ఈ సారి బండి నడిపేటపుడు ఈ టపా గుర్తు పెట్టుకుంటారు కదూ…?

రెండేళ్ళ క్రితం… మా వూరు వెళ్ళినపుడు విన్న సంఘటన.. ఇద్దరు మిత్రులు వ్యాపారంలో బాగా రాణించి, ఆస్తులు బాగానే సంపాదించారు. ఓ రోజు రాత్రి  పెళ్ళికి వెళ్లి  ఇంటికి తిరుగు ముఖం పట్టారు, ఒకే  మోటార్ బైక్ పైన. బండి start చేసేటపుడు సైడ్ స్టాండ్ తీయకుండానే బయల్దేరారని వారికి తెలియదు..బండి మెయిన్ రోడ్డు పైకి వచ్చాక, వేగం పెంచారు… ఈ లోపు ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర.. స్టాండ్ భూమికి తగిలి, జరగరాని అనర్ధం జరిగిపోయింది… ఒక కుటుంబానికి గుండె కోత.. ఆనందంగా  సాగిపోతున్న ఓ కుటుంబంలో  పెను తుఫాను… 

ఈ రోజు కూడా అలాంటి సంఘటనే  ఒకటి చూసాను… సైడ్ స్టాండ్ తీయటం మరిచి బండి నడుపుతున్న ఓ వ్యక్తిని ఇంకొక వ్యక్తి గమనించి తనని ఆపి మరీ చెప్పాడు.  అతను చేసిన హెచ్చరిక యొక్క విలువ బైక్ నడిపే ఆసామి కి తెలియక పోయుండవచ్చు.. ఆ విలువ తెలిసిన నేను మాత్రం… ఆ హెచ్చరించిన వ్యక్తిని పలకరించి మరీ అభినందించాను.

ఓ అనాలోచిత క్షణం… మనిషి జీవితాన్ని… అతని కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేయవచ్చో… ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.. అందుకే… ఈ సారి మీరు బండి నడిపేటపుడు… సైడ్ స్టాండ్ తీయటం మరువకండి.. ఇది చాల చిన్న విషయమే కావచ్చు.. But I dont mind sounding ridiculous in cautioning you so… because it probably can save a life…

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

6 Responses to ఈ సారి బండి నడిపేటపుడు ఈ టపా గుర్తు పెట్టుకుంటారు కదూ…?

 1. శ్రీ says:

  తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం.

  అమెరికాలో బైక్స్ కి సైడ్ స్టాండ్ ఉంటే బండి స్టార్ట్ అవదు. రన్నింగ్ లో ఉన్న బండికి సైడ్ స్టాండ్ వేస్తే ఇంజిన్ ఆగిపోతుంది. ఈ సదుపాయం మన దేశంలో ఉన్న బైక్స్ కి కూడా వస్తే ఇటువంటి ప్రమాదాలని అరికట్టచ్చు.

 2. శేషు says:

  పల్సర్ బండి కి, ఎర్ర్ లైటు వెలుగుతుంది సైడ్ స్టాండ్ అని.

 3. విలువైన మాటలతో.. మీ పోస్ట్ బాగుంది..అలాగే.. రెండు కొత్త విషయాలు..తెలిసాయి.. ధన్యవాదములు

 4. D S KRISHNAN says:

  paina cheppinattle, inkokati marachi pokandi, Helmet pettukovadam, chaala barvainadi,manakunde swatantram kolpotamani bhavinchakandi ademi vichitramo driver okavela vesukonte kuda venaka spouse vesukoru mana hyderabadlo,
  enduku cheuppudthunnanuante, maa akka accidentlo helmet lekapovadam to fatal and multiple head injuries to chanipoyinde , tana kooturuni anadhanu chesindi, Helmet naakosam iddaru darinchandi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s