మనం ఎటు వెళ్తున్నాం?

ఈ  మధ్య  రోజూ  నా  మొబైల్ కి ఓ ఎస్. ఎం. ఎస్. వస్తూ ఉంది. ఆ సందేశం ఓ స్కూల్ లో ప్రవేశానికి సంబంధించింది. మా స్కూల్ లో చేర్చితే.. లక్కి డ్రా లో గెలుపొందిన వారికి విదేశ పర్యటనకు టికెట్లు ఇప్పిస్తాం అని. ఆ సందేశం చదివాక, నాకు ఆశ్చర్యమేసింది.. స్కూల్ అడ్మిషన్ కి విదేశ పర్యటనకి సంబంధమేమిటా అని. స్కూలు లో చేర్పించటానికి ఇలాంటి కొలబద్దలు కూడా ఉంటాయా అనిపించింది.
 
ఒక పేరెంట్ టీచెర్ మీటింగ్ లో “మా అబ్బాయికి ఇంతకు మునుపు 98  శాతం వరకు వచ్చింది. మీ స్కూల్ లో చేర్చాక అది కాస్త 95  అయ్యింది. ఎందుకింత తక్కువ వస్తున్నాయి మా వాడికి ? పైగా మేము ఇంతకు మునుపు కన్నా పది వేలు ఎక్కువే కడుతున్నాము” అని ఓ తండ్రి టీచెర్ తో దబాయింపు. 

“మీరు ఇంకో పది వేలు కడితే వేరే బాచ్ లో మీ వాడిని వేస్తాము. అందులో ఉంటె, ఎంట్రన్సు లో rank గ్యారంటి..” అని ఓ కాలేజి నిర్వాహకుడి  భరోసా..

“మా వాడే ఫలానా ట్యూషన్ లో చేర్పించమని నన్ను పోరి మరీ చేరాడు. ఎందుకంటే.. వాడి క్లాసులో toppers అందరూ  అదే ట్యూషన్ కి వెళ్తారట” ఓ parent ఇంకో  parent తో చర్చ..  

ప్రస్తుత విద్యా రంగంలో ఇలాంటి కొత్త పుంతలు, విచిత్ర  ధోరణులు ఎన్నో కనపడుతున్నాయి.. ఈ మార్పులు   భవిష్యత్తు తరం లో ఎలాంటి పరిణామాలు  తేబోతున్నాయో అని అనిపిస్తోంది. అటు విద్యా యాజమాన్యం, ఇటు తల్లి తండ్రులు.. కూడా ఇలాంటి పరిస్థితులకు కారణం అని చెప్పొచ్చు. పులి మీద పుట్ర లాగ తన సహ విద్యార్థులు బాగా చదువుతున్నారు.. తాను చదవాలి అన్న peer pressure కూడా ఇప్పటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి  . ఇప్పటికే ఇలాంటి పరిణామాల వలన, పిల్లలలో బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం పోయింది. నేర్చుకునే విద్యలో ప్రామాణికత కూడా తగ్గి పోతోంది. విద్యా రంగం పునాదులు బాగుంటేనే.. భవిష్యత్తు లో భరోసా పెట్టుకోగల డాక్టర్లు, ఇంజినీర్లు, మేధావులు దొరుకుతారు.. లేకుంటే మనకు చివరికి మిగిలేవి  కేవలం మెమరీ యంత్రాలే..   .


Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to మనం ఎటు వెళ్తున్నాం?

  1. శివరామప్రసాద్ కప్పగంతు says:

    టెంత్ ఫలితాలు ఇలా వచ్చాయి, అలా మొదలు టి విల్లో ఈ స్కూళ్ళు కాలేజీల చీదర ప్రకటనలు. ఎక్కడన్నా గుడి కి వెళ్తే అక్కడ కొబ్బరి కాయ ఇతర పూజా వస్తువులు మా దగ్గర కొనండి మాదగ్గర అని దేబిరిస్తూ వెంటపడతారు చూడండి అదే పద్ధతి. పైగా ఆ ప్రకటనల్లో ఒకటే వేగం ఎవ్వరికీ అర్ధం పర్ధం లేకుండా. ప్రతివాడూ టాపర్లు తమ దగ్గరే అని ఒకటే బజాయింపు, గోల.

    ప్రభుత్వం, విద్యా సంస్థలు పత్రికల్లో టి విల్లో ప్రకటనలు ఇవ్వటం నిషేధించాలి. విద్య అనేది వస్తువు కాదు, ఊరికే ప్రకటనలు గుప్పించి ఆకర్షించటానికి . ఒక విద్యార్థికి నేర్పాల్సినది.వాళ్ళు బాగా నేర్పుతుంటే ప్రజల్లో ప్రచారం దానంతట అదే రావాలి.

    డాక్టర్లు, లాయర్లు కూడా ఇలా ప్రకటలు టి వి లలో ఇవ్వటం మొదలు పెడితే ఎల్లా ఉంటుంది ఊహించండి. టీచర్లు కూడా డాక్టర్లు,లాయర్లు లాగ సేవలు అందించే వారె కాని వస్తువులు అమ్మేవారు కాదు. అందుకని సేవలు అందించే వారు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధించి కట్టడి చెయ్యాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s