స్నేహితులంతా ఏకమైన వేళ..

మా మిత్ర బృందం ఇంతకు మునుపు అనుకున్న విధం గానే ఈ నెల పద్నాల్గున చిత్తూర్ లో కలిశాము. సినిమా shootings లో ఎప్పుడూ తలమునకలుగా మునిగి ఉండే స్వర్ణ కి నాలుగు నెలల ముందే ఈ తేది నిర్ణయించి చెప్పటం వలన, తను అన్ని పనులనూ ముందే పూర్తి చేసుకుని ఓ రెండు రోజులు పనులేవీ లేకుండా చూసుకొంది. పదమూడున చేరుకున్న మిత్రులంతా  జట్టుగా చేరి వూళ్ళో  ఉన్నమిత్రుల  ఇళ్ళకు వెళ్ళటం జరిగింది.  ఆ క్రమంలో kalaivani,  గాయత్రి, ప్రసన్న, ప్రమీల ఇళ్ళకు వెళ్ళటం జరిగింది.  ఆరోగ్యం సరిగ్గా లేక  మంచం పట్టిన  గోపాల్ ఇంటికి  అందరూ వెళ్ళగానే,  సంభ్రమా శ్చర్యాలలో    గోపాల్ మునిగిపోయాడు. తనని సుమారు గంట సేపు పరామర్శించి ధైర్యం చెప్పి అందరూ కదిలారు భారమైన హృదయాలతో. 
చివరగా మా సూరి బావ ఇంటికెళ్ళి, డాబా పై సుమారు పన్నెండు  మంది 
ఇడ్లీలు, దోసెలు తింటూ ఆ వెన్నెలను అస్వాదించాము. ఆ క్షణాలలో అందరూ పొందిన ఆనందం అంత ఇంతా కాదు. 
తరవాతి రోజు, వేదిక భాస్కర్ హోటల్ కి మారింది. గురువులు పుష్పరాజ్, చార్లీ బాబు, 
రామకృష్ణ గార్లు అందరిని ఆశీర్వదించడానికి విచ్చేశారు. ఎక్కడో  చికాగో లో ఉన్న విజయకృష్ణ అదే సమయానికి మా అందరికి తన విషెస్ చెపుతూ 
ఎస్. ఏం. ఎస్ పంపటం తన కున్న స్నేహతత్పరతకు నిదర్శనం.
మిత్రుల సమావేశం మధ్యలో , చిత్తూర్ ఏం. ఎల్. ఏ. శ్రీ సి. కే. బాబు గారి సతీమణి ,  మన స్కూల్ పూర్వ విద్యార్థిని అయిన శ్రీమతి డా.. సి. కే. లావణ్య బాబు గారు  మన స్కూలు   శత వార్షిక జయంతిని ఈ నెల 20  న  జరుపుకుంటున్న  సందర్భంగా ,  అందరినీ ఆహ్వానించటానికి వచ్చారు. వారి రాక, అందరితో ఎంతో ఆప్యాయమైన పలకరింపులు, మన మీటింగ్ కి మరింత శోభ తెచ్చాయి.
భోజనాలయ్యాక, ఎందఱో సినీ దిగ్గజాలను నర్తిం పజేసిన స్వర్ణ, తాను  cheoreograph చేసిన హ్యాపి డేస్ లోని “పాదమెటు పోతున్న…’ సాంగ్ కి మన మిత్రులచేత నర్తిమ్పజేసారు. kalaivani , సబితా,  రవి, సూరి బావ , శశి నృత్యం చేస్తుంటే నవ్వులే నవ్వులు..
సాయంత్రం అందరూ వీడ్కోలు తీసుకుంటుంటే కళ్ళలో తడి… మళ్లీ వచ్చే సంవత్సరం ఎప్పుడు కలుసుకుంటామో  అనే నిరీక్షణతో భారమైన గుండెలతో అందరూ కదిలాము.
our classmates with teachers- 1

our classmates with teachers -2

Ms. Dr CK. Lavanya Babu inviting our batchmates for the centenary celebrations of our school

Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

2 Responses to స్నేహితులంతా ఏకమైన వేళ..

  1. krsna says:

    chala bavundandi. abhinandanalu. mee kaalapu aalochanalu, apyayatalu, kattubadi chala nayam. bahusha aa samskaram mii taranitone samaapti anukuntaa… mee anubhavalu blaglokamlo panchukunnanduku krutagnyatalu.

  2. The memorable moments of 14.8.11,with our beloved friends& teachers un forgetable,givien joy to us.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s