జ్ఞాపకాలు ఎంత పాతబడితే అంత పచ్చబడతాయి… మనం ఇరవై, ముప్పై ఏళ్ళ తరవాత కలుసుకుంటేనే ఎంతో ఉద్విగ్నత పొందాము. ఏకంగా ఎనభై ఏళ్ళ తరవాత మళ్ళీ ఆనాటి రోజులు నెమరు వేసుకోగల అదృష్టం వస్తే… బహుశా ఆ పొందే అనుభూతి ని అక్షరాలలో నిక్షిప్తం చేయగలమా… ఆ అలౌకికానందాన్ని వ్యక్తీకరించగలమా… ? డగ్గుత్తికతో మూగబోయిన గొంతులు… నిండిపోతున్న కనుకొలనులు… ఓహ్… ఆ క్షణాలను ఆస్వాదించిన వారిదే నిజమైన అదృష్టం.. ఎంతో పూర్వ జన్మ సుకృతముంటేనే అటువంటి క్షణాలకు అర్హులు..
గత నెల ఇరవై తారీకున శత వార్షిక వేడుకల్ని ఘనంగా జరుపుకున్న మన స్కూలు పూర్వ విద్యార్థులు నిజమైన అదృష్టవంతులు.. 90 వ వడిలో పడ్డ సైదా మేష్టారు మనలో చాల మందికి విద్యనందించిన మహానుభావుడు కూడా ఈ స్కూలుకి 1930 ల లో విద్యార్థే … తను కూడా ఈ వేడుకలకు హాజరవటం ముదావహమైన విషయం. తొంభై ఆరేళ్ళ ఓ పూర్వ విద్యార్థి రావటం బహుశా ఒక రికార్డు కావచ్చు..
మన బ్యాచ్ నుండి ప్రసన్న, సురేంద్ర, రామచంద్ర, గోపి, కలైవాణి , శశి కిరణ్, డీ. గీత, మహా లక్ష్మి , గాయత్రి ఈ వేడుకకి హాజరయ్యారు. మిగతా విషయాలను కిందనున్న పేపర్ క్లిప్పింగ్స్ లో చదవండి.
ఇంత మందిని సమీకరించి మన స్కూలు లో వేడుక నిర్వహించటం అసాధారణమైన విషయం.. జీవితకాలమంత గుర్తు పెట్టుకోదగ్గ ఈ క్షణాలను అందించటానికి కృషి చేసిన మన స్కూలు పూర్వ విద్యార్థిని, విద్యాదికురాలు డా. సి. కే..లావణ్య బాబు గారు అభినందనీయురాలు.
Dear friends, d memorable moments of our school centenary celebrations are unforgetable I enjoyed mostly in the said celebrations with surendra madhu,seena,jagadeesh, jayaram,pattabhi Reddy, kalaivani,sasikiran,prasannakumari,D.Geetha,prapullaarani.gayathri&others.