ముప్పై మూడు ఏళ్ళ తరవాత ఓ మిత్రుడ్ని కలిస్తే ఎలా ఉంటుంది..?

ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం ..ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.. ఆ రోజులు మునుముందిక రావేమిరా..” అన్న “అనుబంధం” చిత్రం లోని పాటలోని ప్రతి అక్షరమూ  మా చిన్ననాటి స్కూలు మిత్రులకు అతికినట్లు  సరిపోతుంది.. మా బ్యాచ్ లో ఎక్కువ మంది స్నేహానికి పెద్ద పీట వేయటం… మా అదృష్టం. అలాంటి స్నేహ సుమాలన్నీ  , ఇప్పుడు మళ్లీ విరబూస్తున్నాయి. ఎక్కేదేక్కడో వున్నా,  మిత్రులు మళ్ళీ కలుస్తున్నాం.

ఆ క్రమంలోనే …ఎన్నో ఏళ్ళకు నాతో పాటు చదువుకున్న మిత్రుడు రవి కుమార్ ని ఇంత కాలానికి ఈ రోజే కలుసుకున్నాను. పనిలో పని గా, ఊళ్లోనే  ఉన్న ఇంకో ఇద్దరు మిత్రులు చెంగల్ రెడ్డి, లవ ని కూడా  ఇంటికి పిలిచాను. పనుల వొత్తిడి వలన చెంగా రాలేక పోయాడు. లవ మాత్రం.. అతి కష్టం  మీద, డ్యూటి ముగించుకుని రాగలిగాడు.

ఫోన్ లో మాటలాడుకున్నా , ఇంత కాలం తరవాత చూడబోతున్నాం కదా.. రవి ఎలా ఉంటాడో అని ఉత్కంఠత .. ఎక్కడ కలవాలో నిర్ణయించాక… గుర్తు పట్టేదేలా అని అనుకున్నాక… నేను ఓ మార్గం  చెప్పాను… ఒక కోడ్ వర్డ్ చెప్పాలి అని… అదేమంటే… ” ఆకాశం ఎర్రగా ఉంది బాస్..” అని నన్ను చూస్తూనే చెప్పాలి అన్నాను… మరి అందుకు నువ్వేమి కోడ్ వర్డ్ ఆన్సర్ ఇస్తావు అని అడిగాడు రవి… కాసేపు అలోచించి… “నేను టమాటో కూడా ఎర్రగా ఉంది బాస్ అంటాను… సరేనా..” అన్నాను. అలా అనుకున్నా… చివరికి కలిసే సమయానికి… అన్ని కోడ్ వర్డ్స్ గాలికి పోయాయి… ఇద్దరం కాసేపు ఆనందం తో ఉక్కిరి బిక్కిరయ్యాము… ఇంతలో లవ కూడా వచ్చేసరికి… మా ఆనందానికి అవధులు లేక పోయాయి.. మేము కలుస్తున్నామనేసరికి.. రవి ఇంట్లో ని వారు కూడా అంతే ఆనందించారు.. వాళ్ళ నుండి ఫోన్ కాల్స్. మేమంతా కలిసామా అని వాకబు చేస్తూనే వున్నారు. .

చాల సేపు… మా స్కూలు సంగతులు నెమరు వేసుకుంటూ… ఆ రోజుల్లోకి వెళ్లి పోయాము… మన మిత్రులు మన వూళ్ళో కలిసిన వీడియోని రవి, లవ చూసి ఎంతో ఆనందించారు.

ఇది ఎంత నిఖార్సైన ఆనందమంటే.. లక్షలు పోసినా పొందలేని అనందం.. కేవలం ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే , ఇందులోని మాధుర్యం ఏమిటో.తెలిసే ఆనందం .. .

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

7 Responses to ముప్పై మూడు ఏళ్ళ తరవాత ఓ మిత్రుడ్ని కలిస్తే ఎలా ఉంటుంది..?

  1. You are right. Meeting a friend after so much of time will be quite nostalgic. Great event.

  2. Hello,JNS,iam happy2know that u, Ravi&Lava met the other day. It’s a memorable day for u all.

  3. very nice meet. mee..aanandham mee maatalalo.. spastamgaa choosaam.

  4. Dr. Vijayakrishna says:

    Hey Ram,
    That’s really wonderful. Did you take pictures? If “YES”, please share…..
    Vijay

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s