ఆశ భోంస్లే పాడిన కొన్ని దక్షిణాది పాటలు..

ఆశ భోంస్లే … విలక్షణమైన స్వరం ఆమె సొంతం.. లతా మంగేష్కర్ లాంటి ఒక legendary singer కి సోదరి అయి ఉండి , గాత్రంలో తన ప్రభావం లేకుండా, తనదంటూ శైలి ఏర్పరుచుకుని అందులో ఖ్యాతి గడించటం  కష్టమే అయినా తను అందులో విజయం సాధించింది..  హిందీ లో ఎన్నో పాటలు పాడినా … అడపా దడపా దక్షినాది భాషలలో కూడా తను కొన్ని పాటలు పాడారు. మన స్కూలు రోజుల్లో ఎం. ఎస్. ఆర్ లో వచ్చిన “పాలు- నీళ్ళు ” చిత్రం లో తను పాడిన పాట ఇప్పటికీ గుర్తే.. తను పాడిన , నాకు తెలిసిన, నచ్చిన కొన్ని పాటలు మీ కోసం..


“పాలు నీళ్ళు” లో “ఇది మౌన గీతం.. ఒక మూగ రాగం ” అన్న పాట. సత్యం స్వరపరిచారీ పాటని. 
“ఎంగ వూరు పాట్టక్కారాన్  ” తమిళ చిత్రం లో “శేన్బగమే… శేన్బగమే” అన్న పాట. ఈ పాటకి ఇళయ రాజ సంగీతం అందించారు.
“చిన్ని కృష్ణుడు” లో ” జీవితం సప్త సాగర గీతం.. వెలుగు నీడలా వేదం… సాగనీ పయనం” అన్న పాట.. ఆర్ డీ బర్మన్ సంగీతం 
ఇటీవల విడుదలైన ” చందమామ” చిత్రం లో “నాలో ఊహలకు నడకలు నేర్పావు” అన్న పాట వింటే ఇప్పటికీ తనలో ఆనాటి మిస్టిక్ మేజిక్ తగ్గలేదని తెలుస్తుంది. రాధాకృష్ణన్ ఈ పాట స్వరకర్త. 

ఈ రోజు జన్మదిన సందర్భంగా తనకి శుభాకాంక్షలందిద్దాం 

Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s