ఇలాంటి గురువులు మీకూ ఉన్నారా…?

You can become a good teacher by choice and not by chance

y= f(x) అని  గణితం లో తరచూ చదువుతుంటాం. y యొక్క విలువ పూర్తిగా x మీదే ఆధార పడి ఉంటుందని దాని అర్థం. అది మనుషులకూ వర్తిస్తే, మన వ్యక్తిత్వం y అయితే, మనల్ని తీర్చి దిద్దే x గురువులని నా అభిప్రాయం. ప్రస్తుతమైతే చెప్పలేను కాని, ఓ ముప్పై ఏళ్ళ మునుపు, ఇది సత్యమే..  

ఇప్పటికీ మన బాల్య మిత్రులు కలిస్తే, ఇలాంటి విషయాలే చర్చకు వస్తుంటాయి. మా బాచ్లో ఉన్న గుమాస్తా నుండి పెద్ద సంస్థల డైరెక్టర్స్ , సినిమా రంగం లో స్థిరపడ్డ వారి వరకూ.. అందర్లోనూ… వారు చేసే పని పట్ల ఉన్న నిబద్ధత, నిజాయితీ కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది.. దీనికి ముఖ్య కారణం… మమ్మల్ని తీర్చి దిద్దిన గురువులే  అని మేమందరం ఒప్పుకునే సత్యం. అందరూ అని చెప్పను కాని, కొంత మంది గురువులు వారి బోధనా పద్ధతులు, వారి వ్యక్తిత్వం మాలో చాల మందిని ప్రభావితం చేసాయి.

నా వరకు చెప్పాలంటే… ముగ్గురు (మన  స్కూలు ) గురువులు నా వ్యక్తిత్వం పై ప్రభావం చూపారు. ఆ మహనీయులను, రోజులో ఏదో ఒక సందర్భంలో గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాను.


మొదటివారు రమణ మేష్టారు.. మన లెక్కల మేష్టారు. స్కూలు ఫీజు ఇంట్లో వాళ్ళు కట్టక పోతే, తనే ఆ విద్యార్థికి ఫీజు కట్టిన మహానుభావుడు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోటమే కాదు, అతను లెక్కలు చెపితే ఎంతటి క్లిష్టమైన విషయమైనా యిట్టె అర్థమై పోయేది. టాపిక్ బాగా సీరియస్ అయితే, జోకులతో వాతావరణాన్ని ఆహ్లాదపరిచేవారు. అలాగే ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించే వాడు కూడా కాదు. ప్రేమ, క్రమశిక్షణ, సరైన బోధనా పద్ధతి ..ఇలాంటి ఎన్నో virtues  ల కలబోత మా రమణ మేష్టారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడి దుడుకులను  ఎదుర్కున్నా, అందర్లోనూ  జ్ఞాన జ్యోతులు వెలిగించటమే కాదు.. మా వ్యక్తిత్వాన్ని.. ప్రభావితం చేసిన మనీషి… తను రిటైరైన కొద్ది రోజులకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం నిజంగా బాధాకరం. నా విషయం లో y =f (x ), తనే పెద్ద x .

రెండవ వ్యక్తి తెలుగు మేష్టారు దామోదరం గారు. ఇంతకు మునుపు టపాలలో, మన క్లాస్మేట్ గీత చెప్పినట్లుగా భాషనీ ప్రేమించే వ్యక్తి. చండశాశనుడని  పేరున్న, తను పాఠ౦  మొదలెడితే అన్ని మరిచిపోయి వినే వాళ్ళం… అప్పుడే పీరియడ్ అయిపోయిందా అని ఎన్నో సార్లు అనిపించేది తన క్లాసు అయిపోతే ..  చాల మంది తనంటే ఉన్న భయం వలన పాఠాలను అస్వాదించలేక పోయి వుండవచ్చేమో కాని.. తను నేర్పిన భాష వలన… ముప్పై ఏళ్ళ తరవాత, తెలుగులో ఈ మాత్రం మీతో మా ఆలోచనలను పంచుకున్నామూ అంటే ఆ దేముడి చలవే.. భౌగోళికంగా అటు తమిళనాడు (కేవలం 25 కి. మీ లు), ఇటు కర్ణాటక (40 కి. మీ. లు) ఉండటం వలన, మా అందరి పై పర భాషా ప్రభావం బయట ఎక్కువగా ఉండేది. వీటినుండి మమ్మల్ని insulate చేసి, మాలో తెలుగు భాష పై మమకారం కలిగేలా తెలుగును బోధించటం అన్నది కత్తి మీద సామే అయినా, మా దామోదరం మేష్టారు అందులో పూర్తిగా కృతకృత్యులయ్యారు.. అందుకే అంటాను… ‘ఈ బ్లాగులో రాసేది మేమే అయినా.. మా చేతే రాయించెడి వాడు పైలోకాన ఉన్న ఆ దామోదరుడట..’ అంటాను..  ఈ లోకాన లేకున్నా.. మా అందరిలోనూ సజీవమై ఉన్న భాషా మూర్తి మా దామోదరం మేష్టారు. 

టీచెర్ గా ఉన్నప్పుడు, “విద్యార్థులంతా తన పిల్లలే అనుకోగలిగితే ఆ గురువులో ఎటువంటి పక్షపాతాలుండవు… భేద భావాలుండవు”- ఈ సిద్ధాంతాన్ని నిరూపించిన వ్యక్తి మా అనసూయా మేడం.. తను శాంత మూర్తి.. మా క్లాసులో ఉండే రౌడీలైనా తన ప్రేమ ముందు మోకరిల్లాల్సిందే.. తన లోని ఆ ప్రేమించే గుణాన్ని నాకు తెలియకుండానే అలవరచుకున్నాను.. నేను టీచెర్ గా మారిన కొన్ని సంవత్సరాలలో… నేను ఏ విద్యార్ధినైనా  మందలించే ముందు.. తనే గుర్తు  వచ్చేవారు… అంతే నా approach   మారి పోయేది.. బోధన పట్ల నా total philosophy ని అంతగా ప్రభావితం చేసిన మేడం, ప్రస్తుతం పదవీ విరమణ చేసి చిత్తూర్ లో ఉన్నారు.  

గురు దినోత్సవ సందర్భంగా ఎన్నో శిలలని శిల్పాలుగా మార్చిన ఆ శిల్పులను వినమ్రంగా మా  బాచ్ అందరి తరపునా స్మరించుకుంటున్నాము. ఇలాంటి గురువులు మీకూ ఉన్నారా…? మరెందుకు ఆలస్యం… వెంటనే వారిని కృతజ్ఞతలతో  స్మరించుకోండి. 
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to ఇలాంటి గురువులు మీకూ ఉన్నారా…?

  1. I indeated to the S.V. Ramana sir,who taught us english in xth class. By his teaching only i got comand in english to some extent Like wise in telugu by the teachings of our beloved chandra Damodara naidu sir.

  2. Chandu says:

    సార్… మీ పోస్ట్స్ ఒక్కొక్కటీ చదువుతూ వచ్చాను దీని దాకా.
    మీరు మీ గురువుల గురించి చెప్తున్నప్పుడు మా పుణ్యమా అని మేము పొందిన అతి తక్కువ మంచి గురువులని గుర్తు చేసుకున్నా. కానీ నాకొక బాధ ఉంది ఇప్పటికీ. మా నాన్న గారి శిష్యుడిని కాలేకపోయానే అని. నాన్నగారికి చాల గొప్ప పేరుంది.
    మా నాన్న గారు తెలుగు లెక్చరర్. మంచి వక్త. వారు చేసిన పరిశోధనకు గోల్డ్ మెడల్ వచ్చింది. చాలా చాలా చక్కగా ఉపన్యసిస్తారు. కొన్ని ఐ,ఏ.యెస్ బేచెస్ ల కి బోధించారు.

    చందు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s