టోర్నడో ల నడుమ జీవితం…

ఈ మధ్య అమెరికా లో కొన్ని రాష్ట్రాలలో టోర్నడోలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసాయి. ఇవి అతి వేగంతో భ్రమించే గాలితో కూడిన మేఘాల  సముదాయం.. ఆకాశానికి, భూమికి వంతెన వేసినట్లు గా ఉండే ఈ చక్రవాకాలు, అతివేగంతో కదుల్తూ, జనావాసాల మధ్య వచ్చినప్పుడు విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగచేస్తాయి. ముఖ్యంగా వాటి తీవ్రత, మైదాన ప్రదేశాలలో ఎక్కువగా వుంటుంది. ఎక్కువ మైదానాలున్న అలబామా, టెన్నిసీ , మిస్సిసిపి రాష్ట్రాలలో గత నెలలో టోర్నడోలు పలు మార్లు వచ్చి జన జీవనాన్ని ప్రభావితం చేసాయి.

 వాతావరణాన్ని అంచనా వేయటంలో సాటి లైట్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురోగతి సాధించింది. ప్రస్తుతం వాతావరణాన్ని సుమారు పది రోజుల ముందు నుండే ఖచ్చితం గా అంచనా వేయగలుగుతున్నారు. ఇక్కడి ప్రజల దైనందిన జీవితం లో ఆ రోజు వెధర్ ఎలా వుందో చూసుకుని బయల్దేరటం ఓ భాగమయ్యింది. మొదట్లో విడ్డూరమనిపించినా, తరవాత అర్థమయ్యింది, అది ఎంత ముఖ్యమో. ఎందుకంటే, ఇక్కడి వాతావరణం లో మార్పులు అతి వేగంగా మారుతుంటాయి. ఎండగా ఉండే ఆకాశం ఒక్కసారి గా మేఘావృతం అయిపోతుంది. అందుకే, కార్ నడుపుతూ కూడా వెదర్ ఛానల్ ని ఫాలో అవుతూ వుంటారు ఇక్కడి ప్రజలు. 

గత నెలలో ఎన్నో టోర్నడోలు వచ్చాయి. అవి ముందే వస్తాయని , ఓ మూడు రోజుల ముందు నుండే, ప్రసార  మాధ్యమాల ద్వార ప్రజల్ని అలెర్ట్ చేయటం జరుగుతుంది. టోర్నాడో లు వెళ్ళే మార్గాన్ని కూడా , చాల ఖచ్చితం గా ముందే  చెప్పగలగటం చూసాక, “వాన రాకడ..” అన్న నానుడి ఇక ఎంత మాత్రమూ సరికాదు అనిపిస్తుంది. ప్రజలు కూడా, అన్ని హెచ్చరికల్నీ గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక్కడి ఇళ్ళు కూడా, తేలికపాటి సామగ్రితో నిర్మింప బడటం  వలన, ప్రాణ నష్టం లేకున్నా, ఆస్థి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ..

ఇంటర్నెట్ లో  weather.com సైట్ లో ఎప్పటికప్పుడు తమ ప్రాంతపు  జిప్ (మన పిన్ కోడ్ లాంటిది) కోడ్ ని టైప్ చేసి, తాము టోర్నడో మార్గానికి ఎంత దగ్గరలో ఉన్నదీ ప్రజలు తెలుసుకుంటారు. ఒక ప్రాంతాన్ని   టోర్నడోలు సమీపించే కొద్ది, టి. వి. , రేడియో  లలో హెచ్చరికలు ముమ్మురం చేస్తారు. ప్రతి కౌంటీ లోను ఈ హెచ్చరిక ఎంత సమయం వరకూ వుంటుంది అన్న విషయాన్ని  తెలియపరుస్తారు.  టోర్నాడో వెళ్ళే సమయం లో ఆయా ప్రాంతాలలో, సైరన్ మోగిస్తారు. అప్పుడు కార్లో వెళ్ళేవారు, ఎక్కడైనా సురక్షిత ప్రాంతం లో ఆపివేస్తారు. ఇళ్ళలో వుండేవారు,   ఆ సమయం లో ఇంటి basement లో వుండటం మంచిది. టోర్నడోలు అప్పుడప్పుడూ అంచనాల్ని దాటి స్వల్పంగా గమనం , దిశా మార్చుకుంటాయి కాబట్టి, ఇవి ఆ ప్రాంతాల్ని దాటే వరకూ, ప్రతి వోక్కరికీ ఆదుర్దా గానే వుంటుంది. వీటి గురించి తెలుసుకోవాలంటే, “Twister”  అనే ఆంగ్ల  చిత్రం చూడండి. చాల ఉత్కంత భరితం గా వుంటుందీ సినిమా. ఇది సినిమానే కదా అని అప్పుడెప్పుడో అనుకున్నా, గత నెల, వీటి తాకిడి చూసాక, ఆ చిత్రం వాస్తవానికి అతి దగ్గరగా వుంది అనిపించింది. 

వీటిని చూసాక నాకు గుర్తు వచ్చిన పాట (హు.. ఇలాంటి సమయం లో కూడా పాటలా అనుకుంటున్నారా..:)) “సుడిగాలి లోన దీపం కడవరకు వెలుగునా…”


Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to టోర్నడో ల నడుమ జీవితం…

  1. Tornodos are highly dangerous than tsunami&earthquakes.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s