ఆ ఐడియా అంత గొప్పదని అప్పుడు ఊహించలేదు

కొన్ని ఐడియా లు జీవితాన్ని మార్చకపోయినా, ఎంతో సంతోషాన్నివ్వగలవు. అలాంటి ఐడియా నే మన మిత్రుడు పట్టాభి రామన్ ఇచ్చాడు. మన మిత్రులు ముప్పై ఏళ్ళ తరవాత (సుమారు అరవై మంది) కలిసినప్పుడు,  పట్టాభి అందరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ spouse పుట్టిన రోజు లాంటి వివరాలు మనం తయారు చేసిన database లో పొందుపరిచాడు. నిజం చెప్పాలంటే, ఆ సమయం లో ఈ వివరాలన్నీ ఎందుకా అనుకున్నాను. కాని, తరవాత, ఆ వివరాల ప్రకారం, ప్రతి ఒక్కరి పుట్టిన రోజు లేక పెళ్లి రోజు కు ఒక రోజు ముందు, పట్టాభి అందరికి way2sms  ద్వారా ఎస్. ఎం. ఎస్ లు ఇచ్చి అలెర్ట్ చేసేవాడు. అందువలన ప్రతి  ఒక్కరికి వాళ్ళ పుట్టిన/ పెళ్లి రోజు నాడు, మన మిత్రులంతా తప్పక విష్ చేయడం మొదలయింది. అంత మంది మిత్రులు, అదీ చిన్న నాటి మిత్రులు మనల్ని విష్ చేస్తుంటే, పొందే ఆనందం నిజంగా వర్ణించలేనిది. అది చూసాక, అంత చక్కటి ఐడియా ని అమలు పరిచిన పట్టాభి ని అభినందించకుండా ఉండలేకపోయాను.

నిన్న ప్రమీల పుట్టిన రోజు. రేపు అంటే May 28 మన పట్టాభి పుట్టిన రోజు. అందరి mobiles కి విషెస్ చెప్పమని ఎస్. ఎం .ఎస్ ఇచ్చినా, మన బ్లాగు ముఖంగా ఇంకో సారి ఆ ఇద్దరికీ హార్థిక జన్మ దిన శుభాకాంక్షలు చెపుదాము. ముప్పై ఏళ్ళ తరవాత మళ్లీ నాటి రోజుల్ని నాటి మిత్రులతో ఎంతో అపురూపంగా పునర్జీవిస్తున్న మన మిత్ర బృందం అంతా ఎంతో అదృష్టవంతులని చెప్పాలి.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s