ఈమధ్య నాకు బాగా నచ్చిన చిత్రం

ఈ మధ్యన ఆ చిత్రాన్ని సినిమా హాల్లో చూసాను. బాగుంది అనిపించింది… ఈ మధ్యనే డీ. వీ. డీ మార్కెట్ లో వచ్చాక.. ఆ చిత్రాన్ని చాల నిశితంగా చూడగలిగాను. ఏ సినిమా ఎందుకు ఫట్టవుతుందో అని తలలు పట్టుకునే సినీ పండితులు ఈ చిత్రం చూస్తే ఒక విజయవంతమైన సినిమా తీయడం ఎలాగో కొంత తెలుసుకోవచ్చు.. ఇంతకీ నన్ను అంతగా ఆకట్టుకున్న ఆ సినిమా “అలా… మొదలైంది”. ఈ సినిమా పై చాల పాసిటివ్ సమీక్షలు చూసాను కాబట్టి… ఆ చిత్ర కథా వివరాల్లోకి వెళ్ళ దలుచుకోలేదు. తారా బలం లేకపోయినా విజయం సాధించిన ఈ సినిమా లోని ప్రత్యేకతలు ఏమిటంటే…

శక్తివంతమైన స్క్రీన్ ప్లే … ఒక కిడ్నాప్ తో మొదలై… ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే సంభాషణలు .. మధ్య మధ్య లో వచ్చే ఫ్లాష్ బాక్… ఇలా కథ చెప్పిన పద్ధతి చాల సహజం గా ,,, కథలో భాగంగా అనిపిస్తుంది… చివరికి ఈ కిడ్నాప్ పాత్ర దారులు… ఫ్లాష్ బాక్ పాత్రధారులతో కథా పరం గా కలవటం… కథ అలా ముగియటం… ఎక్కడా అసందర్భం గా అనిపించదు… కథ మామూలుదైనా.. చెప్పే కథనాన్ని బట్టి ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేయొచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ… ఆ మధ్య వచ్చిన “The wednesday ” అనే హిందీ చిత్రం కూడా కథనం వలన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
చాల ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే.. ప్రముఖ కమెడియన్లు ఒక్కరు కూడా లేకున్నా… కామెడి పరంగా ఈ చిత్రం మార్కులు కొట్టేయ్యటం.. కామెడి కోసం… హీరో, హీరొయిన్ , ఆఖరికి విలన్ (?) పాత్రధారి కూడా సందర్భాన్ని బట్టి కామెడి సన్నివేశాల్ని రక్తి కట్టించ గలిగారు… ముఖ్యం గా చివరి సీను లో హీరో, హీరొయిన్ మాట్లాడుకుంటుంటే… విలన్ సెల్ ఫోన్ సంభాషణ చాలా నవ్విస్తుంది. కిడ్నాప్ చేసే ఉద్యోగం పోయిన తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ నటించిన రమేష్ కనిపించింది కొద్ది సేపైనా.. ఆయన “ఏక మినట్ …” అంటూ చేసే హడావిడి చూస్తే పొట్ట చేక్కలవ్వాల్సిందే.. కామెడి ట్రాక్ అవసరం లేదు అని ఈ చిత్రం నిరూపించిందనే చెప్పాలి..

పాటలు.. కోరియోగ్రఫీ … ఇందులో ముఖ్యం గా “ఇది ఎపుడో  మొదలైందని …” అన్న పాట చాల కొత్త తరహాగా మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది.  కేవలం ఇద్దరు గ్రూప్  dancers తో, చక్కని background లో ఈ పాట సింపుల్ బట్ క్యూట్ డాన్సు మూవ్మెంట్స్ తో చిత్రీకరించారీ పాటని.  “ఇన్నాళ్ళు… నా  కళ్ళు…” అని వచ్చే పాథోస్ పాట కూడా సూపెర్బ్.. మిగతా సాంగ్స్ నాకు నచ్చలేదనే చెప్పాలి..

క్లీన్ చిత్రం అంటే, ఈ చిత్రాన్ని ఇక  బెంచ్ మార్క్ గా తీసుకోవచ్చు… ఎక్కడా అసభ్యతకి తావు లేకుండా కేవలం కథా బలాన్ని నమ్ముకున్న చిత్రమిది..

సన్నివేశాల చిత్రీకరణ.. కొన్ని సీన్స్   చిత్రీకరించిన   తీరు చూస్తే.. దర్శకురాలు  నందిని  గారిని  అభినందించాల్సిందే .. ఓ సన్నివేశం లో హీరో ని ” ఐ యాం  సారీ”   అంటూ హగ్ చేసుకుని వెళ్ళిపోయే సీన్ నాకు నచ్చిన సీన్… It is so cute…

ఈ చిత్రంలో కథానాయిక గా నటించిన నిత్యా మీనన్ ఆ పాత్రకి అతికినట్లుగా సరిపోయింది.. ఒక bubbly and చార్మింగ్ గర్ల్ గా తను  చాల బాగా నటించింది  … హీరో naani బాగానే ఉన్నాడు … అక్కడక్కడా మహేష్ లాగ అనిపించాడు సంభాషణలు చెప్పటం లో (ముఖ్యం గా వంటింట్లో తన బావ తో మాట్లాడే సన్నివేశం లో).
కొన్ని నివారించదగ్గ అంశాలున్నా (స్నేహ ఉల్లాల్ పాట) , ఈ చిత్రానికున్న మిగతా ప్లస్  పాయింట్స్ లో అవి కనుమరుగైపోతాయి.. మొత్తానికి నా హార్డ్ డిస్క్ లో దాచుకోదగ్గ ఇంకో మంచి చిత్రమిది..

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s