“వేయి దీపాలు నాలోన వెలిగితే …ఏ రూపం?”

“వేయి దీపాలు నాలోన వెలిగితే …ఏ రూపం… నీ ప్రతి రూపం… కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం..ఆ అనురాగం… “

నా(టి) కలల సాక్ష్యం

నా(టి) కలల సాక్ష్యం

జీవిత నౌక అనే సినిమా లోని ఈ పాట విని ఎంత కాలమయిందో… మనసులోంచి ఈ పాట వినిపించినప్పుడల్లా… నాకు గుర్తొచ్చేది.. ఆ సినిమా చూసినప్పటి జ్ఞాపకాలు… బహుశ ఏడు లేక ఎనిమిదో తరగతిలో ఉన్నాననుకుంటా… తిరుపతి లో చదువుకుంటున్న అన్నయ్య ఇంటికి వస్తే… ఎం. ఎస్. ఆర్ మూవీ ల్యాండ్ అనే కొటాయి లో ఈ చిత్రం చూసిన జ్ఞాపకం. ఈ సినిమా హాల్ అప్పట్లో కొత్తగా మొదలయింది. ఉన్న అన్ని కొటాయిలలోనూ ఇదే బెస్ట్.

ఈ సినిమా నే కాదు.. సింహ బలుడు, సీతాకోక చిలుక ,సాగర సంగమం, దీవార్, ఇలా ఎన్నో సినిమాలు చూసిన జ్ఞాపకాలు… ఈ కొటాయి తో ముడిపడి ఉన్నాయి. ఇందులో మొదట వచ్చిన చిత్రం యశోద కృష్ణ.. ఆ మధ్య వూరు వెళ్ళినపుడు.. ఓ సినిమాకి వెళ్తే… అప్పటి కళా కాంతులు కనపడలేదు… ఎందుకో సినిమా హాల్లల్లో అప్పట్లో కనపడే అ liveliness ఇప్పుడు కనపడటం లేదు.. టీ. వీ.., ఇంటర్నెట్ హోరుల్లో పడి సినిమా హాల్లో సినిమా చూసే ఓ అందమైన అనుభూతిని కోల్పోయామేమో అనిపిస్తుంది.

ఈ కొటాయి ముందు నుండి వెళ్ళినప్పుడల్లా… రామకృష్ణులు అనే సినిమా కి మొదటి మూడు రోజులు టికెట్ దొరక్క వెనకకి వచ్చిన సందర్భం గుర్తుకొస్తుంది.. ఎనిమిదో తరగతి కి వచ్చిన మొదట్లో వచ్చిన ఓ సినిమాకి , ఈ హాల్లోనే మన క్లాసు మేట్ మోహన్ బ్లాకు లో టికెట్లు అమ్మి , ఆ డబ్బుతో తన నోటు పుస్తకాలు కొనుక్కున్నాడు.. కాని … కొద్ది రోజులకే.. పరిస్థితులు బాగోక.. తను చదువు మాని సైకిల్ షాపు పెట్టుకోవల్సోచ్చింది. ఈ లోకాన్ని వీడి తను ఎక్కడున్నా… తను నాతో పంచుకున్న ఎన్నో జ్ఞాపకాలు మెదులుతూనే ఉంటాయి. తను పడ్డ కష్టాలు గుర్తుకొస్తే మనస్సు కలుక్కుమంటుంది.

ఎనిమిదో తగతి లో నా చేయి విరిగినప్పుడు.. బాధ మరిచిపోటానికి, నాన్న ఈ టాకీస్ లో సింహ బలుడు అనే సినిమాకి తీసుకెళ్ళారు.

ఎన్నో టాకీసులు (లక్ష్మి, ప్రమీల, జ్యోతి, ప్రతాప్) మూసివేయబడ్డా… నాటి జ్ఞాపకాలకు ఊపిరి పోస్తూ, వూరి నడిబొడ్డున ఈ టాకీసు ఇప్పటికీ మేరు నగ దీరువులా నిలబడి ఉంది… నాడు కురిసిన స్మృతి సుమాల్ని తన వొడిలో ఏరుకునేలా..

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

One Response to “వేయి దీపాలు నాలోన వెలిగితే …ఏ రూపం?”

  1. jnaapakaalu.. Baagunnaayandee! yentha thavvinaa chelamaloni neellu laa ooruthoone untaayi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s