“నాన్న” చిత్రం ..My first impression

తండ్రి, కూతురు

ఎంతో అందమైన మానవ సంబంధం! ఈ కాన్సెప్ట్ తో వచ్చే కథలకి, నేను rating చేస్తే సగం మార్కులు డిఫాల్ట్ గ వచ్చేస్తాయి. మిగతా సగం సినిమాలోని ఇతరత్రాలపై ఆధారపడతాయి…. ఇంతకు మునుపు “ప్రేమించు”, “ఆకాశమంత” లాంటి చిత్రాలు … ఈ అందమైన బంధాన్ని ఇతివృత్తంగా చేసుకుంటే.. “నాన్న” చిత్రం ఈ బంధాన్ని ఇంకో మానవీయ కోణం నుండి చూపిస్తుంది. ఓ ఆడపిల్ల తన జీవితం లో చూసే మొదటి హీరో తన తండ్రే.. తనని రక్షించగలిగేది  తన నాన్నే అని ఓ గట్టి నమ్మకం … కాని ఇందులో హీరో మానసికంగా దుర్బలుడు…అలాంటి వ్యక్తి కి జన్మించిన కూతురికి , అతడికి మధ్య నడిచే అందమైన ప్రేమ బంధం ఈ చిత్రం చూపిస్తుంది..   ప్రాణంగా  చూసుకునే తన కూతుర్ని తన నుండి వేరు చేసినప్పుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి… తన కూతురు కోసం చేసే సంఘర్షణే ఈ చిత్రానికి కేంద్ర బిందువు. సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టి చూస్తే … ఈ చిత్రమ్ లోని కొన్ని పాయింట్స్ హృదయాన్ని సుతారంగా స్పృశిస్తాయి..
కథలోకి వెళ్తే …
విక్రమ్ ఊటీ లో ఓ చోకోలేట్ ఫాక్టరీలో పని చేస్తుంటాడు.. అతనికి మానసిక ఎదుగుదల ఉండదు.. అతనికి కూతురు పుట్టిన వెంటనే… అతని భార్య మరణిస్తుంది.. అప్పటినుండి అన్నీ తనే అయి ఆ పాపని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు.  తనని స్కూల్ లో చేర్పించాక. ఆ స్కూలు కరేస్పొండేంట్ తో పాపకి సాన్నిహిత్యం పెరుగుతుంది. స్కూల్ ఫంక్షన్ జరిగిన సందర్భం లో విక్రమ్ ని గుర్తించి , ఆ పాప తన అక్క కూతురని, తన అక్క మరణించిందని తెలుసుకుని, ఆ కరేస్పొండేంట్ వేరే వూళ్ళో  ఉన్న తన నాన్న కి కబురంపుతుంది.. విక్రమ్ సన్నిహితులకి  విక్రమ్ ని, అతని కూతురుని తమ దగ్గరే ఉంచుకుంటామని చెప్పి, వాళ్ళిద్దర్నీ తమతో కార్లో తీసుకు బయల్దేరుతారు.. విక్రమ్  అంటే ఇష్టం లేని వాళ్ళు .. విక్రమ్ ని మార్గమధ్యం లో వదిలేసి, పాపని తమతో తీసుకు వెళ్ళిపోతారు.

లాయెర్ అనుష్క సహాయంతో… విక్రమ్ న్యాయ పోరాటం  చేస్తాడు తన కూతురిని దక్కించుకోటానికి..ఆ క్రమంలో అనుష్క, సీనియర్ లాయెర్ అయిన నాజేర్ తో వాద ప్రతి వాదాలు చేయాల్సొస్తుంది..  చివరికి  ఆ తండ్రి తన పోరాటం లో గెలుస్తాడా అన్నదే సినిమా కి ముగింపు. ఈ చిత్రం ముగింపు చాల ఉద్విగ్నంగా ఉంటుంది.. ..

విక్రమ్ ఎప్పటిలాగా తన నటన చాతుర్యంతో మెప్పిస్తాడు. కాని surprise package ఏమిటంటే .. అతని కూతురు గా చేసిన బాల నటి (పేరు తెలియదు) .. తన నటన మనసును కదిలించక మానదు. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో.. కోర్టులో ఎంతో కాలానికి తన తండ్రిని చూసి … అతడితో సైగలతో పలకరిస్తుంది.. అతడు ఎలా ఉన్నాడో అన్న ఆవేదనని మూగగా వ్యక్తపరుస్తుంది. ఆ సన్నివేశం ఈ చిత్రానికే హై లైట్.. ఆ అమ్మాయి  విక్రమ్ కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది ఆ ఒక్క సీన్లో.

చిత్రాన్ని టెక్నికల్ గా, ఎడిటింగ్ పరంగా ఇంకా బాగా చేయటానికి స్కోప్ ఉంది. అనుష్క తో వచ్చే పాట ” విరిసేను ఒక వాన విల్..” అన్న పాట వినటానికి బాగున్నా , చిత్రం లో మాత్రం సందర్భోచితంగా లేదు.. మూడు ఫైట్లు , ఆరు  సాంగులు.. ఇష్టపదేవాళ్ళకి మాత్రం ఈ చిత్రం స్లో అనిపించ వచ్చు. విక్రమ్ అభిమానులకి మాత్రం ఇంకో చక్కటి చిత్రం దొరికినట్లే..

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to “నాన్న” చిత్రం ..My first impression

  1. చిత్రం పరిచయం బాగుందండీ! తప్పకుండా చిత్రం చూడటానికి ప్రయత్నం చేస్తాను. .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s