ఓ సంస్కారవంతమైన పిల్లి కథ

ఇంత వరకూ సంస్కారవంతమైన సబ్బు గురించి టీ. వీ. ప్రకటనలలో వినివుంటారు… ఈ రోజు ఓ సంస్కారవంతమైన పిల్లి గురించి మీకు చెప్పాలి.

ఎనిమిదో తరగతి చదివేటప్పుడు , ఇంటికి రోజూ ఓ పిల్లి వచ్చేది.. తెల్లగా అక్కడక్కడా గ్రే షేడ్స్ తో చూడ ముచ్చటగా ఉండేది.  నేను తెచ్చుకుని తినే ప్రతి చిరు తిండిలోను తనకూ భాగముండేది..  దానికి “మున్ని” పేరు పెట్టుకున్నాను.. 
ఓ ఆదివారం… పొద్దున్నే ఇంటికి టిఫిన్ తీసుకొచ్చి తింటున్నాము నేను, అన్నయ్య..అప్పుడే  అన్ని ఇళ్ళు చక్కబెట్టుకుని మున్ని వచ్చింది. తను వచ్చింది కదా అని, నేను  తినబోతున్న ఉప్మా కొంచెం తీసి floor మీద పెట్టాను… మున్ని దాని దగ్గరకెళ్ళి ఇంతలో ఏదో విపత్తు వచ్చిన దాన్లా ఇంటి గుమ్మం వైపు పరుగు పెట్టింది.. అసలే అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లి… ఉప్మా బాగా లేదేమో  అని టేస్ట్ చూసాను.. రంగు, రుచి, వాసనా అన్నీ భేషుగ్గా ఉన్నాయి… ” మరి దీనికేందుకు నచ్చలేదు..?” అని అనుకున్నాను. అంతే.. నా అహం దెబ్బ తింది… నేను అంత ప్రేమగా పెడితే , తినకుండా విసురుగా వెళ్తావా… అని తటాలున లేచి దాని వెంట పడ్డాను, బలవంతంగానైనా ఉప్మాని తినిపించడానికి…ఇల్లంతా టాం అండ్ జెర్రీ షో లాగ రచ్చ… రచ్చ.. వద్దని అన్నయ్య  వారిస్తున్నా  దాని వెంట పడ్డాను పట్టుకోటానికి.. ముందు జాగ్రత్తగా అది తప్పించుకుని   వెళ్ళే అన్ని మార్గాలను మూస్తూ , దాని పట్టుకోటానికి శతధా ప్రయత్నిస్తున్నాను.. నేను తరిమే కొద్ది… మున్ని వేగం పెంచేసి ఉరుకుతోంది చిరుత లాగ… అది అలా వెళ్ళే కొద్ది నాలో పట్టుదల ఇంకా పెరిగింది..

అలా మా చేసింగ్ సీన్ నడుస్తుంటే… ఇద్దరం ఒకే సారి గమనించాము… ముందు గుమ్మం దగ్గరున్న కిటికీ ఒకటి పాక్షికం గా తెరిచి ఉందని.. అంతే… చివరి సీన్ లో నేల మీద పడున్న పిస్టల్ కోసం డైవ్  చేసే హీరో,విలన్ల లాగ కిటికీ వైపు గాలిలో ఎగిరాము చెరో వైపు నుండి… నేను ఆ ఆఖరి  ఎస్కేప్ రూట్ ని కూడా మూసెయ్యాలని, మున్ని   ఏమో ఆ ఆఖరి అవకాశాన్ని వినియోగించుకోవాలని … ఎవరైనా కెమరా మాన్ ఉంటె… స్లో మోషన్ లో ఆ సీన్ చూపించుంటే సూపర్ ఉండేది ఆ సీను.. 

ముందు చేరుకున్న నేను కిటికీని మూసేయ్యగలిగాను.. అప్పటికి ఇంకా గాల్లోనే ఉన్న మున్ని ముఖంలో భయాందోళనలు ప్రస్ఫుటంగా కనిపించేసరికి.. విజయ దరహాసం నా ముఖం పై వెల్లి విరిసే సమయంలో జరిగిందా  ఊహించని సంఘటన..

అప్పటి వరకు ఉగ్గపట్టుకుని, ప్రకృతి పిలవటం తో “ఈల పాట” కోసం ఇంటి బయటకు వెళ్ళాలని  ప్రయత్నించిన  మున్ని ఇక కంట్రోల్ చేసుకోలేకపోయింది… ఫలితం గా కింద వున్న మంచం, దాని పైన వున్న దుప్పటి ఖరాబై  పోయాయి… ఇక “I gave it up , మై మాస్టర్”  అంటూ చివరి క్షణాలలో నిస్సహయం గా మున్నీ నా వైపు చూసిన చూపు ఇంకా గుర్తే.. ..సంస్కారవంతంగా ఇంటి బయటికెళ్ళాలని     ప్రయత్నించిన   మున్నీ ని అర్థం చేసుకోలేకపొయినందుకు బాధ ఒక వైపు… ఖరాబైన దుప్పట్లను ఉతకాలి కదా అన్న బాధ ఇంకో వైపు, విడతలవారిగా పీడిస్తూ వుంటే.. మిక్కిలి ఖిన్నుడనై చింతించ సాగాను. 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

5 Responses to ఓ సంస్కారవంతమైన పిల్లి కథ

 1. Maddy says:

  ha ha ha.. wow… Really nice cat… 🙂

 2. :)))))))).smskaarvanthamina vaati basha manaki ardham kaaka..annamaata.ilati..anubhavaalu..

 3. Piiiini penchetappudu marjala basha nerchukonivunte neeku aa thippalu vundevi kaavu.

 4. sreeja says:

  ఇది నిజం గా జరిగిందో లేక కథో నాకు తెలియదు గానీ ఎంతో ఇంట్రస్టు గా చదవాలనిపించింది చివరి వరకు.
  సన్నివేశానికి..మీ స్క్రీన్ ప్లే కి నా అభినందనలు..
  శ్రీజ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s