విదేశాలకు ప్రయాణం చేసే వారికి కొన్ని సలహాలు

విదేశాలకు  వెళ్ళేప్పుడు, తెలియని ప్రదేశం, కొత్త వ్యక్తులు, ఆచార వ్యవహారాలు, సుదూర ప్రయాణాలు, కాల వ్యత్యాసాలు, ఇలాంటి ఎన్నో అదుర్దాలు ఉంటాయి.  మీరు కూడా అప్పుడప్పుడూ విదేశాలకు దూర ప్రయాణాలు చేస్తుంటే, మీకు కొన్ని సూచనలు.

  • ముఖ్యమైన డాక్యుమెంట్స్ (పాస్ పోర్ట్, వీసా కాగితాలు, విదేశీ కరెంసీ, మీ విసిటింగ్ కార్డ్,) లాంటివాటిని మీతో ఎల్లప్పుడూ ఉంచుకోవటం శ్రేయస్కరం.వాటిని క్లుప్తం గ సర్దటానికి కొన్ని పౌచేస్ బజార్లో దొరుకుతున్నాయి. వాటిల్లో జిప్పు వున్నది తీసుకుంటే బెటర్. విదేశాలలో ఎలాగు చలి ఉంటుంది కనుక ఎక్కువ జేబులున్న జెర్కిన్ ని వేసుకుని అందులో ఈ పౌచ్ ఉంచుకుంటే మంచిది. వీటి అవసరం ప్రయాణమంతా ఉంటుంది కాబట్టి, ఇవి ఎంత అందుబాటులో వుంటే అంత మంచిది.
  • మీ లగేజి సర్దే విషయం లో జాగర్త వహించాలి. మీ airlines బట్టి, మీరు ఎన్ని బాగ్స్,  ప్రతి బాగ్ లో ఎంత బరువు తీసుకెళ్ళటానికి అర్హులో తెలుసుకోండి. వస్తువులు పాక్ చేసేప్పుడు ‘వదిలేసినా పరవాలేదు’ అనిపించే వస్తువులను ఒక చిన్న పాక్ లో సర్ది మీ సూట్ కేసు లోనే పైన ఉండేటట్లుగా సర్దండి. అందు వల్ల, చివరి నిమిషం లో ఏదైనా లగేజ్ వదిలి వేయాలంటే, సులువు గా ఉంటుంది. (వెనకటికి ఒకతను  తన భార్య , అత్త గారితో వూరేల్తుంటే, ఆ అత్త గారికి ఇలాంటి సమస్యే వచ్చిందట. లగేజి బరువు ఎక్కువయింది. మీకు పనికిరాని వస్తువు ఏదైనా వుంటే పడేయండి అని airport స్టాఫ్ చేసిన సూచనకి అలవాటు కొద్ది, అల్లుడు వైపు చూసిందట ఆ అత్త గారు..)
  • మీరు వెళ్ళే దేశం లో ఎక్కడ ల్యాండ్ అవుతారు, అక్కడినుండి ఎక్కడికి వెళతారో, ఆ ప్రదేశాల కాల వ్యత్యాసం తెలుసుకుని, ఒక వాచ్ లో ఆ టైం సెట్ చేసుకుని వుంచుకుంటే, విదేశాలకు వెళ్ళాక టైం గురించి నియంత్రణ ఉంటుంది.
  •  ఇంగ్లీషు మాట్లాడలేని వారికి వీలైనంత వరకూ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో (వీలుంటే) టికెట్ బుక్ చేస్తే, వారికి మన వారితో వెళ్తున్న ట్లుగా ఉంటుంది. అందువల్ల కొంత ధైర్యం గా ఉంటుంది. కొంత మంది ఫ్రెండ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది
  • connecting flights  కనీసం 5-6 గంటలు గ్యాప్ ఉండేలా బుక్ చేసుకుంటే, ఫ్లైట్ తప్పిపోతుందన్న ఆదుర్దా ఉండదు.
  • కొన్ని మొబైల్స్ మీరు వెళ్ళే దేశం లో పని చేయవు కాబట్టి, వీలైతే మీ ఫ్రెండ్స్ ద్వార కాలింగ్ కార్డ్స్ కొని, ఆ డీటైల్స్ తో మీరు దిగిన చోట airport నుండే మీ క్షేమ సమాచారాలు తెలపటానికి వీలుగా ఉంటుంది.
  • దూర ప్రయాణం కాబట్టి, మీ శరీరం పగలు రాత్రి తేడాలను తట్టుకోటానికి సహకరించండి. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఫ్లైట్ లో ఎప్పుడంటే అప్పుడు ఫుడ్ ఇస్తూ ఉంటారు. మన టైం  ప్రకారం ఏమి తింటామో , అప్పుడు మాత్రం తినటం మంచిది. వీలైనంత వరకు, మీ గమ్యం చేరే వరకు, simple and light food తీసుకోవటం మంచిది
  • బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు, కిటికిలో నుండి చూడాలనే సరదా లేకపోతే మటుకు, aisle  సీట్ ని prefer చేయండి. ఎందుకంటే, ఆ సీట్ లో కూర్చుంటే  walkway లో కాళ్ళు చాపుకునే అవకాశం ఉంది. long journey లో ఇది చాల అవసరం. మధ్య సీట్ లో కూర్చుంటే మాత్రం మీ movements కష్టమే.
Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s