ఈ పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా…?

ముప్పై ఐదేళ్ళ మునుపు సంగతి… అన్నయ్య స్కూల్లో వక్తృత్వ పోటిలో మొదటి బహుమతి గా ఓ పుస్తకం పొందారు… ఆ పుస్తకం పేరు ” బంగారు నడిచిన బాట…”: రచయిత కలువకొలను సదానంద… ఈ మట్టిలో పుట్టిన ఓ సాహితీ మాణిక్యం… చిత్తూర్ జిల్లా , పాకాల లో జన్మించిన సదానంద బాలల సాహిత్యం లో తనదైన శైలి కలవారు… తన ఇతర రచనల్లో అవార్డు పొందిన  “నవ్వే పెదవులు.. ఏడ్చే కళ్ళు”, సాంబయ్య గుర్రం లాంటి ఎన్నో రచనలు ఉన్నాయి.. 
అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుని, కథలు చదవుతున్న క్రమం లో ఈ పుస్తకాన్ని చదవటం మొదలెట్టాను.. ఇదో పెద్ద నవల లాగా అగుపడింది అప్పుడు… అందుకని… చాల రోజులు చదవలేదు… అన్నయ్య ఓ సారి ఆ కథంతా టూకీగా చెప్పే సరికి… ఆసక్తి పెరిగి పుస్తకం ఆసాంతం చదివాను.. ఆ వయసులోనే ఆసక్తి కలిగించిన ఈ పుస్తకం జాతీయ ఉత్తమ బాల సాహిత్య బహుమతి పొందింది అని తెలిసినపుడు నేను ఆశ్చర్యపోలేదు..చక్కటి శైలి… సరళమైన భాష.. ఆసక్తి గొలిపే కథనం.. వెరసి ఓ మంచి బాలల పుస్తకం ఇది..
కథలోకి వస్తే.. ఓ వూళ్ళో  బంగారు అనే వ్యక్తి  సత్ప్రవర్తనకి  మారు పేరు గా ఉంటాడు.. ఎవరిని నొప్పించడు  .. దుష్టులను కూడా కరుణించే క్షమా గుణమున్న వ్యక్తి.. ఆ క్రమంలో.. అతను పెంచుకునే గోవులను అడవిలోని ఓ పులి సంహరించటం మొదలెడుతుంది…  క్షమా గుణమున్న బంగారు దానిని క్షమిస్తూ వదిలేస్తుంటాడు.. దాంతో ఆ పులి మరింత రెచ్చిపోయి గో సంహారం చేస్తుంటుంది.. తన దగ్గరున్న తుపాకితో ఆ పులిని సంహరించాలా వద్దా అన్న ధర్మ సంశయం లో కొంత కాలం ఎటూ తెల్చుకోలేకపోతాడు..తన నిష్క్రియా పరత్వంతో ఆ అమాయకమైన గోవుల మృతికి కారణ మౌతున్నానన్న వేదన మొదలౌతుంది.   చివరికి, అమాయకమైన ఆ  గోవులను రక్షించటానికి దుష్ట సంహారం తప్పదు… అని గ్రహించిన బంగారు తన తుపాకి తో కాపు కాసి ఆ పులిని చంపుతాడు.. అలా .. వ్యాఘ్ర సంహారంతో కథ ముగుస్తుంది.. ఈ కథలోని అంతర్లీన సందేశం … larger interest కోసం తప్పని సరి అయితే..  కఠిన వైఖరి  అవలంబించక తప్పదు అని.  ఆద్యంతం .. బంగారు.. పులి మధ్య నడిచే దోబూచులాట తో నడుస్తుందీ కథ..
ఇన్నేళ్ళ తరవాత.. ఇప్పుడు ఆ కథ పూర్తి పాఠం మరిచాను.. కాని అందులోని సందేశం… ఆ కథనం ఆకట్టుకున్న తీరు అలాగే గుర్తుండిపోయింది.కాల గర్భం లో  ఆ పుస్తకం కూడా కలిసిపోయింది..ఇంటర్నెట్ లో ఆ పుస్తకం వివరాలు ప్రయత్నించినా దొరకలేదు.. సాహిత్యాన్ని అభిమానించే ఎందఱో… ఈ బ్లాగ్లోకంలో కనిపిస్తున్నారు… వారిలో ఎవరైనా ఈ పుస్తకం చదివి వుంటారు.. ఆ పుస్తకం వివరాలిస్తారేమో అని మినుకుమంటున్న ఓ ఆశ..
 
Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

5 Responses to ఈ పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా…?

 1. రామకౄష్ణ గారు మీకు లాగానె కలువకొలను సదానంద గారు అంటే అభిమానించే కొండేపూడి నిర్మల గారి వద్ద ఆ పుస్తకం ఉందేమో కనుక్కుంటాను. మీరు గుర్తుకు తెచ్చుకుని చెప్పిన కథ బాగుంధి.

 2. Anwar says:

  ఒక వేళ మీ హైద్రాబాద్ వాస్తవ్యులయి వుంటే, మీకు సాక్షి పత్రికాఫీసుకు వచ్చే తీరిక వుంటే నేను ఈ పుస్తకం మీకు అచ్చంగా ఇచ్చేగలను.నమస్కారాలతొ అన్వర్.

  • mhsgreamspet says:

   అన్వర్ గారు
   మీ సహృదయతకి ధన్యవాదాలండి.. ఆ పుస్తకం ప్రచురణకర్త ఎవరో చెప్పగలరు.
   వనజ గారు..
   అన్వర్ గారి దగ్గర పుస్తకం ఉందిట.. మీ సహృదయతకి ధన్యవాదాలండి.

   రామకృష్ణ

 3. Anwar says:

  పుస్తకం మళ్ళీ వేసారు(పెన్నేటి ప్రచురణలు) మార్కెట్లొకూడా గత రెండు సంవత్సరాలుగా దొరుకుతుంది.

  • mhsgreamspet says:

   అన్వర్ గారు
   అంత మంచి పుస్తకం ఇంత కాలానికి దొరకబోతున్నందుకు ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలండి..

   రామకృష్ణ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s