Are we literate or educated?

సినిమా హాల్ దగ్గర… రైలు టికెట్ల బుకింగ్  సెంటర్ దగ్గర,  పిల్లల పుస్తకాలు తెచ్చుకోవటం కోసం బుక్ స్టాల్ కెళ్ళినా.. వాళ్ళ పరీక్షల కోసం exam సెంటర్ ల కెళ్ళినా.. అస్తమా  కోసం చేప మందు కెళ్ళినా.. ఇలా ఎన్నో… సందర్భాలలో  చూసే ఒకే దృశ్యం తోపులాట… ఏ వస్తువు కోసమైనా పది మంది వెళ్లారూ  అంటే.. అక్కడ క్యూ పద్ధతి పాటించటం ప్రతి ఒక్కరికి కష్టమే.. ఏ మాత్రం సందు దొరికినా… ఆలస్యం గా వచ్చినోడు  ముందు కి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.. ఇది ఆఖరికి భగవంతుని సన్నిధి లో కూడా జరిగే నిత్య కృత్యం. ఓ ఐదు నిమిషాలు ఓపిక పట్టలేని ప్రబుద్ధులు, క్యూ దగ్గరి కోచ్చారంటే   రక రకాల యుక్తులు ప్రదర్శిస్తారు లైన్ లో ముందు కెళ్లాలని. పోనీ వారికేమైన అర్జెంటు పని ఉండి అలా చేస్తున్నారా అంటే… అలాంటి “దృశ్యమేమీ” ఉండదు. ఎలాగైనా మనం సాధించేయాలి అన్న దుగ్ధ ఒకటే కనపడుతుంది అందరిలో… ఇలాంటివి చూసి… బుద్ధిగా ఉండేవాళ్ళు కూడా… తమ శక్తి యుక్తులు ప్రదర్శిన్చాల్సోస్తుంది … ఎందుకంటే It is foolish to remain a saint in a group of thugs అని ఓ నానుడి.  పైగా మన పెద్దలు Do in rome as romans do అని ప్రవచించారు కూడాను .. ఫలితంగా తోపులాటలు.

ఒక్కో సారి… ఈ లైన్ ని పాటించక పోవటం వలన… అందరికి ఆలస్యం అవుతుంటుంది… పరిస్తితి అస్త వ్యస్తమై… ఉద్రిక్తతలకు దారి తీస్తుంది… అందరూ చదువుకున్న వారే… చక్కటి కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన వారే.. కాని ఇలాంటి విషయాలకు వచ్చే సరికి.. చదువుతో రావాల్సిన సంస్కారం అంతా గాలికి పోతుంది… అందరూ లైన్ ని పాటిస్తే.. ముందు వచ్చిన వాళ్లకు సముచిత న్యాయం జరగటంతో పాటు.. ఆందోళనలు ఉండవు.. ఇదంతా తెలిసి కూడా మనం ఇలాగే ఉన్నమూ అంటే…అనిపిస్తుంది

Are we literate or educated అని… చదువు మనకి జీవనోపాధి కల్పిస్తోందేమో కాని.. సంస్కారం మాత్రం కాదు అనిపిస్తుంది..

అందుకే.. ఇంకో సారి ఇలాంటి జన సందోహం ఉన్న చోట వీలైతే లైన్ పద్ధతి పాటించండి.. or at least let us be conscious about it.. అలాంటి పద్ధతులు పాటిస్తే  ఇంతే సంగతులూ అంటే మటుకు “నలుగురితో పాటు నారాయణా”  అనేసేయండి

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s