ఈ రోజు ఏమయ్యిందంటే …

లోకాన్ని వేగంగా చూడాలంటె.. సిటీ బస్సుల్లో ప్రయాణిస్తే చాలు… సీట్ల కోసం తోపులాటలు… కీచులాటలు.. మొబైల్ ఫోన్ లలో మునిగిపోయే అన్ని వయస్సుల ప్రజలు.. ఇలా ఎన్నో …ప్రయాణించేది  కాసేపైనా… తాను comfortable గా ఉంటె చాలు అని అనుకుని ప్రయాణించే వాళ్ళు ఎందరో..

బస్సు లో రాసిన “స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అన్న సూచనని తుంగలో తొక్కి …వారి సీట్లలో కూర్చొని… వారు ప్రాధేయ పడినా లేవని పురుష పుంగవులని ఎన్నో సార్లు చూసాను.. అలాంటి రొటీన్ కి భిన్నంగా ఈ రోజు ఓ సంఘటన… సిటి బస్సు బాగా రద్దీ  గా ఉంది.. ఆఫీస్ టైం కావటంతో మహిళా ప్రయాణీకులు కూడా ఎక్కువగానే ఉన్నారు… చాల మంది నించొనే ఉన్నారు… ఖాళి లేక పోవటం తో… ఓ ప్రయాణికుడు పురుషుల సీట్లలో ని ముందు వరుస  దగ్గర నించొని ఉన్నాడు..  ఆ వరస ఖాళీ అయ్యింది.. అతని ముందు ఇంకా చాల మంది స్త్రీ లు నించొని ఉన్నారు.. ఖాళీ అయ్యింది పురుషుల సీట్ లు కావటం తో లేడీస్ ఎవరు అందులో కూర్చోటానికి ప్రయత్నించలేదు. ఖాళీ అయ్యిన సీట్లో కూర్చోబోయిన ఆ ప్రయాణికుడు.. కూర్చోకుండా నించునే ఉండిపోయాడు.. కొన్ని క్షణాల తరవాత అర్థమైన లేడీస్ ఇద్దరు ఆనందంగా ఆ సీట్లలో కూర్చొన్నారు…. ఇదంతా చూసిన ఇంకో ప్రయాణీకుడు.. ఇంకా నించునే ఉన్న ఆ ప్రయాణీకుడిని అప్పుడే ఖాళీ అయిన తన పక్క సీట్ లో పిలిచి మరీ కూర్చో పెట్టాడు..  ఒక్కో సారి, ఇలాంటి good gestures ఒక సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేసి తోటి ప్రయాణికులు కూడా అర్థం చేసుకునేలా చేస్తాయి.

అన్ని చోట్ల కాకపోయినా … మనకు సాధ్యమైన పద్ధతిలో , పరిధిలో Let us lead by example by conducting ourselves as humane citizens.. This positive feel can rub onto others to make a better society to live in.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఈ రోజు ఏమయ్యిందంటే …

  1. manchi vishayam.. baagundhi.. Thank you..for ur sharing.

  2. These kind of things happen once in a blue moon & show us human values are still subsisting..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s