నృత్య దర్శకురాలు స్వర్ణ జన్మదిన సందర్భంగా…

 

 

 

 

జూన్ 1 ప్రముఖ నృత్య దర్శకురాలు స్వర్ణ జన్మ దినం. తను 1976 నుండి 1983 వరకూ స్కూల్ లో ను కాలేజ్ లోనూ మాతో పాటు చదువుకుంది. కలై వాణి  తన అప్పటి… ఇప్పటి ప్రాణ స్నేహితురాలు.   స్కూల్  రోజుల్లో ప్రతి ఫంక్షన్ లోనూ తన నృత్య ప్రదర్శన్ ఉండాల్సిందే.. ఊళ్ళో ఉన్న ఎన్నో సాంసృతిక సంఘాల ఆధ్వర్యం లో నృత్య ప్రదర్శనలిచ్చి ఎన్నో సత్కారాలు పొందింది.  తరవాత తిరుపతి లో మ్యూజిక్ కాలేజీ లో డిగ్రీ చేసింది. డిగ్రీ తరవాత మద్రాసు లో చిత్ర సీమ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.కేవలం తన స్వశక్తి తో ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఈ రోజు చిత్ర సీమ లో తనకంటూ ఓ niche ని ఏర్పరచుకుంది.

తను మా స్కూల్ రోజుల్లో ఎలా ఉందొ, ఇప్పుడూ అలాగే అందరితో అంతే ఆత్మీయం గా మాట్లాడుతుంది. ఎంతో మంది పేద వారికి తన వంతుగా సాయం చేసి ఆదుకుంటుంది ఇప్పటికీ. ఎక్కడున్నా సింప్లిసిటీ ని ఇష్టపడే స్వర్ణ మా క్లాస్మేట్స్ అందరికీ ఆప్తురాలు.   “ప్రార్థించే పెదవుల కన్నా .. సాయపడే చేతులే మిన్న…” అన్న కొటేషన్ ఉన్న వాల్ హంగింగ్ తన ఇంట్లో ప్రముఖంగా దర్శనమిస్తుంది. ఆ కొటేషన్ తన వ్యక్తిత్వానికి దర్పణం.

అప్పట్లో ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శన లో స్వర్ణ (ఎడమ వైపు)

అప్పట్లో ఇచ్చిన ఓ నృత్య ప్రదర్శన లో స్వర్ణ (ఎడమ వైపు)

వ్యక్తి గానే కాదు… ఒక మంచి నృత్య దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. ఇన్ని సంవత్సరాలుగా.. చిత్ర సీమ లో ఎన్నో (సుమారు 600 పైగా) చిత్రాలకు నృత్య రీతులు కూర్చింది… ఈ మధ్య… చిత్రాలలో  నృత్యపరంగా హిట్ అయ్యిన పాటలెన్నో. అన్ని రకాల మూడ్స్ కి నృత్య దర్శకత్వం నెరపటంలో తనదైన శైలి ఉంటుంది.. వేదం లో ” ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” , హాపీ డేస్ లో ” పాదమెటు పోతున్న … పయనమెందాకైనా..”, ప్రాణం లో ” నిండు నూరేళ్ళ సావాసం…”, ఔను … వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు లో ” రా .. రమ్మని… రా. రా. రమ్మని” లాంటి కొన్ని పాటలు తన నృత్య దర్శకత్వపు రేంజ్ ని తెలుపుతుంది. తెలుగు లోనే కాదు.. ప్రస్తుతం ఒరియా లో, మలయాళం లో కూడా చిత్ర్రాలకు choreography చేసి, అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది..

ఎంత ఎదిగినా … నమ్రత తో ఒదిగి ఉండే ఓ మంచి కళాకారిణి, వ్యక్తి కి మా క్లాస్మేట్స్ అందరి తరపునా హృదయపూర్వక శుభకాంక్షలు..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

2 Responses to నృత్య దర్శకురాలు స్వర్ణ జన్మదిన సందర్భంగా…

  1. We proud to be swarna’s classmate .she maintains same relationship with almost all of our friendr tii today.I wish her many more returns of the day by grace of Lord Varasiddi vinayaka.

  2. Ravi Kumar Kona says:

    MANY HAPPY RETURNS OF THE DAY……..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s