ఇలాంటి అరుదైన హాబీలు మీకూ ఉండేవా..?

మీరు నమ్ముతారో లేదో… నమ్మినా ఇలాంటి హాబీలు కూడా ఉంటాయా అని నవ్వకుండా ఉండగలరో లేదో తెలియదు కాని… ఇది నిజం..అదేంటంటే … చిన్నప్పుడు మా స్నేహితులందరికీ ఒక జాడ్యం ఉండేది.. రోడ్డు పై పడి ఉన్న ఖాళీ సిగరెట్ పాక్ లు  సేకరించుకుని భద్ర పరచటం.. అందులో ఎన్నో వెరైటీలు.. ఆ కాలం లో ఎక్కువ గ సిజర్స్ కంపనీ సిగరెట్ తాగేవారనుకుంటాను.. ఎందుకంటే… మాకు సగం పైగా రోడ్డు పై దొరికే పాక్ లు అవే.. దానితో బాటు, పాసింగ్   షో ( ఒక ఇంగ్లీషు పెద్దాయన టోపీ వేసుకున్న బొమ్మ ఉంటుంది ఈ పాకెట్ కవర్ పైన ), నేవీ బ్లూ, బెర్కిలీ (ఇది ఆకు పచ్చ కలర్ లో ఉండేది), బ్రిస్టల్ (ఒక కోట బొమ్మ ఉండేది), విల్స్ (ఎరుపు రంగు), పనామా  ఇలా ఎన్నో బ్రాండ్ లు. అబ్బో… పొగ రాయుళ్ళకు  కూడా తెలియనన్ని బ్రాండ్ లు మా ఫ్రెండ్స్ కి తెలిసేవి అప్పుడు… “రొట్టెలోడి  కన్నా ముక్కలోడు నయమంటారు” అందుకేనేమో.. 

 ఈ పాకెట్లు మాకు కరెన్సీ నోట్ల కంటే కూడా విలువైనవి  అప్పుడు… వీటిని సేకరించి, మా మిత్రులకు చూపించే వాళ్ళం గర్వంగా.. సెలవు రోజు వచ్చినా, ఏదైనా పని పై బజారు వెళ్ళినా, మా దృష్టంతా రోడ్డు పైనే ఉండేది.. మా చూపులు రోడ్డు పై అణువణువూ జల్లెడ పట్టేసేవి.. ముఖ్యంగా బస్ స్టాండ్ దగ్గర, బడ్డి కొట్ల దగ్గర కాపు కాసే వాళ్ళం .. ఎందుకంటే పొగ రాయుళ్ళు అక్కడే ఎక్కువ తారసపడేవారు కాబట్టి. ఏదైనా అరుదైన పాకెట్ దొరికిందా మాకు పండగే.. మిత్రులందరికీ గర్వంగా  చూపించే వాళ్ళం.. ఇతరుల “సంపద” ని చూస్తే కొంత ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉండేవి… ఇంకొకరి దగ్గర ఏవైనా అరుదైన పాకెట్స్ ఉంటె.. పోటీ పెట్టుకౌనే వాళ్ళం ఆ పాకెట్స్ ని సొంతం చేసుకోటానికి.. అదేంటంటే .. ఓ వృత్తం నేల పై గీసి అందులో మేము సేకరించిన పాకెట్స్ పేర్చే వాళ్ళం. దూరం నుండి డిస్క్ లాంటి ఓ రాయితో ఆ పాకెట్స్ ని కొట్టే వాళ్ళం.. వృత్తం బయటకి పాకెట్స్ వెళ్తే అవి మన సొంతం అయిపోతాయి అన్న మాట.. ఇలా సేకరించిన వాటిని, డబ్బు కంటే ప్రాణ ప్రదంగా చూసుకునే వాళ్ళం..
Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

9 Responses to ఇలాంటి అరుదైన హాబీలు మీకూ ఉండేవా..?

 1. b says:

  meeru ikkada undavalasina vaaru kaadu

  • HAI, VIJAY, HOW ARE U. MANAM COLLECT CHESINA MATCH BOX COVERS NEEDAGARE ICHINANU. NUVVU VATINI POGOTTINANDUKU BADHA GA VUNDI. NUVVU OK ANTE , MALLI IPPUDU COLLECTION START CHESTAMU. BYE RAMACHANDRA, TIRUPATI.

 2. బాగుందండీ ఇలాంటి అబ్బాయి మా స్కూల్లో ఉండేవాడు. నాకు మాత్రం ఇప్పటికీ రకరకాల చాక్లేటుల కాగితాలు దాచుకుంటాను. అప్పట్లో ఆశ చాక్లేటు కాగితం సాగేది అది సాగతీసి కొన్ని సాగతీయకుండా కొన్ని కూడా దాచుకున్నా.

 3. కొత్త పాళీ says:

  yup. Until, One day my mother discovered my treasure and threw it in the garbage.
  Check this out if you get a chance
  http://thulika.net/2008June/3millionbet.html

 4. Goutham says:

  nEnu chinnapuDu school lO matchboxes collect chEsAnu oka 1 year. bAnE pOgEsaanu. appuDu school lO ‘stamp collection’ hava naDustoonDedi. nEnu stamps baanE collect chEsi, to be different, idi modaleTTa. Parents ki transferrable jobs vunTE chaala kasTalanDi, friends , hobbies alA marutoo vunTaru hmm.

 5. T.Pattabhi Raman says:

  Yes !!!! I also remembered those days. Similarly I use to gather old match box (safety matches) wrappers. In that some of the varieties are “cheeta fight” Bull fight, byson like wise. How you did with cigerate wrappers game, i use to play with match papers and crush bottles (iron)corks. Did you played with “Chintha ginjalu” like wise game?? I hope you will remember that also.

 6. Ramakrishna,i use to play with p.s.babu&murali dhar guptha the game of cigarete pockets as they are neighbours.But our children are not all getting a play time.

 7. Dr. Vijayakrishna says:

  Hey Ram,
  Mana Rajampeta chinnodu and I had a habbit of collecting match boxes while we were in high school. We used to collect them in and around greamspet and near RTC bus depot (near Srinivasa theater). We gathered a bunch………But I don’t remember what happened to them??? Do you Ramachandraaaaaaaaa??:)

  Thanks Ram for digging up the childhood memories…………:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s