ప్రార్థనని ఆలకించిన దేవుడు

ఓ గ్రూప్ ఫోటో చూసారనుకోండి… ఎవరిని ముందుగ నిశితంగా చూస్తారు…? మీరు మొహమాట పడక పోతే, మీ సమాధానం ఖచ్చితంగా “నన్నే..” అని చెపుతారు. మనల్ని మనం ఫోటో లో చూసినా, పేపర్ లో కాని ఇంకెక్కడైనా కాని మన పేరు, ఫోటో లాంటివి ప్రింటులో చూసినా, ఎంతటి నిగర్వికైనా కించిత్ ఛాతి   కొలత పెరగటం కద్దే…

ముప్పై ఏళ్ళ కిందట, మేము పదవ తరగతి లో ఉన్నప్పుడు, రోజూ మేము చేసే ప్రేయర్ గ్రౌండ్ దగ్గర  ఉన్న మెరిట్ (ప్రతి సంవత్సరం పదవ తరగతి లో మొదటి ర్యాంకు సాధించిన వారి పేర్లు ) బోర్డు  తదేకంగా చూసే వాడిని. అందుకో కారణం ఉంది… అప్పటికి ఆరేళ్ళ మునుపు ఆ స్కూల్లో మొదటి ర్యాంకు సాధించిన అన్నయ్య పేరు (అప్పట్లో అది స్టేట్ ర్యాంకు కూడానూ…) ఆ మెరిట్ బోర్డులో ఉండటమే.. తొమ్మిది వరకూ హాయిగా మునిసిపల్ స్కూల్లో చదివిన నన్ను పదవ తరగతి ఆ స్కూల్లో వేయటానికి ఒకానొక కారణం .. ఎలాగైనా నా పేరు కూడా ఆ బోర్డులో రావాలనే..

స్కూలో ప్రతి రోజు జరిగే ప్రేయర్తో పాటు, కళ్ళు మూసుకుని నేను చేసే ప్రార్థన ఇంకోటుండేది.. అదేంటంటే..” 13 (ఇది బోర్డులో రావాల్సిన సీరియల్ నెంబర్)  నా పేరు.. టెన్త్ ఏ … 515 ..” అని… అంటే వచ్చే సంవత్సరం ఆ బోర్డులో రాయాల్సిన ఎంట్రీ అలాగుండాలి  అని దేవుడిని మొక్కుకునే వాడిని.. క్రమం తప్పకుండా సంవత్సరమంతా సాగింది ఈ ప్రార్థన..

“తానొకటి తలచిన దైవమొకటి తలచును కదా..”.. చివరికి ఏమయ్యిందంటే..ఆ స్కూలు ఫస్ట్ మా క్లాస్ టీచేర్ గారి అబ్బాయి కి వచ్చింది.. తన మార్కులు 498 … నాలుగు మార్కులు తక్కువగా మనం రెండో స్థానం.. బోర్డులో తన పేరు తర్వాత చూసినప్పుడల్లా, నా పేరు చూసుకోలేకపోయానే అని వెలితి పీడించేది.. ఆ అదృష్టం జూనియర్ కాలేజిలో కూడా వరించలేదు… ఎందుకంటే అక్కడ మెరిట్ బోర్దులే పెట్టేవారు కాదు కాబట్టి.

ఇలా ఎన్నో వసంతాలు గడిచిపోయాయి.

ఈ మధ్య నేను చదువుకున్న ప్రొఫెషనల్ కాలేజికి వెళ్లాను ఓ పని మీద.. అక్కడే ప్రొఫెసర్ గా పని చేస్తున్న నా మిత్రుడు నా చేయి పట్టుకుని కాలేజి లో ఓ చోటికి తీసుకెళ్ళాడు.. అక్కడ ఓ పెద్ద మెరిట్ బోర్డు … మెరుస్తోంది ధఘద్దాయమానంగా.. అందులోని ఓ పేరుని చూస్తూ కాసేపు మైమరచి పోయాను…

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

One Response to ప్రార్థనని ఆలకించిన దేవుడు

  1. Congrats,Ramakrishna,for achieving the target of ur name in the merit board at graduation level by the grace of God.I hope u sincerly prayed the God at graduation level.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s