సత్యం… సంగీతం… మధురం

ఇళయరాజా అనే ప్రభంజనం సంగీత ప్రపంచంలో రాక మునుపు … అంటే 1970 ల లో … కొన్ని పాటల్ని చాల ఎక్కువ ఇష్టపడేవాడిని. అప్పట్లో అవి ఎవరు పాడారు, ఎవరు సంగీత దర్శకుడు లాంటి విషయాల పై ఆసక్తి ఉండేది కాదు. ఇలాంటి టెక్నికల్ విషయాలు తెలుసుకోటం మొదలెట్టాక, అప్పట్లో నచ్చిన పాటల్ని అవలోకిస్తే… అందులో ఎక్కువ శాతం సత్యం స్వరపరిచినవే… తన ట్యూన్స్ చాల విలక్షణం గా ఉండి వీనులవిందు చేస్తాయి.. ” ఏ దివిలో విరిసిన పారిజాతమో…” (కన్నె మనసులు), “మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట..” (మట్టిలో మాణిక్యం), “గల గల పారుతున్న గోదారిలా” (గౌరీ) , “రాధకు నీవేర ప్రాణం..” (తులాభారం), “తొలి వలపే తీయనిది”(నీడ లేని ఆడది), “మధు మాస వేళలో..మరు మల్లె తోటలో” (అందమే ఆనందం), “తొలి సంజె వేళలో.. తొలి పొద్దు పొడుపులో..” ( సీతా రాములు), “గాలి వానలో … వాన నీటిలో పడవ ప్రయాణం..” (స్వయంవరం), “అభినవ శశి రేఖవో..” (సినిమా పేరు మరిచాను), “ఓ  బంగారు రంగుల  చిలక.. పలకవా..” (తోట రాముడు)  లాంటి పాటలు సత్యం సంగీత ప్రకర్షకి గీటు రాళ్ళు. ఇళయ రాజ పాటల  లాగా, తన సంగీతం లో వచ్చే పాటలను కూడా యిట్టె కనిపెట్టేయ్యోచ్చు.
నాకు వీటన్నిటిలో (అప్పట్లో) బాగా నచ్చిన పాట… ముత్యాల పల్లకి అన్న చిత్రం లో “సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ… నాదే గెలుపని మాలతిలత నాట్యమాడింది” అన్న బాలు, సుశీలమ్మ పాడిన యుగళ గీతం.. ఆ పాట వింటే… కాలం ఒక్క సారి వెనక్కి వెళ్లి నట్లనిపిస్తుంది.

ఏదో కాన్సేర్ట్ లో పాడిన పాట  వీడియోను ఇక్కడ చూసి ఆ పాటని ఆస్వాదించండి.

ఇలాంటి ఎన్నో మధుర గీతాల్ని అందించిన సత్యం తన ప్రతిభకి తగ్గ గుర్తింపు పొందలేదేమో అనిపిస్తుంది. కాని నాలాంటి కొంత మందికి ఆయన గీతాలు అమరమే…

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

4 Responses to సత్యం… సంగీతం… మధురం

 1. ram Cheruvu says:

  aa concert itchindi.. maa Houston Telugu Association President Smt. Sarada Akunuri garu.

 2. abhinava shasirekhavao..song.Gruhapravesham chitram .. kaartheekadeepam,yedhureetha songs koodaa baaguntaayi..manchi paatalu gurthu chesaaru.Thank you very much.

  • mhsgreamspet says:

   vanaja garu..
   thnx 4 the update. nijamenandi. kartheeka deepam lo paatalanni baaguntayi. edureetha film ki hindi lo amanush anna film tunes konni theesukunnaru. andulo goadaari varadallo saong naku baga ishtam,
   ramakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s