చేతుల్లోని క్షణాలను జారనీయకండి….

అని అందరికి చెప్పాలనిపించింది, ఈ మధ్య జరిగిన రెండు విషాదాలు  చూసాక…
దేశంలో పేరెన్నిక గన్న మెడికల్ సంస్థలో పట్టా పుచ్చుకున్న ఓ డాక్టర్… ఆడుతూ, పాడుతూ అందరిని హుషారు పరిచే పాదరసం లాంటి వ్యక్తి.. తను ఎక్కడున్నా అక్కడ ఆనంద తోరణాలే… తను చదువయ్యాక దక్షిణాది లో ఓ మెడికల్ కాలేజి లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ పిడుగుపాటు వార్త తెలిసింది. .. ఓ అరుదైన కాన్సెర్ తనకి సోకిందని… తనకు ఎంతో సన్నిహితుడైన ఇంకో డాక్టరు కి ఈ విషయం తెలిసినప్పటి నుండి తను ఫోనులో వోదారుస్తునే వున్నాడు… “నీకేమి కాదు… అంతా సర్దుకుంటుంది లే …” అని తీయటి అబద్ధంతో అతడిని సముదాయించలన్నా అతనో డాక్టరు.. అన్ని తెలిసిన … తనకు సోకిన మహమ్మారి తీవ్రతను  క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి… అయినప్పటికీ తన డాక్టరు మిత్రుడు మాత్రం, వీలు చిక్కినప్పుడల్లా తన వూరికి వెళ్లి పరామర్శించి వచ్చేవాడు.. వెళ్ళిన ప్రతి సారి నేను ఆ మిత్రుడిని అడిగే వాడిని … కౌంట్ డౌన్ మొదలయిందని .. తను బాధతో చెప్పినప్పుడల్లా ఏదో తెలియని ఆవేదన.. వ్యాధి ముదరటంతో తను మిత్రుడిని కూడా సరిగా గుర్తించలేని దశకి వచ్చాక…. ఆ మిత్రుడు వెళ్ళటం అదే ఆఖరు.. చివరికి ఆ దుర్వార్త వినాల్సి వచ్చింది.. ఇది జరిగి ఒక సంవత్సరం అవుతోంది..

ఓ రెండేళ్ళ క్రితం చూసిన ఇంకో వ్యక్తి..  ఇతను ఆ డాక్టరు మిత్రుడి దగ్గర పని చేసే వ్యక్తే.. నేను కలిసినప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుని ఆనందం గా వున్నాడు.. మూడు నెలల కిందట ఆ డాక్టరు మిత్రుడు నాకు ఫోన్ చేసినప్పుడు ఆ చేదు వార్త చెప్పాడు.. ఆ అబ్బాయికి కాన్సర్ అడ్వాన్స్డ్ దశ లో వుందని టెస్టుల్లో తెలిసిందని.. అప్పటినుండి ఆ డాక్టరు… ఆ అబ్బాయి సన్నిహితులకి అసలు విషయం చెప్పి , ముందుగ తన సొంత వూరికి పంపించే ఏర్పాటు చేసాడు.. ఆ వూరికి దగ్గరున్న ఇంకో పేరెన్నిక గన్న ఆసుపత్రి లో తనకి తెలిసిన ఇంకో డాక్టరు చేత వైద్యం ఏర్పాటు చేయించాడు.. ఎన్ని చేసినా ఆ చర్యలు ఏ మాత్రం సఫలమౌతాయో తెలిసిన తరవాత.. చాల బాధ వేసేది.. ఆ డాక్టరు తన సొంత వూరు వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తిని కలిసి వచ్చారు.. ఆ రోజు సురేంద్ర, ప్రసన్న కూడా కలిసారు తనని.. ఇది జరిగి రెండు నెలలు కావస్తోంది.. ఓ పదిహేను రోజుల ముందు వినకూడదనుకున్న  వార్త మళ్ళి వినాల్సి వచ్చింది..

వీటిని చూసాక అనిపించింది
“చేతుల్లోని క్షణాలను జారనీయకండి… ప్రతి క్షణం అదే చివరిదేమో అనుకుని అపురూపం గా ఆస్వాదించండి” అని అందరికీ చెప్పాలని.. 

काँटे भी है… कलिया भी है
दुःख सुख से भरी है ये जिंदगी 
 तुम्हे  कैसे मिली है यह जिंदगी…
जर जीके तो देखो.. इसे जीके तो देखो..
Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

3 Responses to చేతుల్లోని క్షణాలను జారనీయకండి….

  1. kshanaala samudhaayam jeevitham.. ee kshanam manadhi..maru kshanam manadhi avuno.. kaadho!? ..

  2. Every moment in life is highly precious.No one can get back a moment after pasing off.so friends try2enjoy each&every moment..u all know “time&tide wait for none.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s