భాషని ప్రేమించాలంటే ఈ పాటలు వినాల్సిందే..

ఈ మధ్య “రంగం” చిత్రం లో పాటలు వింటుంటే ఓ పదం నన్ను ఆకర్షించింది. ” ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో..” అంటూ సాగే ఆ పాటలో ‘మంచు’ అన్న పదాన్ని రెండు సందర్భాలలో మంచుగాను,  ప్రేమ అంచు గాను అందంగా వాడటం చూసాక, ‘పర్లేదు… డబ్బింగ్ పాటలలో కూడా సాహిత్యం లో ప్రయోగాలు చేస్తున్నారు” అనుకున్నాను.   సాహిత్యానికి శోభనిచ్చేవి పదాలు… పదాల అల్లికలు…. పద విన్యాసాలు… కొన్ని చిత్ర గీతాలను నిశితంగా గమనిస్తే, అందులోని పదాలను అందంగా అల్లిన ఆ గీత రచయితలను అభినందిన్చాలనిపిస్తుంది.. పదాల విరుపులు… వినటానికి ఇంపైన పదాలు ఆ పాటలలో వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది..

అలాంటి కొన్ని గీతాలను చూద్దాం.

ఈ కోవలో నాకు బాగా నచ్చిన పాట “భక్త కన్నప్ప” చిత్రం లోనిది. ” శివ శివ శంకరా..” అన్న పాట లో ” మా ‘రేడు’ నీవని… ఏరేరి తేనా … ‘మారేడు’ దళములు నీ పూజకు..” అన్న పదాలు. మా రేడు (రాజు) అన్న పదాన్ని  రెండు విధాలుగా వాడటం… ఆ సందర్భానికి చక్కగా అమరటం ఆ గీత రచయిత ప్రజ్ఞకి తార్కాణం. 

అలాగే “నాలుగు స్తంభాలాట” చిత్రం లో ఓ పాటలో “దొరలనీకు కనుల నీరు… దొరలదీ లోకం.. మగ దొరలదీ లోకం..”  అని సాహిత్యం ఉంటుంది.. మగవారిని ఉద్దేశించి. దొరల అన్న పదాన్ని రెండు భిన్నమైన అర్థాలకు వాడారు ఒకే చోట.. ఈ పాట చివరి సారి విని ఇరవై సంవత్సరాల పైనే అయి వుంటుంది.. కాని ఈ సాహిత్యం మాత్రం ఇప్పటికీ గుర్తుండి పోయింది. 

“రెండు రెళ్ళు ఆరు” (టపాలో తప్పుని  సవరించిన శ్రీ కి ధన్యవాదాలతో)   చిత్రంలో “కాస్తందుకో…దర’ఖాస్తందుకో’.. ప్రేమ దర’ఖాస్తందుకో’ “ అన్న పాటకూడా ఇలాంటి ప్రయోగానికి ఓ ఉదాహరణ..

“ముత్యమంత ముద్దు” చిత్రం లో “ప్రేమ లేఖ రాశా… నీ’కంది’ ఉంటది. పూల బాణమేశా… ఎద ‘కంది’ ఉంటది’ “ అన్నపాటలో కూడా ఇలాంటి ప్రయోగమే కనపడుతుంది..

ఇక పోతే… సాహిత్యం లో మంచి పదాలు మృగ్యమై పోతున్న ఈ రోజులలో, కొన్ని పదాలు సాహిత్యంలో వాడటం, మన భాష సంపదని కాపాడుకోటానికి ఉపకరిస్తున్నాయి.. అటువంటి పాటలలో “సిరి వెన్నెల’లోని అన్ని పాటలూ మంచి పదాలకి పెద్ద పీట వేసాయి. వాటి గురించి ఇంకో ప్రత్యేకమైన టపా లో ఉటంకించాలి. అలాంటి మరి కొన్ని పాటలు..

“తులా భారం” లో “రాధకు నీవేర ప్రాణం..” లో ‘నీ ప్రియ వదనం వికసిత జలజం… నీ ధరహాసం జాబిలి కిరణం..” అన్న చరణాన్ని వినండి. చక్కని పదాలతో నిండిన ఆ పాట ఎంత శ్రావ్యంగా ఉంటుందో..

“నీరాజనం” లో “నిను చూడక నేనుండ లేను… ఈ జన్మలో.. మరి ఏ జన్మకైనా ” అన్న పాట సరళమైన పదాలతో ఎంత హృద్యంగా భావ ప్రకటన చేయొచ్చో చెపుతుంది .. ఆ పాటలో “మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం”  అన్న పద చరణాలు  నాకు చాల ఇష్టం.. ఈ పాట లేకుంటే బహుశా “హృదయంగమం” అన్న పదం మన స్మృతి ఫలకాలలో చెరిగి పోయేదేమో.. 

“కోడెనాగు” లో “సంగమం… సంగమం… అనురాగ సంగమం..” అన్న గీతం లో ‘నింగి నేల ఏకమైన నిరుపమాన సంగమం’ అన్న చరణం వినటానికి ఎంత బాగుంటుందో..

బ్లాగు సంస్కృతి వచ్చాక… తెలుగు భాషని, అందులోని పద సంపదని భావి తరాలకందించటానికి ఓ చక్కటి మాధ్యమం దొరికిందని నాకనిపిస్తుంది… మీరేమంటారు? 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

7 Responses to భాషని ప్రేమించాలంటే ఈ పాటలు వినాల్సిందే..

 1. Jai says:

  గోరేటి వెంకన్న రాసిన “పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల” పాట నిండా ఈ రకమయిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. భాష, భావం చక్కగా అమర్చిన ఈ పాట సినిమా కోసం రాయలేదు. ప్రజాదరణ పొందిన తరువాత సినిమాలో వేసుకున్నారు.

 2. sree says:

  “kaastanduko..darakhaastanduko” paata “rendu rellu aaru” sinima lonidi. “kanchana ganga” kaadu !

 3. magadhe.era says:

  చాలా బాగా రాసారు, సారు!
  “ద” కి బదులు చాలాచోట్ల “ధ”లు కంట్లో నలుసులు.

  • mhsgreamspet says:

   ధన్యవాదాలండి. గూగుల్ లో టైప్ చేస్తుంటే ఒక్కో సారి, తెలిసి తప్పులు రాసేస్తుంటాను. మీ సూచనని పాటిస్తాను.
   రామకృష్ణ

 4. baagundhi.. manchi vishayam,manchi paatalu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s