అరకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే ఈ టపా చదవండి

 పచ్చని ధనమే.. పచ్చదనమే..

పచ్చని ధనమే.. పచ్చదనమే..

ఎంతో కాలం గా అరకు చూడాలన్న కోరిక ఈ మధ్యనే తీరింది. హార్స్లీ కొండల తరవాత మళ్లీ ప్రకృతి లో పరవశించిన ప్రదేశం ఇదే.. ఇక్కడ ఉన్న మూడు రోజులూ కంటికి  ఒకటే రంగు కనిపించేది.. పచ్చని పచ్చ “ధనం:..ఎటు చూసినా మొక్కలు, వృక్షాలు… పచ్చదనపు different shades లో కనువిందు చేస్తాయి. విశాఖ లో సముద్ర తీరం… ఆ పై ఓ హిల్ స్టేషన్ ఇంత దగ్గరలో ఉండటం… విహార యాత్రికులకు నిజంగా వరం.
ఈ ప్రదేశాన్ని  ఏ. పీ టూరిజం వాళ్ళు బాగా అభివృద్ది చేసారు. అరకు లో మయూర, వ్యాలీ రిసార్ట్ అని రెండు కాటేజేస్ ఉన్నాయి. వైజాగ్ నుండి బస్సులో వెళ్తే, మయూర చాల దగ్గర గా ఉంటుంది. దీని పక్కనే ట్రైబల్ మ్యూజియం , కాఫీ హౌజ్ ఉన్నాయి. ఇది కాక పద్మాపురం గార్డెన్స్ చూడ దగ్గ ప్రదేశం.
ఇక్కడ కాటేజేస్ తో పాటు రెస్టారెంట్ , స్విమ్మింగ్ పూల్ ఉండటం అదనపు ఆకర్షణ.అరకు లోయ దగ్గర లో చాప రాయి అనే ప్రదేశం లో వాగులు వుంటాయి. ఇది కూడా చూడ చక్కని ప్రదేశం.

ఇది కాక ఇక్కడికి సుమారు ఇరవై కి. మీ దూరం లో బొర్రా గుహలు ఉన్నాయి. వైజాగ్ నుండి రైల్లో వెళ్తే, ఇక్కడే దిగవచ్చు. ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే ఇంకో టపా కావాల్సిందే… అంత చక్కని ప్రదేశం ఇది.

అరకు కి ఇరవై ఐదు కి. మీ దూరం లో అనంత గిరి అన్న ప్రదేశం ఉంది . ఇక్కడ కూడా ఏ. పీ టూరిజం వాళ్ళ కాటేజేస్ ఉన్నాయి. నాకెందుకో ఇక్కడి కాటేజేస్ చాల బాగున్నాయి అనిపించింది. అన్ని కాటేజేస్ లోయకు అభిముఖం గా ఉండటం, చాల చక్కని వ్యూ పాయింట్ ఇది. ఇక్కడి రెస్టారెంట్ కూడా బెటర్ అనిపించింది. ఇక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి.

ఇంకా ముందుకి .. అంటే.. అరకు నుండి ముప్పై ఐదు కి. మీ దూరం లో టైడా జంగిల్ బెల్ల్స్ అనే ఎకో టూరిజం రిసార్ట్ ఉంది. ఇక్కడ దుంగలతో చేసిన లాగ్ హౌజేస్ ఉంటాయి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే .. నా సలహా ఏంటంటే… అనంతగిరి లో కాటేజ్  తీసుకుని, అక్కడ నుండి రోజుకో ప్రదేశం చూసి రావటం బెటర్. సాధారణంగా ఎన్ని ఎక్కువ ప్రదేశాలు చూసి వస్తే అంత బాగుంటుంది అని అనుకుంటాము. కాని.. వెళ్ళే కొన్ని ప్రదేశాలైనా … కనీసం ఒక్క రోజైనా  ఉండి… అక్కడి ప్రకృతి రమణీయతని  ఆస్వాదించటం ఉత్తమం.


Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s