది వరకూ) వుంటుంది. ఆదివారాలలో ప్రసాదం ఇచ్చే కార్యక్రమం అన్నదానం లాగే వుంటుంది. అందరు.. హారతి అయ్యాక.. ఇక్కడ భోజనం చేసి వెళ్ళటం మామూలే. ఎక్కడా హడావిడి లేకుండా.. తోపుళ్ళు, తొక్కిసలాటలు లేకుండా.. అంతటా భారతీయత ఉట్టిపడుతుంటుంది ఈ గుడిలో. త్వరలో, ఈ గుడి కి మరి కొన్ని భవనాల  నిర్మాణం మొదలౌతోంది .. అందులో.. మన వారికి, మన సంసృతి కి సంబంధించిన విషయాలలో విషయ బోధన (వారానికి ఒక సారి) చేయబోతున్నారు.  సంస్కృతిని, ఇక్కడ ఉండబోయే మన  ముందు తరాల వారికి అందించాలని వీరు చేస్తున్న యత్నానికి , మనం హార్థిక శుభాకాంక్షలు అందిద్దాము.  
నాష్ విల్లె లోని గణేషుని ఆలయం

 

 
Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

4 Responses to “గ్రీన్ కార్డ్” గణేషుని గుడి @ నాష్ విల్లె

 1. SRRao says:

  మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు

  – శి. రా. రావు
  ఉగాది ఊసులు
  http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html

 2. anagha says:

  శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ,వినాయకుడి గుడి బాగుంది .ఏ దేశమేగిన మన తెలుగువారు ,తెలుగుదనం ,మన దేవుళ్ళు కన్పిస్తారు కాబట్టి హోం సిక్ అంత ఉండదేమో ….

 3. Suresh Jakka says:

  RamaKrishna garu,

  We live in Huntsville, AL which is very close to Nashville, TN. Please let us know when you are again in Nashville. We can meet and it will be a real honor to show you the places around. Thank you for the nice blog, keep writing, keep posting the new pictures of our school and Greamspet surroundings. Its been more than 10 years that I last visited Chittoor. My family is from Vijayawada but my father was working in Chittoor when I was young. Now they moved back to Vijayawada and I did not have strong connections there to visit. After reading your blog, it motivated me to visit Chittoor again (our school in particular) in next India trip.

  Thank you sir,
  Suresh

  • mhsgreamspet says:

   Suresh garu,
   Very happy to know about you andi. Touched by your attachment to our school and teachers, esp Ramana sir. Thanks for the invitation. God willing, we will definitely meet…
   Thanks once again
   Ramakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s