జగజీత్ సింగ్ గీతాలు- సున్నితమైన భావ ప్రకటనకి అద్దాలు

వెన్నెల్లో విహరిస్తూ, జగజీత్ సింగ్ గజల్ వింటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.  ప్రేమ అన్న విశ్వజనీన భావనని ఎంత  అందంగా వ్యక్తీకరించవచ్చో తన పాటల్ని వింటే.. చూస్తే.. తెలుస్తుంది. అలాంటి తన పాటలు కొన్ని మ్యూజిక్ videosగా వచ్చాయి. అందులో నాకు బాగా నచ్చినది तेरा चेहरा है आइने जैसा.. అన్న గజల్.. ఈ వీడియో లో ఓ నర్తకి ని ముఖం చూడకుండా ఆరాధించే ఓ యువకుడిని చూపిస్తూ సాగుతుంది పాట చిత్రీకరణ.. ఒక సందర్భం లో రైల్లో వెళుతూ… అనుకోకుండా తనని దూరం నుండి చూసి.. కలవటానికి విఫల ప్రయత్నం చేస్తాడు ఆ యువకుడు. చివరివరకు అతడు ఆరాధించే ఆమె ముఖాన్ని చూపకుండానే సున్నితంగా ముగిస్తుందీ  పాట. ఎంతో ఆహ్లాదకరం గా… వెన్నెల నే మీగడ తరకలుగా చేసుకుని ఆస్వాదించినంత మధురం గా ఉంటుందీ పాట..

అలాగే జగజీత్ సింగ్  గళం నుండి వెలువడిన ఇంకో మధురమైన గీతం “किसका चेहरा अब मैं देखू … तेरा चेहरा देख कर” . ఈ పాట అల్క యాగ్నిక్ తో పాడిన యుగళ గీతం.. మిలింద్ సోమన్ , టబూ ల పై చిత్రీకరించిన ఈ పాట ఎంతో అందంగా ఉంటుంది ..
ఈ పాటల్ని ఇక్కడ వినండి… ఓ సారి వెన్నెల్లో పిల్ల తెమ్మేరలతో విహరించండి..

तेरा चेहरा है आइने जैसा.

किसका चेहरा अब मैं देखू


Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s