171 …ఏమిటి ఈ సంఖ్యలోని ప్రత్యేకత?

ఏమిటీ నంబరు ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇది నాకు మరువలేని నంబరే..? ఎందుకూ అంటే… ఓ సారి కెమెరాని  తిరిగే పంఖా మీదకి జూమ్ చేసి,  నా ముప్పై ఐదేళ్ళ క్రితపు ఫ్లాష్ బ్యాక్ కి రండి.

ఎనిమిది ఏళ్ళ  వరకు చదువు సంధ్యలు లేకపోవటం తో, ఓ ట్యూషన్ లో చేరాను. మా టీచర్ కి ముగ్గురు సిస్టర్స్.వాళ్ళ ఇంట్లో అందరూ వంతుల వారీగా ట్యూషన్ చెప్పే వాళ్ళు… . (ఇది బాలాజీ నగర్ లో,  రామచంద్ర అక్క గాయత్రి వాళ్ళ ఇంటి ప్రక్కనే ఉంది). ముందుగా Multiplication tables  నేర్చుకోమని మా teacher చెప్పింది. నేను చేరేటప్పటికే అందులో ఓ ఎక్కాల (muliplications tables ) దాదా ఉండేవాడు. అంటే ఏ multiplication అడిగినా తడుముకోకుండా చెప్పేవాడు.అక్కడ టీచర్ అడిగే multiplication ఎవరైనా చెప్పలేక పోతే, కరెక్ట్ గా చెప్పిన వారు వాళ్ళ చెంప చెళ్ళుమనిపించాలి. ఇంకేముంది … మన దాదా దగ్గర అందరూ చెంప చెళ్ళుమనిపించుకున్న వాళ్ళే… నేను వెళ్ళాక, తనకి నాకు పోటి మొదలయింది.  16 నుండి 19 ఎక్కాల వరకూ మన దాదా కొంచం shaky గా ఉండేవాడు. తను చెప్పలేనిది నేను కరెక్ట్ గా చెప్పే సరికి, ఓ రెండు సందర్భాలలో తన చెంప చెళ్ళుమనిపించాల్సి వచ్చింది. ట్యూషన్ లో అందరూ సంతోషించారు తన చెంప చెళ్ళుమనడం తో. మా టీచర్ కి ఆ దాదా favorite . తనకి నా చేతిలో చెంప దెబ్బ పడటం ఆ మేడం కి రుచించ లేదు. ఓ రోజు 19 వ ఎక్కం లో పోటీ మొదలైంది. మా దాదా ముందే సన్నద్ధమై వచ్చాడు. ముందుగా మేడం  నన్ను   “పందొమ్మిది తొమ్మిదులు ఎంతరా..?” అని అడిగింది. నేను 171 అని  చెప్పాను. అది తప్పు అని.. మేడం మన దాదా ని అడిగింది. తనూ అదే చెప్పాడు. వెంటనే తను correct అని నన్ను చూపిస్తూ “వాడికి చెంప దెబ్బలు వెయ్యరా..” అని ఆజ్ఞాపించింది. “నేనూ అదే జవాబు చెప్పాను” అని చెప్పాను మేడం కి. కానీ మేడం వినిపించుకోలేదు.  పక్కనే వున్న మా టీచర్ చెల్లెలు కూడా  “తను చెప్పింది కూడా 171 .  తను కరెక్ట్ గానే చెప్పాడు” అంది. అక్కడే వున్న మిగతా పిల్లలు కూడా అదే చెప్పారు. “లేదు.. వాడు 71 అని చెప్పాడు” అని వాదించింది మేడం. చివరికి ఆ దాదా చేతిలో నా చెంపలు చెళ్ళుమన్నాయి.  నిర్విణునైపోయాను.. తర్వాతెప్పుడు ఆ నెంబర్ చూసినా ఈ సంఘటనే  గుర్తొస్తూ ఉంటుంది.


Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to 171 …ఏమిటి ఈ సంఖ్యలోని ప్రత్యేకత?

  1. Ramakrishna,by the time you might have friendship with Ramachandra.so u try2convince the tution teacher.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s