ఆ రాత్రి…

నా హార్డ్ డిస్క్ లో వెతుకుతుంటే.. ఎందుకో మన స్కూల్ మిత్రులు ముప్పై ఏళ్ళ తరవాత కలిసిన వీడియో కంటపడింది. అప్రయత్నంగా అన్నీ మరిచి, ఆ వీడియో చూస్తుండిపోయాను. జీవితం లో మళ్ళీ చూస్తామో లేదో అన్న ఫ్రెండ్స్ అందరూ, కంటి ముందు కదులుతూ ఉంటె.. గుండె అట్టడుగు పొరలలోని జ్ఞాపకాలు ద్రవీభవించి ఉప్పెనలా కమ్ముకున్నాయి. అప్పుడే గుర్తొచ్చింది ఆ రాత్రి..

అదే సెప్టెంబర్ 30 ,2009 రాత్రి. అక్టోబర్ రెండున మన మిత్రులు అందరూ chittoor లో కలవాలని అనుకున్నాం కదా. ముప్పయ్యవ తేదీన బయల్దేరాను. నేను బస్సులో బయల్దేరేటప్పటికే వర్షం మొదలయింది. కర్నూల్ చేరేసరికి జోరున వాన.. ఊళ్ళోని బ్రిడ్జి దగ్గర వచ్చేసరికి రోడ్డు పై రెండు అడుగుల వరకు నీటి ప్రవాహం .. అక్కడే బస్సు లోనికి నీళ్ళు రావటం, బండి ఆగిపోవటం జరిగింది. వర్షం తగ్గే సూచనలేమీ కనపడటం లేదు. డ్రైవరు బండి నడపలేనని చేతులెత్తేశాడు. అంత వర్షం ఎప్పుడూ చూడలేదు. మరుసటి రోజు.. మన వూళ్ళో మిత్రులు కలవటానికి ప్రోగ్రాం తయారు చేయాలి.. మన మిత్రులని రెండవ తేది కలవటానికి ఏర్పాట్లు చూడాలి మన ఫ్రెండ్స్ తో పాటు. ఈ వర్షానికి ఎక్కడ వూరు చేరలేనో అని బెంగ మొదలయ్యింది. బస్సు కండక్టర్ ని అడిగాను వేరే బండి ఏదైనా ఏర్పాటు చేయలేరా అని. వాళ్ళ బండి ఇంకోటి కాస్సేపట్లో వస్తుంది కాని అందులో సీటు ఉండదు అని చెప్పాడు..అక్కడే ఉంటె పరిస్తితి చేయి దాటేటట్టు ఉందనిపించి ఆ రెండో బస్సులో వెళ్ళిపోవాలని నిరనయిన్చేసుకున్నాను. తీర ఆ బస్సు వచ్చి చాల దూరం గా ఆగింది.. ఆ వర్ష ఉధృతి ఎక్కువ కావటం తో. ఏదైతే అయింది లెమ్మని.. రెండు అడుగుల లోతు నీళ్ళలో అలాగే నడుచుకుంటూ ఆ అర్దరాత్రి ఇంకో బస్సులోకి మారాను. ఆ బస్సు వూరు దాటినా వెంటనే ఇంకో వాగు దగ్గర ఆగిపోయింది.. అటూ.. ఇటూ బారున బళ్ళు.. చిమ్మ చీకటి.. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం.. ఇంతలో వాగులో చిక్కుకున్న ఓ జీపు.. అందులోంచి ప్రయాణీకుల అరుపులు.. ఇదంతా చూస్తూ మొద్దుబారిపోయింది నా మైండ్. చితూర్ కాదు కదా. అసలు ఎటూ కదలలేని స్థితిలో ఉండిపోయాను.. తెల్లవారే వరకు అందరూ భయంతో కాలం గడిపాము. ఇంతలో తెల్లవారింది. కానీ ఎవరూ ఆ వాగు లోన బండి తీసుకెళ్ళటానికి సాహసించటం లేదు. మా బస్సు డ్రైవర్ ధైర్యం చేసి బండి వాగులోకి వచ్చేసాడు. అందరి గుండెల్ల్లోనూ దడ.. ఏమౌతోందో అని.. ఎలాగోలా ఆవలి వైపు చేరాడు.. (చేరకుంటే ఈ బ్లాగు రాసేవాడిని కాదు కదా..:))

నెమ్మది నెమ్మది గా ఎదురుగ వున్నా బళ్ళను దాటుకుంటూ , ఆ గండం గట్టేక్కాము. పన్నెండు గంటలు (అంటే బస్సులోనే ఒక రోజు గడిపానన్న మాట) ఆలస్యంగా గమ్యం చేరాను. వూరు చేరాక తెలిసింది, కర్నూల్ వూరు చాలావరకు ముంపుకు గురి అయిందని. బహుశ నేను బస్సు మారకుంటే పరిస్థితి ఎలా ఉండేదో ..!

ఆ తరవాతి రోజు మన మిత్రులందరినీ కలిసాక, ఈ కష్టాలన్నీ అసలు గుర్తు రాలేదు. ఆ రోజు.. ఓ జీవిత కాలానికి సరిపడే స్మృతులను మూట కట్టుకున్నాను. మన వాళ్ళను ఎలాగైనా కలవాలి అన్న ఆ బలీయమైన సంకల్పం చూసి, ఏదో కనిపించని శక్తి నన్నుఆ రోజు ఆ గండం నుండి గట్టేక్కించింది అనిపిస్తుంది.

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to ఆ రాత్రి…

  1. Dear JNS,our friendshipbond is such a firm which draged u from water loging of kurnool2chittoor. Happy bonvoyage.

  2. jayaprakash says:

    Nenu kuda same school lo study chesanu meru evaru me peru e batch lo chadhuvu kunnaru. na name jayaprakash nenu same school lo 1986 – 1991 chadhivanu. please enka emaina unte na mail id ki post cheyaru please.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s