చందమామ లేకుంటే సాహిత్యం ఎలా ఉండేదో..?

శాస్త్రీయంగా చెప్పాలంటే అది  ఓ ఉపగ్రహం… తక్కువ గురుత్వాకర్షణ ఉండి, జీవన యోగ్యం కాని రాతి శిలల గోళం.. ఆఖరికి స్వయం ప్రకాశత్వం  లేక, సూర్యుని నుండి అరువు తెచ్చుకున్న కాంతితో మెరిసే గ్రహం..అటు శుక్ల పక్షం ఇటు కృష్ణ  పక్షం, అటు రాహువు ఇటు కేతువు లకు బలయ్యే ఓ వ్యక్తి..

ఇన్ని ఉన్నా.. చందమామ  మనిషి జీవితం లో, తన  కాల్పనిక జగత్తులో, సాహిత్యం లో ఓ సమగ్ర భాగం అయ్యాడు. “చందమామ రావే… జాబిల్లి రావే..” అంటూ అమ్మ గోరు ముద్దలు తినిపించినా…,

“మామ చందమామ.. విన రావా . మా కథ..”

అంటూ ప్రేమికుల రాయబారానికి అర్థించినా…

“నీ ఎదుట నేను.. వారెదుట నీవు… మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు..”

అని పరోక్షంగ తమని కలుపమని అర్థించినా .. అంతటా  ఆ కనిపించే చందమామ మూల బిందువౌతాడు. పురాణాలలో రాముడు కూడా చిన్నప్పుడు చందమామని తేచ్చివ్వమని మారాం చేసాడని కూడా మనం చదువుకున్నాం.

చందమామ  లేకుంటే… ఏ భాష లోనైనా  అసలు సాహిత్యం … ఎలా మనగలిగేదా   అనిపిస్తుందో సారి.. అలాంటి కొన్ని పాటల పునశ్చరణే    ఈ టపా.

ముఖ్యంగా… చందమామని ఎదుటి వ్యక్తిని flattering చేయటానికి చాల అందంగా వాడారు మన కవులు.
“చందమామ  నీతోటి పందెము వేసి..
మబ్బుల్లో దాగింది సిగ్గేసి’ అని “వేములవాడ భీమకవి” చిత్రం లో ఓ పాట, అలాగే

“आसमान कह रहा है रब से … तूने चाँद दो क्यों बांये.
एक में रखा है दाग, दूसरा है साफ़ साफ़…सबकी नज़र उसपे जाए.”

అన్న “మస్త్” లోని హిందీ పాట ద్వారా  పొగడ్తలలో పతాక స్థాయి లోకి తీసుకెళ్ళారు.. చందమామని పోలుస్తూ..
అలాగే తల్లి ప్రేమని చాటి చెప్పటానికి కూడా
“चंदा है तू, मेरा सूरज  है  तू ,ओ  मेरी  आँखों  का  तारा  है  तू ”
అంటూ  చందమామ సహాయపడ్డాడు.
అలాగే

“చంద్రుడు కనపడలేదని, వెన్నెల … వెన్నెల వేరే చోటికి వెళుతుందా”

అంటూ  వీడని బంధాన్ని తెలియచెప్పటానికి కూడా (రాజ రమేష్ చిత్రం లో) చంద్రుని సహాయం తీసుకున్నారు.

“चाँद जैसे मुखड़े पे बिंदिया सितारा..”

అన్న “సావన్ కో ఆనే దో” అన్న చిత్రం లోని పాటలో మాత్రం చంద్రుడిని తక్కువ చేయకుండా.. చంద్రుడితో సమానం గా పోలుస్తూ హీరో హీరొయిన్ ని పొగుడుతాడు.

“चाँद के पास जो सितारा है.. ओ सितारा हसीं लगता है..”

అన్న “స్వీకార్ కియా మైనే” అన్న చిత్రం లోని పాటలో చంద్రుని పక్కనున్డటం వలన తరలెంత శోభిల్లుతాయో చెపుతూ, “जब से तुम हो मेरी निगाहों में.. हर नज़ारा हसीं लगता है” అంటూ హీరొయిన్ సాంగత్యం లోని మహిమ  ని చెపుతాడు హీరో.

చంద్రుడే కాదు… చంద్రుడి byproduct  అదేనండీ.. వెన్నెల.. తో కూడా ఎంత చక్కటి భావాల్ని పంచారు మన కవులు!
“వెన్నెల్లో గోదారి అందం..నది కన్నుల్లో కన్నీటి దీపం..”

అంటూ “సితార” లో ఉద్వేగ భరితపు భావనకి వెన్నెలే ఆలంబన… వెన్నెలలో ప్రతిఫలించిన నీటిని కన్నీటి దీపంగా ఎంత హృద్యం గ చెప్పాడు ఆ గేయ రచయిత.. (అది వేటూరి సాహిత్యమేమో ..?  I dont know)

“వెన్నెలా  వెన్నెలా  మెల్లగా  రావే …” అన్న  “ప్రేమ దేశం” చిత్రం లోని పాట  లో ” కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ…” అన్న సాహిత్యం ఎంత సున్నితం గా ఉంటుందో…

హిందీ లో నాకు చాల ప్రియమైన ఓ పాట
“चान्दिनी रात में .. एक बार तुझे देखा है”
అన్న “దిల్- ఏ- నాదాన్” చిత్రం లోని పాట వింటే.. పున్నమి రాత్రి లో విహరిస్తున్నంత ఆనందం గా  ఉంటుంది. ఆ చిత్రం లోనే ఇంకో పాట

“ऐसे हसीन  चान्दिनी पहले कभी न थी..
शामिल है इस में आपकी
चेहरे का नूर भी”

అంటూ చంద్రునికి అందం తనకి నచ్చిన వ్యక్తి వలన పెరిగిందంటూ flatter చేస్తాడు ఓ కథ నాయకుడు.

ఇలా ఎన్నెన్నో పాటలు.. వీటిని అల్లంత దూరం నుండి వింటూ.. తనదైన శైలిలో మన పై వెన్నెలని కురిపిస్తూనే ఉన్నాడు ఆ చంద్రుడు.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

3 Responses to చందమామ లేకుంటే సాహిత్యం ఎలా ఉండేదో..?

 1. కమల్ says:

  చందమామ మీద మీ వ్యాసం చాలా బాగుంది. చందమామ వ్యాసం వలన ఎక్కడొ మదిలోదాగి ఉన్న పాటను మళ్లీ మీరు గుర్తుచేశారు..” చందమామ నీతోటి పందెం వేసి మబ్బుల్లో దాగుంది సిగ్గేసి..” నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన సినిమా పాట ఇది..మీకు ధన్యవాదాలు..! ఒక మనవి..ఈ పాట అంతర్జాలంలో దొరుకుతున్నదా..? కాస్త లింక్ ఇవ్వగలరా..?

  • mhsgreamspet says:

   @kamal gaaru
   sorry andi.. Aa paata appatlo vinnade. internet lo kuda dorakaledu. Kevalam na gnapakalalo vinademe…
   @prasanna..
   thnx 4 comments
   Ramakrishna

 2. The moon inspires every human being since infancy till death.your story about moon is very nice.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s