జిహ్వ చాపల్యం – 1

నిద్ర చోటెరుగదు… ఆకలి రుచెరుగదు అని అంటారు…గాని… మాంచి ఆఖలి మీదున్నప్పుడు మనకిష్టమైన ఆహరం తింటే… ఆ ఆహారం పెట్టిన వాళ్ళల్లో  దేవతలు ఈస్టమన్ కలర్లో  కనిపిస్తారు. అలాంటి దైవాన్నే నా కాలేజి స్నేహితుడిలో చూసానీ మధ్య. .. ఉద్యోగరీత్యా నేను చదువుకున్న కాలేజ్ కే వెళ్ళాల్సి వచ్చింది. నాతో పాటు చదువుకున్న స్నేహితుడు అక్కడే అధ్యాపకుడిగా ఉన్నాడు.. నేను చేయాల్సిన పనిని అతడి సహాయంతోనే official గా చేయాలి.. ఆ వూరికి వెళ్ళటానికి రెండు రోజుల  ముందు  నా మిత్రుడితో  ఫోన్ లో మాట్లాడి కార్యక్రమం finalise చేశాను. ఫోన్ లో మాటలాడుతున్నంత  సేపూ, అతడిని అడగాలా వద్దా అని కొంతసేపు డోలాయమాన స్థితిలో ఉండి, చివరికి ఉండబట్టలేక అడిగేశాను.. ” మనం చదివే రోజుల్లో హాస్టల్ లో తినే mixed vegetable కర్రీ విత్ కొబ్బరి చట్నీ ఓ సారి తినిపించవా …” అని.

వెళ్ళిన మొదటి రోజే… హాస్టల్ కి తీసుకెళ్ళి, ‘నీకోసం ఈ రోజు మెనూ మార్చి నువ్వు కోరిన ఐటెం చేయించాము.. ఇక దున్నేసుకో’ అన్నాడు.. అంతే… ఆ తరవాత అక్కడ.. పెళ్లి చూపుల్లో ముస్తాబై వచ్చిన పెళ్లి కూతుర్ని కన్నెత్తైనా చూడకుండా… ఆబగా స్వీటు, హాటు తినే బ్రహ్మానందానికి పోటీగా.. చుట్టూ పక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోనంతగా లాగించాను… ఎన్నో ఏళ్ళ తరవాత తిన్నా కూడా… అదే రుచి… జిహ్వ నాడులు  కొంకర్లు తిరిగి పోయాయి వాటిని తింటుంటే…

ఇంతకీ ఆ ఐటెం గురించి విపులంగా చెప్పలేదు కదూ.. బెండ కాయ, ఉర్ల గెడ్డ (potato),   దొండకాయ, వీటిని  slices గా చేసి,చెనిగ్గింజలు(groundnut) తో బాటు  బాగా ఫ్రై చేసి పకోడా తో కలుపుతారు.., దీనిని  అన్నంలో, కొబ్బరి చట్నీ (రోట్లో రుబ్బింది సుమండీ) తో కలుపుకుని తినేవాళ్ళం. ప్రతి ఆది వారం.. వెజిటేరియన్ మెస్ లో ఈ ఐటెం పెట్టె వారు.. అప్పట్లో ఆదివారం ఈ ఐటెం తిని, మిగతా ఆరు రోజులూ ఈ ఐటెం కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళం… మిగతా ఏ items పైన లేనంత క్రేజ్ ఈ ఐటెం కి వుండేది..

ఇప్పటికీ మా కాలేజ్ వాళ్ళు ఎప్పుడైనా కలిసి ఆ రోజులు నెమరు వేసుకుంటే.. ఈ ఐటెం ప్రస్తావన తప్పకుండా వస్తుంది.

పుర్రెకో బుద్ది … జిహ్వ కో రుచి అంటారు కాని… హదేమిటో… ఆ కాలేజి లో చదువుకున్న అందరి జిహ్వలకూ అదే రుచి…

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

One Response to జిహ్వ చాపల్యం – 1

  1. charan says:

    baavundandee…intakee college peru cheppaledu meeru..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s