సెప్టెంబర్ 7 , 1981 , సా 4 గంటలు

కొన్ని సంఘటనలు చాలా సాధారణమైనవే  కావచ్చు…. కానీ చిరకాలం గుర్తుండిపోతాయి. అలాంటిదే సరిగ్గా ముప్పై ఏళ్ళ నాడు ఇదే రోజు, మా కాలేజి క్లాస్ రూములో జరిగిన ఘటన.

అందరం కాలేజి లో తొలి రోజుల్ని అస్వాదిస్తున్నాం. కాలేజి అంటే  నిక్కర్లనుండి పాంట్స్ వేసుకోవటానికి వచ్చిన ప్రమోషన్ గా భావించే వాళ్ళం.

సెప్టెంబర్ ఏడు, 1981 సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కెమిస్ట్రీ క్లాస్  జరుగుతోంది. నేను, రామచంద్ర (అదే రాజంపేట చిన్నోడు) పక్క పక్కన కూర్చుని ఉన్నాం. తను ఏదో జోకులేస్తున్నాడు. ఎంత నవ్వు ఆపుకున్నా అది టీచర్ కంట పడింది. వెంటనే ఏమీ అనకుండా, లెసన్ చెపుతూ పోయాడు. మధ్యలో ఆపి, నన్ను లేపి అప్పటి వరకూ చెప్పిన లెసన్ లో ప్రశ్నలు అడిగాడు. తను అడిగిన ప్రశ్నలు (అవి ఇప్పటికీ గుర్తే… డబుల్ డికంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ గురించి) అడిగితే, సమాధానాలు సరిగ్గా చెప్పేసరికి, అతనికి మింగుడు పడలేదు.. క్లాస్ లో పాఠాలు సరిగా వినటం లేదని దండిన్చాలనుకున్న అతనికి ఆ చాయిస్ లేకపోవటం తో , ఇంకో విధంగా దాడి మొదలెట్టారు. “మీ నాన్న ఏం చేస్తుంటారు..?’ అని తరువాతి ప్రశ్న. ఎందుకు అడిగారో తెలియని నేను జవాబు చెప్పాక, “ఒక ఆఫీసర్ కొడుకువి అయి ఉండి కూడా , ఇలా మిస్బిహేవ్ చేయచ్చా..?” అంటూ తీవ్ర స్వరంలో ధ్వజమెత్తాడు. అక్కడ నుండి పూర్తిగా అసంబద్ధమైన వ్యక్తిగత విషయాల పై దాడి మొదలయింది. అప్పటికీ శాంతించని తను,  క్లాస్ చివరి వరసలో నిలబడమని చెప్పాడు.. క్లాస్ లో ఎపుడూ క్రమ శిక్షణతో ఉండే నన్ను అలా వెళ్ళ మనేసరికి , అదే క్లాస్ లో ఉన్న నాతో పాటు చదువుకున్న నా స్కూలు మిత్రులు అందరూ నిశ్చేష్టులయ్యారు. క్లాస్ అయ్యాక, అందరూ నా చుట్టూ చేరి, ఒదార్చటం మొదలెట్టారు. ఆ షాక్ కి నా మెదడు మొద్దుబారి పోయింది.  ఈ సంఘటన జరిగిన తరవాత తెలిసింది, తనలో ఆత్మ  న్యూనత ఎక్కువని, అందరూ తన గురించే అనుకుంటూ ఉంటారని ఎపుడూ ఊహించుకుంటారని. తనని చూసే నవ్వానని అనుమానంతో తను అలా చేసారని తరవాత అర్థమైంది.

కాని కథ ఇక్కడితో ముగియలేదు. ఎప్పుడు అటెండన్స్ లో నా పేరు చదివినా , ఏదో గొణుక్కుంటూ ఉండేవారు… ఓ సారి మాత్రం “noted figure ” అని అనటం వినపడేసరికి నాకు భయమేసింది ఇలా గుర్తు పెట్టుకున్న అతడిని, రెండు సంవత్సరాలు ఎలా భరించాలా అని. పైగా అప్పట్లో ప్రాక్టికల్స్ మార్కులు వారి చేతిలో ఉండటం వలన, ఇంకో భయం మొదలయింది. ఇలాంటి భయాల మధ్య రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రాక్టికల్ పరీక్షకి ఇంకో మేష్టారు రావటంతో ఆ రోజు చాల రిలీఫ్ ఫీల్ అయ్యాను.

అప్పటినుండి, ప్రతి సంవత్సరం ఈ రోజు వస్తే ఆ సంఘటన గుర్తు వస్తుంది.. రామచంద్ర కి ఫోన్ చేసి గుర్తు చేస్తే, తనూ ఆ రోజులోకి వెళ్లి పోతాడు. ఇప్పటికీ టచ్ లో ఉన్న నా క్లాస్మేట్స్ విజయకృష్ణ, ప్రసన్న, నాగార్జున, గాయత్రి, మహాలక్ష్మి … వీళ్ళలో ఎంత మందికి గుర్తుందో ఆ సంఘటన..?

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

4 Responses to సెప్టెంబర్ 7 , 1981 , సా 4 గంటలు

  1. Dr. Vijayakrishna says:

    Hey Ram, Thanks for reminding that incident. I still remember that.

  2. Hai,Ramakrishna,i remember the incident of 7.9.81 in the class of sivanandam sir.Iam sorry to say he is no more.

  3. em bava, inthamandiki gurthu vundela chesina nannu mathram evaru abhinandincharemi. ayina nenu alachesanu kabatte kada eeroju oka madura smruthi la migili poyindi. ok na. mana child hood incidents anni kallalone kaduluthuntayi. Kani vatanniti kallalo dachukonu, endukante avi gurthuku vachi kannillatho patu rali pothayemonani, na gundelo dhachukunna. life lo prathi sangatana oka swasa la vuntundani. bye J.R.C. tirupathi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s