ఇంగ్లీషు నేర్చుకునే పద్ధతి ఇదా …?

ఈ మధ్య నాకు ఎదురైన ఓ సందర్భం…  ఓ మెడికల్ కాలేజి ప్రొఫెసర్ తన దగ్గర పరిశోధన చేసే విద్యార్ధి థీసిస్ కర్రెక్ట్ చేస్తుంటే… తన ఇంగ్లీషు చూసి ఆశ్చర్యపోయారు. పొంతన లేని పదాలతో, వ్యాకరణ దోషాలతో.. అసలు తను ఏమి రాయదలచుకున్నాడో   కూడా అర్థం కాని విధంగా లోప భూయిష్టం గా ఉంది.. చివరికి ఆ ప్రోఫెసరే ఆ థీసిస్ ని తిరిగి రాయాల్సొచ్చింది. వైద్య విద్యార్ధి ఇంగ్లీషే అలా ఉంటె… మిగతా డిగ్రీలు చేసేవారి ఇంగ్లీషు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే.. విజ్ఞానాన్ని పొందటానికి ఇంగ్లీషు భాష ఓ రహదారి లాంటిది.. ఆ రహదారే సరిగ్గా లేకుంటే… ముందుకెళ్ళేదెలా ..?

పాఠశాలలో ఇంగ్లీషు ఎలా బోధిస్తున్నారో చూస్తే చాల ఆశ్చర్యం కలుగుతోంది.. అసలు ఆంగ్లాన్ని బోధించేవారి భాషే అంతంత మాత్రం గా ఉంది… ఇక వారి ఆధ్వర్యం లో నేర్చుకునే విద్యార్థులు ఇంగ్లీషు భాష అలా ఉండటంలో ఆశ్చర్యం లేదు. పేరెంట్స్ మీటింగ్ లో నేను ప్రతి సారి, ఇంగ్లీషు టీచర్తో మాట్లాడటం, వారితో వాదించలేక విసిగి వదిలేయటం  గత  కొన్ని  సంవత్సరాలు గా పరిపాటి ఐపోయింది. నా వాదన ఏంటంటే… ముందు వ్యాకరణం నేర్చుకుని  తరవాత… వాక్య నిర్మాణం, కొత్త పదాలు నేర్చుకోటం, వాడటం , చిన్న కథలు చదవటం.. ఇలా ఒక క్రమం లో నేర్చుకోవాలి అని. ఆ వాదన  వింటూనే, ఆ ఇంగ్లీషు టీచెర్ నన్ను ఓ పిచ్చి చూపు చూసి, “మీరు అంటున్న పద్ధతి పాతది.. ఇప్పుడు అది పనికి రాదు.. నేను పిల్లలని రోజు పేపెర్ చదవటం, ఇతరులు  మాట్లాడుతూ వుంటే దానిని అనుకరించటం ద్వారా నేర్చుకోమని చెపుతాను. ఇంగ్లీషుని intuitive గా నేర్చుకోవాలి.. మీ లాగ సత్తే కాలపు సత్తెయ్య లాగ వ్యాకరణం నేర్చుకోటం ద్వారా కాదు” అని అంటాడు. ఇంకేదో చెప్ప బోతే..” నా పద్ధతి ఇంత వరకు ఎంతో విజయవంతం గా నడిచింది… ఆరో తరగతి నుండి ఈ విధం గా అనుకరించటం మొదలెడితే… పదో తరగతి కి చక్కటి ఇంగ్లీషు రాయటం, మాట్లాడటం నేర్చుకుంటారు.. మీ లాగ నాకు ఏ పేరెంట్ ఇంత వరకూ తప్పు పట్టలేదు..”.

ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్ళలో చూస్తే… మాట్లాడుతున్నారే కాని… అది ఎంత వరకూ కరెక్ట్ అన్నది సంశయాత్మకమే..   ఇప్పటికి మనకు ఇంగ్లీషు బోధించిన కోదండ  రెడ్డి గారు, కమల మేడం , వారు బోధించిన రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీషు వ్యాకరణం గుర్తు వస్తూ వుంటుంది. మన గురువులు వంట ఎలా వండి తినాలో నేర్పిస్తే… ఇప్పటి వారు… టూ మినిట్ నూడుల్స్ ని ఎలా వేడి నీళ్ళలో వేసుకుని తినాలో నేర్పిస్తున్నారు.. ఈ ధోరణి కొనసాగితే మటుకు, కమ్యూనికేషన్ అనే ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్ లో  పూర్తిగా వెనకపడిపోతాము అని నాకనిపిస్తుంది… మీరేమంటారు…?

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to ఇంగ్లీషు నేర్చుకునే పద్ధతి ఇదా …?

  1. Ramakrishna,it’s true.Now a days no body is bothered about grammar. We are imdebted to our kodanda reddy sir’Ramana sir, kamala mamam,who taught us with wren;martin. It incultated the habit in us to follow.

  2. భాష ఉపయోగం మన భావాల్ని ఇంకొకళ్ళకి చెప్పటానికి. అదే మాటల్లో (verbal) గ లేక వ్రాతల్లో (written) గ చెప్పొచ్చు.
    మనము మొదట్లో వ్రాత నేర్చుకుని వెర్బల్ కి వెళ్ళేవాళ్ళం. వ్రాతలో గ్రామర్ నేర్చుకొని వ్రాసే వాళ్ళం. దానిమూలంగా వెర్బల్ లో గ్రమాటికల్ గ మాట్లాడే అలవాటు చేసుకున్నాము. ఇప్పుడంతా తలక్రిందులైనట్లుంది చూస్తుంటే. ఇలాగే ఉంటె పెద్ద చదువులకి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది.

  3. Vijaykumar says:

    your are correct sir.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s