బహుముఖ ప్రజ్ఞా శాలి… బాలు

నేను ఇద్దరి గురించి బ్లాగులో రాయటానికి జంకు తాను. ఒకరు ఇళయ రాజ అయితే ఇంకొకరు బాలు గారు. ఎందుకంటే… వారి గురించి ఎంత రాసినా తక్కువే… అందుకనే బాలు గారికి ఈ ఏడు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా తనని అభినందిస్తూ బ్లాగు లో టపా పెట్టలేకపోయాను. ఈ ఇద్దరు స్రష్టల జన్మ దినాలు  కేవలం రెండు రోజుల వ్యవధి లో రావటం కాకతాళీయమే. బాలు గారి జన్మ దినమైన నాలుగవ తారీకు న వూళ్ళో లేను. వెళ్ళిన ప్రదేశంలో ఇంటర్నెట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. అందుకే, ఆలస్యమైనా ఆ స్వర ధనుడికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఇది ఊహించే , వారం రోజుల మునుపే, తనని స్మరిస్తూ ఓ టపా రాసాను.
ఇకపోతే బాలు స్వరాలతోనే నాకు పాటలన్నా… అందులోని సాహిత్యమన్నా ఇష్టం ఏర్పడింది. “ఏ దివిలో విరిసిన పారిజాతమో” అంటూ లేత కొబ్బరి లాంటి తన స్వరం వింటే, ఇప్పటికి ఓ మైమరుపు… ఓ తన్మయత్వం.. తన పాటల గురించి రాయటం  దుస్సాహసమే అవుతుంది  కాబట్టి, తనలో నాకు నచ్చిన ఇతర విషయాలు, ఈ టపాలో రాస్తాను. తనని చూస్తే గురువులని ఎలా గౌరవించాలి అన్నది నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భం లో ను ఎస్. పీ కోదండ పాణి  గురించి తను స్మరించుకోవటం చూస్తే నిజమైన శిష్యుడు కనపడతాడు తనలో. పోటీ తత్వం లేకుండా, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని తను అభినందించే తీరు అనితర సాధ్యం. ఘంటసాల గారి గురించి గాని, మహమద్ రఫీ గురించ్జ్హి కాని తన  మాటలు వింటే ” తనకి కొంచం కూడా అసూయ  ఉండదా..” అనిపిస్తుంది.

“పాడుతా తీయగా” లాంటి కార్య క్రమాలలో, పాట పాటకి మధ్య అతని వ్యాఖ్యానం కోసమే నేను చూస్తుంటాను. ఉచ్చారణ, ఆలోచనలలోని స్పష్టత, పద ప్రయోగం, మాటలలోని నిజాయితి, మధ్య మధ్యలో హాస్యం, ఇలా ఎన్నో చూడొచ్చు  తన మాటలలో.

తమిళం లోనూ తన భాషా పటిమ అంతే గొప్పది. కన్నడ, తమిళం , తెలుగు భాష ల లో వ్యాఖ్యత గా వ్యవరించిన వ్యక్తి  తను ఒక్కరేనేమో..

మిమిక్రీ.. ప్రతి కళాకారుడి గాత్ర ధర్మాన్ని అనుసరించి, వారి లాగే పాడటం బాలు కే చెల్లింది. అల్లు కోసం “ముత్యాలు వస్తావా”, రాజ బాబు కోసం ” ఆకాశం నుంచి నా కోసం వచ్చావా..”, ఎన్ . టీ . ఆర్. కోసం ” తొలిసారి ముద్దివ్వమందీ..”,  ఏ. ఎన్. ఆర్ కోసం”నా కళ్ళు చెపుతున్నాయి …”, ఇవన్ని ఒకరే పాడారంటే నమ్మగలరా?

నటనలోనూ తనదైన ముద్ర వేసారు బాలు. “కేలడి కన్మణీ” (తెలుగు లో “ఓ పాప లాలి”) లో కూతురి కోసం తపన పడే తండ్రి గా తన నటన అపూర్వం. ఎంతో సహజ సిద్ధం గా ఉంటుంది  తన నటన అందులో.

సంగీత స్వర కల్పన లో కూడా బాలు గారి మార్కు ఉంటుంది. “కన్య కుమారి” లో “ఇది తొలి పాట… ఒక చెలి పాట..” అంటూ మొదలైన తన ప్రస్థానం “తూర్పు వెళ్ళే రైలు” లో “చుట్టూ చెంగామి చీర కట్టావే చిలకమ్మా”, మయూరి లో ” ఈ పాదం… ఇల లోన  నాట్య వేదం”, జాకి లో ” అలా మండి పడకే జాబిలీ ..” అన్న మరపు రాని ఎన్నో  పాటలని అందించింది.

ఇంతటి బహు ముఖ ప్రజ్ఞా శాలి గురించి ఎంత రాసిన తక్కువే.

 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

One Response to బహుముఖ ప్రజ్ఞా శాలి… బాలు

  1. Sp.Balasubramanyam is a genious play back singer.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s