అవే చివరిక్షణాలనిపించిన ఆ రోజు..

మనం బహుశా ఇంకో నిమిషం తరవాత ఉండమేమో… అన్న ఫీలింగ్ కలిగినప్పుడు మనః పరిస్థితి ఎలా ఉంటుంది…? ఆ ఫీలింగ్ చాల మందికి అవగతం కాకపోవచ్చు కాని… నాకు మాత్రం ఓ సారి అలాంటి సందర్భం ఎదురయ్యింది..

పన్నెండు సంవత్సరాల ముందు ఓ రోజు, ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో కోల్కత వైపు నుండి వస్తున్నాను. సమయం సుమారు రాత్రి తొమ్మిది అయ్యుంటుంది… బండి భుబనేశ్వర్ దాటి ఖుర్దా రోడ్డు వైపు పయనిస్తోంది. నేనున్న కోచి ఇంజిను నుండి సుమారు పదిహేనవ కోచి. అప్పుడే భోజనం ముగించాను.. భుబనేశ్వర్ లో అనుకోకుండా తారస పడ్డ నాకు తెలిసిన ఒక వ్యక్తి తో మాట్లాడి… నా బెర్తు పైకి వెళ్ళటానికి ఉపక్రమించాను. ఇంతలో… ఏదో విచిత్రమైన శబ్దం… అది అంతకంతకూ పెద్దదౌతూంది… బండి గమనం లో విపరీతమైన కుదుపులు… సుమారు నిమిషం  తరవాత… మేమున్న కోచి కుడి వైపు వాలి పోవటం మొదలైంది… కోచి లో హాహాకారాలు మొదలయ్యాయి… నాకర్థమైపోయింది… రైలు ఏదో ప్రమాదంలో చిక్కుకుందని… ఆ కొద్ది క్షణాలలో… ఎన్నో ఆలోచనలు.. ఎదురుగా ఏదైనా బండి డీ కొట్టుతూ మా వైపు వస్తోందా.. ప్రమాదం మనల్ని ఇంకొద్ది క్షణాలలో కమ్ముకోబోతోందా … ప్రమాదం వచ్చాక మన పరిస్థితి ఏమిటి… అలా మనసు ఒక్క సారి ఎటో ఆలోచించటం  మొదలెట్టింది నా ప్రమేయం లేకుండానే… జీవితం లో జరగరానిది జరగబోతోందేమో అన్న ఆందోళన… ఇలాంటి ఆలోచనలు ముసురుకొంటుంటే… రైలు… వాలుతూ వెళ్తూ… మా కోచి భూమిని తాకకుండా… దాదాపుగా ఒరిగిపోయింది.. రైలు లో చలనం కూడా ఆగిపోయింది.. ఎప్పుడైతే బండి ఆగిందో… అంతటా నిశ్శబ్దం.. అదృష్టవశాత్తు… మా కోచి లో దీపాలు వెలుగుతున్నాయి.. నేను చేసిన మొదటి పని… ఏ మాత్రం గాయాలు లేకుండా… సజీవంగా ఉంచిన దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాను.. నా పక్కనే షాక్ తో స్థాణువులా మారిన నా పరిచయస్తుడిని  (తనకి సుమారు  అరవై ఏళ్ళు వుంటాయి) ముందుగా గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాను.. ఒరిగిపోయిన బండి ఎక్కడ పడిపోతుందో అని అందరికీ భయం … నెమ్మదిగా ఒక్కొక్కోరం  బండి బయటికి దూకేసాము… నా  పరిచయస్తుడిని సముదాయించి ఒక పక్కన కూర్చోపెట్టి… రైలు ముందు వైపు వెళ్లి చూస్తే.. మా ముందు ఉన్న బోగీలన్నీ భూమి వైపు వోరిగిపోయాయి.. పెద్ద ప్రమాదమేం లేదు ..బోగీలు ఇంజిను నుండి విడిపోవటం వలన ప్రమాదం జరిగిందని తెలిసింది.

నా థీసిస్ కాపీలు, కంప్యూటర్, ఫ్లాపీలు… , ఎన్నో పుస్తకాలు … అన్నీ బోగీలో ఉండిపోయాయి… ప్రాణం కుదుట పడ్డాక.. అమ్మో నా పుస్తకాలు అంటూ విల విలలాడింది హృదయం… వాటిని  అక్కడే వదిలేస్తే నా మూడున్నరేళ్ళ శ్రమ వృధా అయిపోతుంది.. అందుకే మళ్లీ ధైర్యం చేసి ఒరిగిన బండిలోకి వెళ్లి. లగ్గేజి కిందకు తెచ్చుకుని.. ఆ వెన్నెల వెలుతురులో.. నాకు అతి ముఖ్యమైన వాటిని తీసుకుని.. మిగతావన్నీ అక్కడే పడేశాను.

తరవాత ఏమి జరిగిందంటారా.. ఇంకో జన్మ పొందిన తరవాత.. ఆ తరవాత పడ్డ కష్టాలు… అసలు కష్టాలనిపించలేదు.. ఒకటిన్నర రోజు తరవాత నా గమ్య స్థానం చేరగలిగాను.

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to అవే చివరిక్షణాలనిపించిన ఆ రోజు..

  1. God is Great. pramaadhaalu yedhurainappudu nibbaramgaa undagalgadam,sambhaalinchukovadam baagundhi.

  2. God is great.ur name consists with Rama&krishna.I hope they resqufed4m accident.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s