గీతాంజలి చిత్రం లో నాకు నచ్చినదేమిటంటే…

గీతాంజలి చిత్రం ఓ timeless classic  అని నా అభిప్రాయం. ఎన్ని సార్లు చూసినా నిత్య నూతనంగా ఉంటుంది ఆ చిత్రం… ఓ గొప్ప చిత్రకారుడు అతి జాగ్రత్తగా గీసిన కాన్వాస్ చిత్రం లాగ అగుపిస్తుంది ఆ సినిమా … అందులోని ప్రతి ఫ్రేము ఓ అందమైన చిత్తరువే..

గీతాంజలి అంటే చక్కటి పాటలు.. అందమైన ఛాయాగ్రహణం.. 100 percent మణిరత్నం మార్కు చిత్రం… అందమైన ప్రేమ కథ.. చక్కటి ఎడిటింగ్… ఇంతే  కాదు … వీటన్నిటిని మించి మనం అంతగా గమనించని ఇంకో అంశం ఉంది… అదే .. పూలకు తావి అద్దినట్టుగా ఆ చిత్రానికి ప్రాణం పోసిన  ఇళయరాజా నేపధ్య సంగీతం (background music). ఆ చిత్రం లోని ప్రతి సన్నివేశానికి, ఆ మూడ్ కి తగ్గట్లుగా అద్భుతం గా background music ని ఇచ్చారు ఇళయరాజా. సినిమా ఆద్యంతమూ, ఆర్ద్రత, ప్రేమ, హుషారు, ఉద్విగ్నత లతో కూడిన ఎన్నో సన్నివేశాలు వస్తుంటాయి… కొన్ని సన్నివేశాలు మనం చూడకుండా కేవలం ఆ సీన్ కి వచ్చే మ్యూజిక్ వింటే చాలు.. ఆ సన్నివేశాన్ని ఫీల్ కావచ్చు.. ఒక సన్నివేశంలో నాగార్జున, గిరిజ ఇద్దరు ఆనందం గా మాటలాడుకుంటూ,  హటాత్తుగా  ఓ శవం ఊరేగింపును చూస్తారు.. చావు దగ్గర పడుతోందని తెలిసిన కథానాయిక “నేనెందుకు చావాలి…?” అని హీరో ని దీనం గా ప్రశ్నించినప్పుడు… ఇళయరాజా అందించే సున్నితమైన ఆలాపన వింటుంటే… గుండె ఓ బీట్ మిస్ అయ్యే ఫీలింగ్.. ఇలాంటి ఎన్నో సన్నివేశాలలో background లో వచ్చే మ్యూజిక్ ఆ సన్నివేశాల్ని  చిరస్మరణీయం చేసాయి.

ఇందులోని నాకు నచ్చిన background score వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s