మా చిన్నప్పటి ఆట- జిల్లాంగోడు

మా చిన్నప్పుడు పిల్లకాయలు ఎక్కువ ఆట్లాడే ఆట జిల్లాంగోడు…. ఇది ఆట్లాడాలంటే ఒక చిన్న బద్ది (pit) చేసుకోవల్ల. మన మోచెయ్యి ఉండ్లా… అంత పొడుగు కట్టి (stick) పొట్టు లేకుండా బాగా జూరుకోవల్ల. దాంట్లో ఓ కాల్ (పావు) భాగం ఉండేటట్లు ఒక చిన్న కట్టి తీస్కుని దానికి రెండు వైపులా కూసి (sharp)గా  ఉండేటట్లు జూరుకోవల్ల. దాన్నే జిల్ల అంటారు.   తరవాత ఆ జిల్లను బద్ది మధ్యలో పెట్టి పెద్ద కట్టితో చిమ్మాల. అది దూరంగా ఎక్కడ పడితే అక్కడ నుండి మన అప్పోజిషనోడు  బద్ది వైపు విసరల్ల. మనం క్రికెట్ ఆడే  మాదిరి, కట్టితో కొట్టొచ్చు. ఆ జిల్ల మన బద్దికి దగ్గరలో పడితే, ఆ దూరం కొలవాల . అది గానా … పెద్ద కట్టి పొడుగు కంటే తక్కువుంటే… మనం ఔటు .. అప్పుడు మన అప్పోజిషనోడు జిల్ల చిమ్మొచ్చు… అట్లా లేకుంటే. మనం పెద్ద కట్టి తో జిల్లను కూసిగా ఉన్న వైపు కొట్టి అది గాల్లోకి ఎగిరితే… అలాగే అలాగ్గా పెద్ద కట్టితో కొట్టల్ల… అది ఎక్కడ పడితే … అక్కడనుండి బద్ది వరకూ, పొడుగు ఉతారుగా చెప్పాలా.. ఆ కొలత మన స్కోరు అన్న మాట. మనం గాన అసలు కొలత కంటే ఎక్కువ చెప్పుంటే … మన అప్పోజిషనోడు challenge చెయ్యొచ్చు. అప్పుడు కట్టితో కొలవాల… ఒక వేళ కొలత మనం చెప్పిందానికంటే తక్కువ వస్తే… మనం ఔటయినట్లే.. అట్లా ఒక గంట ఆది… ఎవరు ఎక్కువ స్కోరు చేస్తే వాళ్ళే గెలిచినట్లబ్బా..

ఇందులో ఇంకోటి కూడా ఉందబ్బా… జిల్ల ని గాల్లోకి కొట్టినప్పుడు … అది గాల్లో ఉన్నప్పుడే.. రెండు తూర్లు పెద్ద కట్టి తో కొడితే… మనం చెప్పే స్కోరు.. జిల్ల పొడుగుతో కొలవాల.. మూడు తూర్లు కొడితే అగ్గి పుల్లతో కొలవాల… నిజం చెప్తాండా… నేనెప్పుడు రెండు తూర్లు కంటే ఎక్కువ ఎప్పుడూ కొట్టనే లేదబ్బా.

మీరు కూడా ఆడినారా ఏంది ఈ ఆటని… ? అయితే ఎంటనే ఓ తూరి కామెంట్ రాయండబ్బా..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to మా చిన్నప్పటి ఆట- జిల్లాంగోడు

  1. R says:

    Ee aata ni manam summer holidays aadivuntam. Enko aata guruchi
    nenu cheppali, i.e. golikaya aata and bongaram aata, do u forget.
    what about the above two games.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s