వాస్తవికతకి అద్దం పట్టే ఓ చందమామ కథ…

చందమామ పత్రిక లోని కథల్లో విశిష్టత ఏమిటంటే.. తక్కువ పదాల్లో.. ఆసక్తికరమైన కథనంతో ఉండే ఇతివృత్తాలు.. ఒక పిల్లవాడిగా ఆ రోజు వాటిని వినోదాత్మకంగా చూసి ఆనందించినా… ఇప్పుడు ఆ కథలని నెమరు వేసుకుంటే… కనిపించే ఎన్నో దృక్కోణాలు.. ఒక్కో సారి… నిజ జీవితంలో ఎదురయ్యే సందర్భాలను బట్టి.. మనసులోని Random Access Memory నుండి నిక్షిప్తమైన ఆ కథలు గుర్తొచ్చి మనోఫలకం పై సాక్షాత్కరిస్తాయి..

ఈ రోజు మీతో పంచుకోబోయే కథ కూడా అలాంటిదే.. ఇక కథలోకి వెళ్తే…
ఒక రాజు కి ఇద్దరు కొడుకులు. వార్ధక్యం సమీపించడంతో.. తన ఇద్దరు కొడుకులలో ఒకరిని రాజుగా చేయాలనీ అనుకుంటాడు రాజు. ఇద్దరిలో ఎవరు రాజు కాగల అర్హత ఉందొ చెప్పమని మంత్రిని కోరుతాడు. అందుకు సమ్మతించిన మంత్రి, నిండు సభలో  ఆ ఇద్దరు కొడుకులకు పరీక్ష (మన పరిభాషలో చెప్పాలంటే వైవా వోస్ ) పెడతాడు. ఇద్దరికీ ఒక ప్రశ్న… “రాజ్యం లో రాబందులు ఎక్కువైతే.. మనిషి ఇంకో మనిషిని దోచు కుంటుం టే… పశు పక్ష్యాదులు మరణిస్తూ ఉంటె.. .. మీరు రాజైతే ఏమి చేస్తారు?”.
ప్రశ్న విన్న వెంటనే… చప్పున చిన్న కొడుకు సమాధానమిస్తాడు ఇలా… ” మంత్రగాడిని పిలిచి మంత్రమేయిస్తాను..” అని. సమాధానం సరియైనదని అక్కడి సభికులంతా హర్ష ధ్వానాలు చేస్తారు.

పెద్ద కొడుకు మాత్రం కొద్ది సేపు అలోచించి…  “నేను రాజైతే.. చెరువులలో పూడికలు తీయిస్తాను.. కాలువలు మరమ్మతు చేయిస్తాను… ధాన్యం నిలువ చేసే  గాదెలు నిర్మిస్తాను…” అని చెపుతాడు. ఆ ప్రశ్నకి ఇది సమాధానమా అని సభికులంతా నిర్ఘాంత పోతారు.

చిన్న కొడుకే రాజు అని అందరు అనుకుంటున్న తరుణంలో , మంత్రి పెద్ద కొడుకు చెప్పిన సమాధానం సరియైనదని చెపుతాడు.. ” ఒక రాజ్యం లో నేను చెప్పిన పరిస్థితులు , కరువు కాటకాలు వచ్చినపుడు వస్తాయి.. వాటిని నివారించటానికి… మంత్ర గాళ్ళను నమ్ముకోటం కాదు… స్వశక్తిని నమ్ముకుని… అందుకు నివారణ మార్గాలను వాస్తవికంగా ఆలోచించాలి. అందుకే పెద్ద కొడుకు చెప్పినట్లు.. చేస్తే… వానలు వస్తే… చెరువులు నిండుతాయి.. పంటలు పండుతాయి… గాదెల్లో నిలువ చేసి, కరువు వస్తే ధాన్యం వాడుకోవచ్చు.. అపుడు దేశం సుభిక్షంగా ఉంది… శాంతి భద్రతలు నెలకొంటాయి… కాబట్టి.. దూర దృష్టి ఉన్న పెద్ద వాడే రాజు గా అర్హుడు.”

ఇప్పుడు ఈ కథని అన్వయించుకుంటే.. ఈ సింగిల్ పేజీ కథలో ఎంత గూడార్థం ఉంది.. ఇన్స్టంట్ గా ఓ సమస్య కి పరిష్కారం అలోచిస్తామే కాని… దీర్ఘ కాలిక ప్రాతిపదికన ఆలోచించలేక పోతున్నాం కదా అనిపిస్తుంది.. మనిషికి చేపలు పట్టటం నేర్పాలి కాని… రోజుకో చేప ఇవ్వటం వలన సత్ఫలితాలుంటాయా?

(ఈ కథ sketchy గా గుర్తుంది… కొన్ని డీటైల్స్ మిస్ అయ్యుం డవచ్చు. కాని కథా సారాంశమిదే   ..)

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to వాస్తవికతకి అద్దం పట్టే ఓ చందమామ కథ…

  1. baagudhi.. manishiki..doora drusti kaavaali..adhe mukhyam.

  2. SHANKAR.S says:

    నిజంగా చందమామ కథల్లో వెతికితే చాలా వరకు సమస్యలకి ఆచరణ యోగ్యమయిన పరిష్కారాలు దొరుకుతాయండీ. మంచి పోస్ట్ పెట్టారు. అభినందనలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s