బ్లాగు ప్రయాణంలో తొలి మైలు రాయి.. ఓ సింహావలోకనం

ఈ బ్లాగు మొదలై ఒక సంవత్సరం గడిచింది. భుక్తి కోసం ఎక్కడెక్కడో ఉన్న మన చిన్ననాటి స్నేహితులు ఆ రోజుల్ని పునర్జీవించటానికి … రూపు దిద్దుకున్న  ఈ బ్లాగు… తొలి టపా ఓ స్నేహితుడి సంస్మరణలో ” ఓ స్నేహ కుసుమం రాలింది” అన్న విషయం తో మొదలవ్వటం కొంత బాదే అయినా… ఆ బాధలోంచి ఈ బ్లాగునేలాగైనా ముందుకి  తీసుకెళ్ళాలన్న సంకల్పం మొదలయింది. బ్లాగు నడిచిన మొదటి రెండు నెలలూ కేవలం మన బాల్యమిత్రుల సందేశాలతో.. నడిచింది.. అప్పటికి సంకలినులు ఉంటాయని కూడా తెలియదు.. కూడలి, హారం, మాలిక, జల్లెడ లను కూడా ఓ  పత్రికలో చదవటం ద్వార తెలుసుకోటంతో, మన బ్లాగు సంకలినులలో రిజిస్టర్ చేసాక , మన టపాలు  వీటిల్లో రావటం మొదలయింది. ఎంతో మంది కొత్త బ్లాగ్మిత్రులను, వారి శుభాకాంక్షలను అందించటానికి  దోహదపడిన ఈ సంకలినులకు , మన మిత్రులందరి తరపునా కృతజ్ఞతలు  తెలియచేస్తున్నాను.
ఇతరుల బ్లాగులను చూసి… ఎన్నో నేర్చుకోగలిగాను… కొన్ని బ్లాగులను చూస్తే.. మనలాగా ఆలోచించే వాళ్ళు. మన లాగే అభిరుచి గల వాళ్ళు ఉండటం నిజంగా ఎంతో ఆశ్చర్యం కలిగించటమే కాదు.. ఆనందాన్ని కూడా ఇచ్చింది.. ఆలోచనలను పంచుకోటానికి ఈ బ్లాగులు చక్కటి వేదికలు. మనసు పొరల్లో బాహ్య ప్రపంచంలోకి రావాలని ఎంతో అసహనంతో కదులుతున్న ఎన్నో భావాలను… ఈ బ్లాగు ద్వార, నేను, నా మిత్రులు వ్యక్తీకరించగలిగాము. జ్ఞాపకాలను పంచుకోగలుగుతున్నాము.   ఇందులోని టపాలు… మా స్మృతుల సమాహారం … ఎన్నటికీ వాడని సుమ మాలిక.

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

5 Responses to బ్లాగు ప్రయాణంలో తొలి మైలు రాయి.. ఓ సింహావలోకనం

  1. very Good.keep it up. Happy Blogging.

  2. Good wishes to all our friends on the 1st anniversary of our blog.

  3. congrats and good wishes(belated). keep blogging..:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s