సృజనాత్మకతని ప్రభావితం చేసే ఆ రెండు కమాండులు

ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు కాని,… ప్రస్తుతం మన ఆలోచనల్ని, సృజనాత్మకతని ఎక్కువ మోతాదు లో నియంత్రిస్తున్నవి, ప్రభావితం చేస్తున్నవి రెండు commands . అవే కంట్రోల్ సి, కంట్రోల్ వీ.. అంటే కాపీ, పేస్ట్ కమాండులు.  స్కూల్లో ఏదైనా విషయం పై రాసుకు రమ్మంటే.. ఇంతకు మునుపు, పుస్తకాలను చూసో, గ్రంథాలయానికి వెళ్లి అక్కడి రెఫెరెన్సు కార్డులు చూసి, పుస్తకాల దొంతరను ముందరేసుకుని.. చదివి, అర్థం చేసుకుని…మన శైలి లో ఓ పది ఠావులు రాయాలంటే పది రోజులు పట్టేస్తుంది.. ఇప్పుడు.. అదే పని కేవలం ఒక గంటలో అంతకంటే విపులంగా ఆకర్షణీయమైన ప్రింటుతో టీచెర్ల ముందు పెట్టేయగలుగుతున్నారు..  ఇది సంతోషించదగ్గ విషయం అనుకుంటే పొరపాటే.. అసలు తాము ఏమి రిపోర్ట్ లో ఏమి రాసామో (సారీ ఏమి పేస్ట్ చేసామో) కూడా తెలియనంతగా పరిస్థితి తయారయింది.వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ నుండి ఏమి అడిగినా, జవాబు శూన్యమే..  టీచెర్ ఏమి అడిగినా… ఇంటర్నెట్ లో కి వెళ్ళటం, సెర్చ్ ఇంజిన్ లో ఆ ముక్కలు టైపు చేసేయ్యటం… వచ్చిన ఎంట్రీల్లో ఏముందో కూడా చూడకుండా… కాపి, పేస్ట్ చేసి రిపోర్ట్ తయారు చేయటం పరిపాటి అయిపోయింది.   దీనితో అందరిలో (విద్యార్థులే కాదు… మనం కూడా) స్వతస్సిద్దం గా  ఆలోచించడం అనేది మృగ్యమైపోతోంది అని అనిపిస్తోంది. ఏదైనా   విషయం పై రిపోర్ట్ తయారు చేస్తే… అందులోని paragraphs కూడా ఒక్కోటి ఒక్కో  స్టైల్ (ఫాంట్, సైజు, టైప్ , లైన్ స్పేసింగ్ లాంటివి) లో ఉంటాయి.. వాటిని చూస్తేనే తెలిసిపోతుంది.. వివిధ sources నుండి కాపీ కొట్టి పేస్ట్ చేసారని..  పెరుగుట విరుగుట కొరకే అని అందుకనే అంటారేమో.. టెక్నాలజీ అందించే ఏ ప్రయోజనాన్నైనా విచక్షణారహితంగా వాడితే అనర్తమే అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే..   ఈ ధోరణులకు ఎక్కడో ఓ చోట విరామ బిందువు పెట్టక పోతే.. మనలో ఆలోచన, విశ్లేషణా శక్తి తగ్గిపోతుంది.. ఈ అనుమానాల్ని నిజం చేస్తూ ఈ మధ్య పేపర్లో  వచ్చిన వార్త, ఇంటర్నెట్ లో వాడే సెర్చ్ ఇంజిన్ల వలన జ్ఞాపక శక్తి కోల్పోతున్నామని..    

కొసమెరుపు… ఈ టపా రాయటానికి ఆఖర్లో నేను చేయల్సోచ్చింది పైన ఉదహరించిన ఆ రెండు కమాండులే….  హ్మ్… 
Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to సృజనాత్మకతని ప్రభావితం చేసే ఆ రెండు కమాండులు

  1. exactly .. now in A days very common thing.. :-))))

  2. Now a days most of the people depending on internet for any sort of information&there by not refering books for the subjects concerd.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s