Irene గుర్తు తెచ్చిన నా అనుభవాలు

గత కొద్ది రోజులు వణికించిన ఇరేనే హరికేన్ గురించి వింటుంటే ఈ వేసవిలో నేను చూసిన కొన్ని దృశ్యాలు గుర్తొచ్చాయి. ఈ వేసవిలో అమెరికాలో టెన్నిసీ, మిస్సిసిపి, ఇండియానా, అలబామా వంటి రాష్ట్రాల్లో టోర్నడోలనబడే  సుడిగాలుల   తీవ్రత ఎక్కువగా ఉంది.

ఈ నేపధ్యంలో  , ఓ తెలుగు కుటుంబం వారింటిలో భోజనానికి ఆహ్వానించారు ఓ వారాంతపు సాయంత్రం. ఇల్లు చూసే సరికి, మనం సినిమాలలో సంపన్నుల చూసే గృహాలు కూడా ఆ ఇంటి  ముందు  దిగదుడుపే అనిపించింది… అంత బాగుంది వాళ్ళ ఇల్లు.  పిల్లలు వేరే ప్లేస్ లో సెటిల్ అయ్యేసరికి, కేవలం నన్ను ఆహ్వానించిన దంప తులే ఆ లంకంత ఇంట్లో ఉంటున్నారు. ఎంతో అధునాతనంగా ఉంది ఆ ఇల్లు. కింద ఓ ఇరుకైన గది తమాషాగా అనిపించి ఏమిటని అడిగాను వారిని.  టోర్నడో వస్తే, రక్షణ కోసం అక్కడ వెళ్లి ఉంటామని చెప్పారు.

భోజనాలయ్యాక పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో , ఎదురుగ ఉన్న టీ. వీ లో టోర్నడో వార్నింగ్ ఒకటి రావటం మొదలయింది. టీ. వీ లో ఏదో కౌంటీ పేరు చెపుతున్నారు … ఆ కౌంటీలోని వాళ్ళు వెంటనే సురక్షిత ప్రాంతాలలో తల దాచుకోవాలని. ఈ కౌంటీ ఎక్కడుంది సార్ అని అడిగాను ఆ ఇంటి యజమానిని యధాలాపంగా.. మనమున్న కౌంటీ అదే అని చెప్పేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి.. ‘మరి ఇప్పుడెలా’ అన్నాను. ఆ దంపతులిద్దరూ ” ఏం పర్వాలేదు.. కాసేపు చూసి, అవసరమైతే, బేస్మెంట్ లోని రూం కి వెళ్దాము” అని చెప్పారు… ఇంతలో గాలి ఉధృతమైంది.. దూరం నుండి సైరెన్  వినిపించసాగింది.. టోర్నడో ఏదైనా ప్రాంతాన్ని సమీపిస్తే అక్కడ సైరెన్ మోగిస్తారు హెచ్చరికగా… సైరెన్ వినేసరికి నా హోస్ట్ కొంచెం అలెర్ట్ అయ్యారు.. ఈ లోపు టీ. వీ ప్రసారాలు కూడా ఆగి పోయాయి. వెంటనే  తన స్మార్ట్ ఫోన్ లో  టోర్నడోని ట్రాక్ చేయ సాగారు. అతి సమీపంలో ఉంది అని చెప్పగానే, ముగ్గురిలోనూ  ఆందోళన… సుమారు పది నిమిషాలు గడిచాక, టోర్నడో అతి సమీపం నుండి దాటి వెళ్ళినట్లు తను చెప్పగానే, రిలీఫ్.. తరవాత హోటల్ కి రిటర్న్ వెళ్తుంటే.. దారి పొడుగునా… విరిగిన చెట్లు.. డ్రైవ్  చేస్తూ నా హోస్ట్ చెప్పారు ఇలాంటివి చాల సాధారణమని…

ఈ ఎపిసోడ్ లో నాకు నచ్చినదేమిటీ అంటే… ప్రకృతి వైపరీత్యాల సమయం లో అతి తక్కువ వ్యవధిలో అందరికి సమాచారం చేరవేసే టెక్నాలజీ సమర్థత… ఎటువంటి అవాంతరాన్నైనా  ఎదుర్కొనే మానసిక సంసిద్ధత.. weather ని కూడా అతి ఖచ్చితంగా ఓ రెండు మూడు రోజుల మునుపే forecast చేసి చెప్పటం వలన ప్రజలు ఏమరుపాటుతో ఉండరు.. కారు నడిపే సమయం లో కూడా , అందరూ వాతావరణ   హెచ్చరికలను వింటూ తగు జాగ్రత్తలను తీసుకుంటూ వుంటారు.

కొంత ఉత్కంఠ కి లోనైనా, మొత్తానికి ఓ మంచి learning experience పొందాను

 

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

2 Responses to Irene గుర్తు తెచ్చిన నా అనుభవాలు

  1. Hats off for latest technology to track natural calamities in US.If we could achieve the same, we can minimise the loss.

  2. Chandu says:

    Sir, this post remembers me of the movie “Storm Chasers”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s