అద్నాన్ సమి- నాకు నచ్చిన పాటలు

నిన్న అద్నాన్ సమి స్వీయ సంగీత సారధ్యం లోని ఓ చక్కటి పాట గురించి రాసాను. తన పాటలు నేను వినడం “కభి తో నజర్ మిలావో..” అన్న ఓ ప్రైవేటు మ్యూజిక్ ఆల్బం తో మొదలయింది. అందులో ఆశ భోస్లె తో చక్కటి పాటలు పాడారు. తరవాత “తేరా చెహర” అన్న ఇంకో ప్రైవేటు ఆల్బం రూపొందించారు. ఈ పాటలన్నిటినీ  వీడియో ఆల్బం గా రూపొందించారు. దృశ్య పరంగానూ కొన్ని పాటలు బాగుంటాయి..  “కభి తో నజర్ మిలావో..” అన్న పాటని అదితి గోవిత్రికర్(తఃను డాక్టర్,  మోడల్,  తల్లి లాంటి భిన్నమైన భూమికల్ని నిజ జీవితం లో పోషిస్తోంది) , సలీల్ అంకోల (ఒకప్పటి క్రికెట్ ఆటగాడు) పై  చిత్రీకరించిన ఈ పాట చాల soothing గా ఉంటుంది. అలాగే “తేరా చెహర” అన్న టైటిల్ సాంగ్ ని అద్నాన్ సమి, రాణి ముఖేర్జీ ల పై చిత్రీకరించారు. ఈ రెండు ఆల్బమ్స్ లో నాకు నచ్చిన పాటలు

1.  “కభి తో నజర్ మిలావో..కభి తో కరీబ్ ఆవో..జో నహి కహా హై… తో భి తో సమఝ్ భి జావో..”. ఇక్కడ వినండి.
2. “ప్యార్ బిన జీనా నహి జీనా … ముఝ్ సే బిచడ్   నా కభి నా…”.
3. “భీగీ భీగీ రాతోం మే … ఫిర్ తుం ఆవోనా.. ఐసి బర్సాతోం మే ఆవోనా…”. ఇక్కడ వినండి.

4. “ఏ జమీన్ రుక్ జాయే … ఆస్మాన్ ఝుక్ జాయే… తెర చేహెర జబ్ నజర్ ఆయే..” . ఇక్కడ వినండి.

ఈ పాటలలో ఏదో తెలియని ఎడబాటు, దుఃఖము..ఒంటరి తనం ధ్వనిస్తూ ఉంటాయి (ముఖ్యం గా చివరి రెండు పాటలలో..) హృదయాన్ని సున్నితంగా స్పృశిస్తూ దుఖాన్ని ఆస్వాదించేలా చేయగలవీ పాటలు.

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

5 Responses to అద్నాన్ సమి- నాకు నచ్చిన పాటలు

 1. “కభీ తో నజర్ మిలావో…” అద్నాన్ పాట కోసం కన్నా సలీల్ అంకోలా కోసం ఎక్కువ చూసేదాన్నండి..:) అప్పట్లో “కోరా కాగజ్” అని స్టార్ ప్లస్ లో ఒక సీరియల్ వచ్చేది. చాలా బావుండేది. రేణుక సహాని, సలీల్ అంకోలా అందులో లీడ్ కారెక్టర్స్.

  మీరు రాసిన లిస్ట్లో మూడు,నాలుగు కూడా గుర్తున్నాయి. చాలా బావుంటాయి.
  ” ముఝ్ కో భీ తు లిఫ్ట్ కరాదే…” పాట గురించి రాయలేదేమండి? భలే హిట్ అయ్యిందా పాట. అది కాపి కొట్టే “గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా” అని రవితేజతో పాట చేసారు.

 2. g srinivasarao says:

  Adnan my favorite singer. his voice is gives you a feeling of nectar dropping slowly down the neck. just that. when listening to his songs simply i will be in different world.

 3. g srinivasarao says:

  i thought of ever i see him in my life? it happened on one day, met him and did excellent interview for eenadu daily. had photograph with him.

 4. g srinivasarao says:

  love to see you all adnan fans.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s