మనం టెక్నాలజీ కి బానిసలమా…?

ఈ మధ్య చూసిన “రోబో” చిత్రం లో నాకు నచ్చిన దేమిటంటే… అందులో చివర్లో ఇచ్చే సందేశం… ” ఎంత పురోగతి సాధించినా.. యంత్రం యంత్రమే.. మనిషికి సాటి రాదు .. రాలేదు… రాకూడదు…” అని. టెక్నాలజీ కి , మనిషి కి మధ్య జరిగే పోటీలో చివరి గెలుపు మనిషిదే ఔతుంది.

నాకు ఫ్యాను గాలి అంటే పదిహేడేళ్ళ వరకు తెలియదు.. అదీ ఓ కాలేజి హాస్టల్ కి వెళ్తేనే… టేప్ రికార్డర్ ఇరవయ్యవ ఏట ఇంటికి తెచ్చినప్పుడు నేను పడ్డ ఆనందం అంత ఇంతా కాదు… నాకు నచ్చిన పాటలు మొత్తం మూడు తొంభై నిమిషాల కాసేట్ ల లో రికార్డ్ చేసుకుని అబ్బురం గా వినేవాడిని. చిన్నప్పుడు కూల్ డ్రింక్స్ అంటే నాకు చాల ఇష్టం.. “సినిమా actors   దగ్గర చాల డబ్బులుంటాయి.. ఎంతంటే… వారి ఇంట్లో ఫ్రిజ్ ఉందుకుని అందులో కూల్ డ్రింక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగుతారు.. ఆహా… జీవితమంటే అదే కదా.. “అని ఈర్ష్య పడేవాడిని. ఇంటికి ఫోన్ చేయాలంటే.. trunk కాల్ బుక్ చేసి, స్థానిక పోస్ట్ ఆఫీసు కి వెళ్లి వేచి ఉండేవాళ్ళం.

ప్రస్తుతం… ఒక్క సారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి… ఇంటర్నెట్ , మొబైల్ ఫోన్, కరెంట్, ఫ్రిజ్, ఫాన్ లేకుండా… ఒక్క దినం… ఒక్క గంట ఊహించుకోగలమా..వీటి మీద ఆధార పడటం ఎంత మోతాదులో ఉండాలి అన్నది ప్రశ్నార్ధకమే.. పాశ్చాత్య దేశాలలో టెక్నాలజీ మీద ఆధారపడటం మరీ ఎక్కువ. కార్లో జీ. పీ. ఎస్ పని చేయకపోతే … రోజూ వెళ్ళే ఆఫీసు కి కూడా దారి తెలియని  పరిస్థితి. కరెంట్ కొన్ని గంటల పాటు లేకుంటే.. ఫ్రోజెన్ ఫుడ్ పారవేయాల్సిన పరిస్థితి.. తిండి కి నక నకలాడాల్సిన దుస్థితి.

వీటన్నిటికీ ప్రత్యామ్నాయాలు వెతుక్కోక పోతే… ఇవి లేని నాడు, జీవితాన్ని గడపటం దుర్లభం అయిపోతుంది.. స్థూలం గా చెప్పాలంటే.. టెక్నాలజీ మనల్ని శాసించే  స్థితిని తెచ్చుకోకూడదు. అవి లేకున్నా మనగలిగేటట్లుగా మనల్ని మనం కండిషన్ చేసుకోవాలి.. అది అసాధ్యమేమీ కాదు.. ఎందుకంటే.. ఇప్పుడున్న టేక్నాలజీలేవీ లేకుండా ఒకప్పుడు మనం జీవించాం గనక ..వీలైతే.. మొబైల్ లాంటి gadgets   లేకుండా ఓ రోజు జీవించి చూద్దాం. వాటికి బానిసలు కాలేదని నిరూపించుకుందాం.

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to మనం టెక్నాలజీ కి బానిసలమా…?

  1. Now a days,everybody is depending on latest technology in a walk of life,especially thn youth for each&every work.For viz..even for a simple arthamatic caliculations also they seek aid of caliculators,these things should be curtailed.Most of the youth dont know the postcard is the communicating devise for the coman man till 20th century.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s