నా(టి) ఇల్లు- జ్ఞాపకాల పొదరిల్లు

జ్ఞాపకాల శకలాలు“Home is where your heart is” అని అంటారు. ఇల్లు అంటే నా మనో ఫలకం లో మెదిలే ఇల్లు ఇదే. నలభై ఏళ్ళ క్రితం ఈ ఇంట్లో నా జీవన ప్రయాణం మొదలయింది ఇక్కడినుండే.. ఈ ఇంటికి ఎదురు గా హిమాయత్ అనే ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇంటి ఎదురుగా సన్నటి సందు.. ఆ సందు చివర్లో ఓ షాపు… నాన్న అప్పట్లో ఐదు రూపాయల నోటు ఇచ్చి, చిల్లర తెమ్మని ఆ షాపు కి పంపారో సారి. షాపు వాడు ఇచ్చిన చిల్లర తీసుకు వస్తుంటే, ఒక అబ్బాయి , అంతకంటే ఎక్కువ చిల్లర ఇస్తానని ఆ చిల్లర పట్టుకెళ్ళాడు. ఎంతకూ తిరిగి రాక పోయేసరికి, బిక్కమొహం వేసుకుని ఇంటికి వెళ్లి నాన్నకి చెప్పాను.

ఈ ఇంట్లోనే నాకో ఇష్టమైన ఉయ్యాల ఉండేది.. అన్నయ్యని ముట్టనిచ్చేవాడిని కాదు. ఓ సారి ఈజీ చైర్ పై కూర్చుని నాన్నతో కబుర్లు చెపుతూ కింద పడినప్పుడు కంటి దగ్గర తగిలిన గాయం, ఇప్పటికి గుర్తై, నాటి జ్ఞాపకాల చిహ్నమై నిలిచింది.

వర్షం పడుతుంటే… చీకట్లో… కిటికీ ముందు కూర్చుని నాన్న కోసం ఎదురు చూసిందీ ఈ ఇంట్లోనే. నాకిష్టమైన ఓ కోడి పుంజు తో ఆడుకుందీ  ఇక్కడే.. చుట్టూ పక్కల వాళ్ళు ఉర్దూ మాట్లాడుతుంటే, వారి నుండి నేర్చుకుని ఉర్దూ లో మాట్లాడుతుంటే… ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయేవారు.

ఇలాంటి ఎన్నో స్మృతులకు ఆలవాలమీ ఇల్లు. ఈ మధ్య, అన్నయ్య, నేను ఈ జ్ఞాపకాలను  తడిమి చూసుకోటానికి ఆ వూరు వెళ్ళినపుడు, ఈ ఇల్లు ఉండదేమో అని సంశయిస్తూ వెళ్ళాము. కాని… శిధిలావస్థలో ఇప్పటికీ నిలిచి వున్న ఆ ఇంటిని చూసే సరికి, నలభై వసంతాల నాటి జ్ఞాపకాలు ఉప్పెనలా కమ్ముకున్నాయి.. ఆ వూరు వదిలిన చివరి రాత్రి ఇప్పటికీ గుర్తే.. ఆ ఇంటి నుండి వెళ్ళిపోయిన నాటి నుండి జీవితం లో ఎన్ని మలుపులు.. పరిచయాలు.. బంధాలు.. సంతోషాలు… దుఖాలు.. ఈ ప్రయాణాన్ని పాటలాగా చెప్పాలంటే..

आते  जाते  रस्ते  में , यादे  छोड़  जाता  है

 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to నా(టి) ఇల్లు- జ్ఞాపకాల పొదరిల్లు

 1. Praveen Sarma says:

  ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి. ఇట్లు నిర్వాహకులు

 2. ఈ సందర్భానికి ఇంకో మంచి పాట చెప్పనాండీ..?

  “छॊडायॆ हम वॊ गलियां….”

  • mhsgreamspet says:

   తృష్ణ గారు
   మాచిస్ లోని ఆ పాట నాకు చాల ఇష్టమండీ. మీరు చెప్పినట్లు ఈ పాట సందోర్భోచితం గా ఉంది నాకు గుర్తొచ్చిన పాట కంటే. 🙂
   రామకృష్ణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s