ఆ వ్యక్తి స్నేహానికి సరైన నిర్వచనం

Some people dont meet us in our life.. they happen to us.

కొన్ని స్నేహాలు ఎలా మొదలౌతాయో తెలియదు… ఎలా ముగుస్తాయో కూడా… స్నేహం జననం, మరణానికి ఇదమిద్ధంగా కారణమిదీ అని కూడా చెప్పలేం..జీవన ప్రవాహం లో కొన్ని మలుపులు అలా వస్తుంటాయి… పోతుంటాయి..ఈ రొటీన్ కి భిన్నంగా ఏదైనా జరిగితేనే అది చెప్పుకోదగ్గ విశేషమౌతుంది.. బ్లాగు లో చోటు సంపాదించే అర్హత పొందుతుంది.. 

ఈ ఉపోద్ఘాతం తో ఈ రోజు మీకు వేణుగోపాల నాయర్ ని పరిచయం చేస్తున్నాను…తను స్నేహానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి.. స్నేహం ఏర్పడాలంటే.. వయసులోనో, చదువులోనో, సామజిక స్థితిగతులలోనో, వ్యక్తిత్వం లోనో … కనీసం ఏదో ఒక విషయంలో కనీస సారూప్యత వుండాలి అన్న మిధ్యలను తొలగించిన ఓ విలక్షణమైన వ్యక్తి.. 

మనిషి పొట్టిగ, కొంచెం బొద్దుగా… ఉంటాడు.. బీ కాం వరకూ చదువుకున్నాడు అప్పట్లో… మన వూళ్ళో దర్గా దగ్గర ఉన్న నాయర్ హోటల్ వారిదే.. నలుగురు అన్నదమ్ములలో మూడో వాడు. నేను స్కూల్ కి వెళ్ళే రోజుల్లో ఎనిమిదో తరగతి నుండి ఆ హోటల్ కి రెగ్యులర్ కస్టమర్ ని. ఒక్కో సారి మూడు పూటలూ ఆ హోటల్ లో తిన్న సందర్భాలు ఉన్నాయి.. పగలు చదువుకోటానికి వెళ్ళే వేణు రాత్రి ఆ హోటల్ లోనే అన్నదమ్ములతో పాటు సర్వ్ చేస్తూ వుండే వాడు.. ఎంత జనమున్నా సరే.. నేను వెళ్ళే సరికి ఏదో ఓ మూల సీట్ ఏర్పాటు చేసి కళ్ళతోనే సైగ చేసి చెప్పే వాడు, వెళ్లి కూర్చోమని. తనే సర్వ్ చేసేవాడు.  తనకి నాకు మధ్య ఓ ఆరేళ్ళు వయసులో తేడా ఉండొచ్చు.. ఎప్పుడైనా హోటల్ లో రద్దీ తక్కువగ వున్నప్పుడు…  చదువు విషయాలు  మాట్లాడుకునే వాళ్ళం.. ఏ విషయంలోనైనా  అనవసరంగా జోక్యం చేసుకునే వాడు కాదు. ఏదైనా సమస్య చెపితే, మనస్ఫూర్తిగా అలోచించి పరిష్కారం చెప్పే వాడు. తన క్లాస్మేట్స్ కూడా హోటల్ లో అప్పుడప్పుడూ కూర్చుని, అతని సలహాలు తీసుకునేవారు. ఏ విషయమైనా ఎమోషనల్ గా తీసుకునేవాడు కాదు.. కాని తను చెప్పే ప్రతి విషయంలోనూ నిజాయితి వుంటుంది.. ఆర్ద్రత  వుంటుంది. అందరికి  తనకు చేతనైన సహాయం చేసేవాడు. 

నేను డిగ్రీ చదవటానికి వేరే వూరు వెళ్ళేటపుడు.. 1983 లో తను ఒక గడియారం బహుమతి గా ఇచ్చాడు.. అది ఇప్పటికీ వాడుతుంటాను.. తరవాత అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేవాడు. తను మన వూళ్ళో   ఉన్నంత కాలం, నేను వూరెళ్ళినప్పుడల్లా వెళ్లి కలవటం  పరిపాటి.. నాతో పాటు మన మిత్ర బృందం కి కూడా నా వలన తను సుపరిచితుడే.. ప్రస్తుతం తను వీ. కోట దగ్గర ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇప్పటికీ.. తనతో మాటలాడుతుంటే   .. తనలో అదే గంభీరంగా సాగిపోయే సెలయేటి ప్రశాంతత… ఒక కుగ్రామంలో ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాడు.. అంత చిన్న వూర్లో ఎలా వుంటున్నారు అని ఎప్పుడైనా నేను sheepish గా అడిగితే.. తను చిన్నగా నవ్వి వూరుకునేవాడు. కానీ నాకు అర్థమైపోయేది తనేమి చెప్పదలుచుకున్నాడో. “మన పరిధిలో  సంతృప్తి గా జీవించటం ఎలా?” అన్న విషయంపై మనం మల్లగుల్లాలు పడుతుంటాం. కానీ ఆ విషయాన్ని అతి సరళంగా చేసి చూపించిన అతన్ని చూస్తే అనిపిస్తుంటుంది.. ఎలాంటి ప్రపంచంలో ఉన్నా… అందులో  మనకంటూ ఓ “మైక్రో క్లైమేట్ ” సృష్టించుకుని అందులో ఆనందాన్ని పొందవచ్చు అని.. 
కొంతమంది “ఎదుటి వాళ్ళు మనల్ని మంచి వాళ్ళు అనుకోవాలి” అని స్వతహాగా లేని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంటారు.. అదీ ఎంతగా అంటే తమకే తెలియనంతగా.. స్వతస్సిద్ధంగా   మంచి వ్యక్తిత్వం వుండే స్వాతి ముత్యాలు అరుదనే చెప్పాలి.. అలాంటి ఆ అరుదైన వ్యక్తులలో వేణు ఒకరు  అని ఖచ్చితం గా చెప్పగలను..
తనని చూసి సుమారు పదేళ్ళు అయ్యింది.. తనతో ఫోన్లో మాట్లాడటం కూడా అరుదైపోయింది.. కానీ ఎక్కడున్నా ఏప్రిల్ 29 న తనని నేను, అక్టోబర్ లో తను నన్ను పలకరించటం మాత్రం మానలేదు.. ఇప్పటికీ స్వచ్చమైన, మాలిన్య రహిత వ్యక్తిత్వానికి ఎవరినైనా ఉదహరించాలంటే.. నా మనసు చెప్పే ఒకే ఒక పేరు.. వేణుగోపాల నాయర్.. 

Advertisements
This entry was posted in ఫిలాసఫీ. Bookmark the permalink.

5 Responses to ఆ వ్యక్తి స్నేహానికి సరైన నిర్వచనం

 1. D S KRISHNAN says:

  ENDARO MAHAANUBHAVULU , VISHISHTAMAINA PERSONALITIES. MATHS LO INFINITY ANDUKOLENI QUANTITY ANIPICHINDI KANI , MANAVA LOKAMLO ENDHARO ENDHARO ENNO PHILOSOPHILO,NEE BLOGGNU NENU FOLLWO AVUTHUNNANU. jeevithanni manam andaram
  girimpeta schoolollu oke laga anubhavistunnamu. mee prathi chinna feeling kuda nade
  inkemi kavali . naa srimati naa la ga alochinchatledu endukante avida mana school kadu kada

 2. oh.. Good friendship..& Good values .. I inspire.this.
  Thank you very much..

 3. true friends are rare…good wishes to both of you.

  • mhsgreamspet says:

   trishna gaaru..
   thanks andi… maa blog anniversary sandarbhamgaa wish chesinaduku kooda inko thanks 🙂
   vanajagaaru…
   thanks andi..
   kitta..
   thnx 4 being in touch thro blog… BTW r u coming for our ge2gether?

 4. వేణుగోపాల్ నాయర్ గారి ఫోటో ప్రచురించండి ఆయన్ని అలా అన్నా చూసి ఆనందిస్తాము.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s