మిమ్మల్ని ఆలోచింపజేసే ఓ లెక్క

మిమ్మల్నో లెక్క అడగబోతున్నాను. చప్పున పేపర్, పెన్ తీసుకుని లెక్క కట్టేయండి.

సగటున 250 గ్రాముల చొప్పున, ఇరవై పుస్తకాల బరువు , దానికి ఒక అర్ధ కేజీ (కనీసం)  బ్యాగు బరువు, లంచ్ బాక్స్ , వాటర్ బాటిల్ బరువు ఒక టిన్నర కేజీ… మొత్తం ఎంత బరువు లెక్క కట్టండి.. సుమారు ఏడు  కేజీ లు లెక్క తేలింది కదూ.. ఏమిటిదీ అనుకుంటున్నారా..? అక్షరాల.. ఎలెమెంటరీ స్కూల్ కెళ్ళే పిల్లలు రోజు స్కూలుకి మోసే బరువు.. ఇది కాక వర్షాకాలం వచ్చిందంటే రైన్ కోటు అదనం. యుద్ధానికి వెళ్ళే యోధుల లాగ, గాలి ఆడని uniform వేసుకుని, ఒక టై చుట్టుకుని, సాక్సు, షూలతో బయల్దేరి.. ఈ బరువు మోసుకుంటూ, కొంతమంది… రద్దీ ఉండే బస్సులలో ఎక్కి రోజూ చదువు అనే యుద్ధం చేసి… ఉసూరుమంటూ సాయంత్రానికి ఇంటికి చేరటం… ఎంత కష్టం కదూ..


ఆ వయసు పిల్లల బరువు సుమారు ఇరవై ఐదు కేజీలు ఉందనుకున్నా… వారు వీపులపై మోసే భారం వారి శరీర బరువులో సుమారు మూడో  వంతు.. చాకిరి చేసే ఎద్దులు కూడా వాటి శరీర బరువు లో సుమారు ఐదో వంతు మోయాలని సూచిస్తారు… ఆ లెక్కన చూస్తే… పిల్లలు మోసే ఈ బరువు ఎంతో ఎక్కువ.. అలాంటి బరువులు మోస్తే.. వెన్నెముకకి ప్రమాదం. ఆర్ . కే.. నారాయణ్ లాంటి మేధావులు ఈ విషయాన్ని చర్చిస్తూ , తమ ఆవేదనని ఎప్పుడో వ్యక్త పరిచారు.. కాని అదంతా అరణ్య రోదనే అయింది..
వీటికి నివారణ మార్గాలే లేవా?.. కొంచం శ్రద్ధ పెడితే ఏదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది.. ఉదాహరణకు, అమెరికా లాంటి దేశాలలో, కిన్డెల్ అనే ఎలక్ట్రానిక్ బుక్ రీడర్ ని  పిల్లలు ఉపయోగిస్తారు. ఇందులో సుమారు వంద పుస్తకాల వరకూ చదువుకోవచ్చు…ఒక పలక సైజు లో ఉండి… పిల్లకు అసలు బరువనే అనిపించదు.. దీనిని ఎక్కడికైనా పట్టు కేళ్లో చ్చు . అన్ని తరగతుల పుస్తకాలను ఇందులో నిక్షిప్త పరుచుకోవచ్చు.


అది చాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎందుకులే  అనుకుంటే… ఇంకో మార్గముంది… Modules లాగ, అన్ని సబ్జక్ట్స్ లోని పాఠాలను నెలల (లేక మూడు నెలల) వారిగా విభజించి…  ఒకే పుస్తకం గా ప్రచురిస్తే… పుస్తకాలలో ముప్పావు భాగం తగ్గుతుంది.. నోటు పుస్తకాలు కూడా,.. క్లాసు వర్క్, హోం వర్క్ విడి విడి గా కాకుండా… ఒకే పుస్తకం లో రెండు సగాలు చేసుకుని  వినియోగిస్తే… నోటు పుస్తకాల భారమూ తగ్గుతుంది..

ఇంకో నివారణ మార్గామేంటంటే .. రోజూ మూడు లేక నాలుగు సబ్జక్ట్స్ ని మాత్రమే చదివేటట్లుగా   టైం టేబుల్ స్కూలు యాజమాన్యం తయారు చేయగలిగితే … బరువు కొంత తగ్గించొచ్చు.

ఇవి నాకు స్ఫురించిన కొన్ని మార్గాలు… సంకల్పంతో ఆలోచిస్తే ఇంకా ఎన్నో పరిష్కార మార్గాలు దొరుకుతాయి.. వాటిని అమలు చేయగలిగితే … కొంతైనా ముందు తరానికి మేలు చేసినవాళ్ళం అవుతాము ..

This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to మిమ్మల్ని ఆలోచింపజేసే ఓ లెక్క

  1. Ramakrishna,though the time table is given but the school authorities are instrucking the students to bring all books.so to reduce the burden of children’s baggage,parents can bring this to the notice of state human rights commission.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s