స్నేహానికి దర్పణం ఆ ఇద్దరు అమ్మాయిలు

ఈ టపా రాయటానికి ఉపక్రమించగానే , మనకు తెలిసున్న చిత్ర కథని ఇంకో శైలి లో చెపుతున్నానేమో అనిపించింది. కళ్ళ ముందు జరిగిన యదార్థాన్ని రాస్తున్నానంతే…

ముప్పై ఐదేళ్ళ క్రితం…ఓ వూళ్ళో ఇద్దరు అమ్మాయిలు… స్కూల్లో కలిసి చదువుకున్నారు.. అప్పట్లో వారిరువురి జీవన స్థితి గతులు అంతంత మాత్రమే… ఇద్దరికి చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు.. చిన్నతనం నుండే ఎన్నో ఆటు పోట్లు… ఈ సంఘర్షణల మధ్య వారి స్నేహం మరింత ధృఢ పడింది. ఒకరి కష్టాలలో ఇంకొకరి ఆసరా, ఓదార్పు లభించేది..

కాలక్రమేణా ఇద్దరిలో ఒకరు ఆ వూరు వదిలి వెళ్లారు… అయినా వారి స్నేహ సంబంధాలు కొనసాగేవి… ఓ సారి ఇంకో వూరి నుండి తన స్నేహితురాలిని చూడటానికి వచ్చింది ఆ వూరు వదిలి వెళ్ళినావిడ. అప్పటికి ఇద్దరి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే.. ఫ్రెండ్ని కలిసాక …తిరుగు ప్రయాణం లో ఆ స్నేహితురాలు  బాగ్ లో చూసుకుంటే ఓ వంద రూపాయల నోటు.  ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం… తరవాత ఫోన్ చేసి తన ఫ్రెండ్ ని అడిగితే తను చెప్పింది..” నీ దగ్గర డబ్బు లేకుండటం గమనించాను.. మళ్లీ వూరికి వెళ్ళాక అవసరం పడుతుంది కదా.. ఇస్తే   కాదంటావని   నీ బాగ్ లో పెట్టాను”  అని చెప్పింది.. అడగకుండానే తన పరిస్థితిని  అర్థం చేసుకున్న ఆ ఫ్రెండ్ ఉదాత్తత ని చూసి ఆ అమ్మాయికి  నోట మాట రాలేదు.

కాలం వేగంగా సాగింది.. వేరే వూరికి వెళ్ళిన ఫ్రెండ్ తన స్వశక్తితో ఉన్నత శిఖరాలు చేరుకుంది.. ఎప్పుడూ బిజీ బిజీ జీవితం.. తన బాల్య మిత్రురాలు తో మాట్లాడటానికి కూడా తీరిక ఉండేది కాదు. కాని తనని ఎప్పుడూ మరిచేది కాదు. అప్పుడప్పుడూ మాట్లాడుకున్నా  ఆత్మీయంగా మాట్లాడుకునే వాళ్ళు.. కాని కలవటం చాల తగ్గి పోయింది ..

ఇంత కాలానికి తను చదువుకున్న వూరికి వెళ్ళింది ఆ మిత్రురాలు. ముందుగా తన ఫ్రెండ్ ఇంటికే వెళ్ళింది మరి కొంత మంది మిత్రులతో. తనని చూడగానే దుఖం ఆపుకోలేక పోయింది..ఇంట్లో కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ నాటి స్మృతులలోకి వెళ్లి పోయారు.  ఎంతో ఉన్నత స్థానం లో వున్నా తను గాని, తన ఫ్రెండ్ గాని ఆ సంగతే మరిచి ఆనాటి ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకున్నారు.. ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా చూడటానికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ. ఇప్పటికీ … ఉన్నత స్థానానికి చేరుకున్న  ఆ స్నేహితురాలు తన ఫ్రెండ్ ని, తను చేసిన సహాయాన్ని మరువలేదు..

ఇంకా ఆ నాటి స్నేహ విలువలు వున్నాయి అని చెప్పటానికి ఆ ఇద్దరు living examples. ఆ ఇద్దరూ నాకు తెలిసున్నందుకు  గర్విస్తున్నాను. వారి మైత్రి ఇలాగే కొనసాగాలి.. అని మనసారా కోరుకుంటున్నాను.

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to స్నేహానికి దర్పణం ఆ ఇద్దరు అమ్మాయిలు

  1. మంచి జ్ఞాపకాన్ని అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  2. Ramkrishna,i too proud be a friend of that friends u mentioned. Long live our friend ship. With best wishes to all of our friends,especially to kalaivani& swarna.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s