ఇళయరాజా అంటే గుర్తొచ్చే ఎన్నో పాటల్లో కొన్ని…

పేరు లోనే లయ ఉన్న సంగీత స్వర మాంత్రికుడు ఇళయ రాజ. అతని పుట్టిన రోజు సందర్భంగా తను వెదజల్లిన స్వర పరిమళాలను ఓ సారి పునః ఆఘ్రాణించుదాము.  నాకు పాటల పైన ఓ ఇష్టం ఏర్పడుతున్న సమయం లోనే ఇళయ రాజ సంగీత ప్రవాహం మొదలయ్యింది. బహుశా, తన స్వరాలూ వినడంతోనే ఆ ఇష్టం ఇంకా ఎక్కువయ్యిందేమో. తన పాటల్ని వింటుంటే…”అన్నక్కిలి ఉన్నై తేడుదే…” (తెలుగులో “రామచిలక పెళ్లి కోడుకెవరే…”) అన్న పాట ,. “సిరిమల్లె పూవా…” అన్న “పదహారేళ్ళ వయసు” లో పాట కాని వింటుంటే, “వయసు పిలిచింది” లో ” ఇలాగే… ఇలాగే .. సరాగ మాడితే..” అన్న పాట … ఒక్క సారి మన వూరు… అక్కడి వీధులు గుర్తొస్తాయి. తెలుగు లో విశ్వనాధ్ తో ” “సాగర సంగమం”, స్వాతి ముత్యం, స్వర్ణ కమలం … అలాగే వంశీ తో ” అన్వేషణ” , “సితార”లాంటి  ఆణి ముత్యాలనందిచినా.. నాకు తన పాట అంటే, తమిళ పాటలే గుర్తు వస్తాయి. ఎందుకంటే మన వూరికి… ఆ పాటలకూ ఓ అవినాభావ సంబంధం ఉంది కనుక. ఇంతకు మునుపు ఓ సారి చెప్పినంట్లు గా, ఇళయ రాజ చిత్రాలలో నేను ఎక్కువ గా ఇష్టపడేది నేపధ్య సంగీతం.. తన ప్రతి చిత్రంలోనూ… ప్రతి భావానికి ఓ భావగర్భితమైన  స్వరాన్ని  నేపధ్యసంగీతం లో అందిస్తారు.. ముఖ్యం గా… సాగర సంగమం లో కమల్, జయప్రద ల ప్రేమ సన్నివేశాలలో, స్వాతిముత్యం లో రాధిక కమల్ ని ఓ తల్లి లాగ చూసే సన్నివేశాలలో, గీతాంజలి లో … ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో…  ఆఖరికి “శివ” లాంటి యాక్షన్ చిత్రం లో కూడా తన నేపధ్య సంగీతం ఉత్కం టత ని కలిగిస్తుంది.
రెహమాన్ ప్రవాహం లో తన వేగం తగ్గినా… ఈ మధ్య విడుదలైన ” చీని కమ్” లో ” జానే దో నా…” అన్న శ్రేయ ఘోషల్ పాట కాని, “ఓం శాంతి” లో ” చిన్న పోలికే లేదు ప్రేమా… నిన్నకూ నేటికి.. “, అన్న పాటలు వింటే… తనలో ఆ నాటి freshness ఇంకా అలాగే ఉందని తెలిసిపోతుంది.
తన పాటలు నాకు నచ్చినవి మరి కొన్ని…

బాబోయ్ … ఇలా రాస్తూ పోతే… ఇంకా  ఎన్నో పాటలు.. మరువలేనివి… మధురమైనవి .. ఎన్నో మరువలేని గీతాల్ని అందించి, వీనులవిందు చేసిన, చేస్తున్న ఆ స్వర సామ్రాట్టుకి జన్మదిన శుభాకాంక్ష లందిస్తూ..

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

3 Responses to ఇళయరాజా అంటే గుర్తొచ్చే ఎన్నో పాటల్లో కొన్ని…

 1. సిరిమల్లె పువా..ఇళయరాజా నా? “చక్రవర్తి” కదా?

  మీరు రాసినవి మిగిలినవి చాలావరకూ నాకూ ఇష్టమైనవే. ఇది కూడా చూసేయండి..
  http://trishnaventa.blogspot.com/2011/06/blog-post_02.html

  • mhsgreamspet says:

   Trishna gaaru
   technically it is chakraverhy. But it has been an adaptation from Padunaaru vayadunile… Mee tapa already choosaanandi. it is gr8.:)
   Ramakrishna

 2. sree says:

  మీ సంగతేమో కాని, ఇళయరాజా తెలుగు పాటలు చాలా బాగుంటాయి. రచయితలు మంచి పదాలతో రాసిన పాటలు ఎప్పటికీ తాజాగా అనిపిస్తాయి. “ప్రేమించు పెళ్ళాడు” లో “వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం..”, “గోపెమ్మ చేతిలోన గోరుముద్ద..రాధమ్మ చేతిలో వెన్నముద్ద..” పాటలు వినసొంపుగా ఉంటాయి. అలాగే “నిరీక్షణ” చిత్రం లో పాటలు “ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే”, “తీయని దానిమ్మ” ఇలా ఎన్నో ఉన్నాయి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s