నాకు నచ్చిన రెండు రేడియో హిందీ పాటల కార్యక్రమాలు

డిగ్రీ వరకు మన ప్రాంతంలో చదువుకున్నా, పీ. జీ కి పశ్చిమ బెంగాల్ వెళ్ళడంతో.. ఒక్క సారిగా సహచరులతో హిందీలో మాటలాడాల్సి వచ్చింది.. అయినా అంత ఇబ్బంది కాలేదు.. అందుకు రెండు రేడియో కార్యక్రమాలకు కృతజ్ఞత చెప్పుకోవాలి.. ఒకటి మధ్యాహ్నం ఒకటి నుండి రెండు వరకూ వచ్చే ” మన్ చాహే గీత్” అయితే ఇంకోటి రాత్రి పదింటికి ప్రసారమయ్యే  ” ఛాయా గీత్”.

డిగ్రీ లో పొద్దుటి క్లాసులకు, మధ్యాహ్నం  క్లాసులకూ మధ్య మూడు గంటల విరామముండేది. లంచ్ అయ్యాక అందరం మేను వాల్చే వాళ్ళం. నేనప్పట్లో ఓ రేడియో కొనుక్కున్నాను. మధ్యానం ఒకటికి ప్రసారమయ్యే “మన్ చాహే గీత్” అంటే చాలా ఇష్టం. పాటలకు అర్థాలు తెలియక పోయినా… కొన్ని పాటలు, ముఖ్యంగా లతా, కిషోర్ పాడిన పాటలు, యుగళ గీతాలు బాగా నచ్చేవి..  తపస్య లో “దో పంచీ … దో తిన్కే కహో లేకే…”, “రామ్ తేరి గంగా మిలి” లోని “సున్ సాహిబా సున్… ప్యార్ కి ధున్..” లాంటి ఎన్నో పాటలు వినే వాడిని… ఆఖరికి  పరీక్షలప్పుడు కూడా, మధ్యాహ్నం రేడియో తగిలించుకుని, హాస్టల్ అంతా తిరుగుతూ… పాటలు వింటూ పుస్తకాలు “పిడి” (బట్టీ కొట్టటానికి మా కాలేజిలో వాడే మాట) కొట్టే వాడిని..

ఛాయా గీత్ కార్యక్రమం రాత్రి, అంతా సద్దు మణిగాక… ప్రశాంతమైన వాతావరణం లో, వేసవిలో చల్లటి గాలిని, వెన్నెల ని  హాస్టల్ రూఫ్ పై ఆస్వాదిస్తూ వినే వాడిని. ఆ పాటలు కూడా, ఎంతో భావుకత తో కూడిన వ్యాఖ్యానంతో మొదలయ్యేవి… అప్పట్లో నాకు నచ్చిన పాట, “దిల్-ఏ- నాదాన్” లోని “చాందిని రాత్ మే ఏక బార్ తుజ్హే దేఖా హై” అన్న ఖయ్యాం స్వర పరిచిన, లతా, కిషోర్ ల యుగళ గీతం ఈ ఛాయా గీత్ లో విన్నదే.. ముఖ్యంగా అలాంటి సమయం లో ఖయ్యం పాటలు వింటుంటే ఎంత ఉల్లాసంగా ఉండేదో…!
ఇలా పాటలు వింటుంటే… కొన్ని సందర్భ పరంగాను, కొన్ని ఇతరులను అడిగి తెల్సుకోటం ద్వారాను, హిందీ పదాలు బాగానే వంట పట్టాయి..

అవే ఉత్తర భారత ప్రాంతాలకు వెళ్ళినపుడు, భాష పరంగా ఏ ఇబ్బంది లేకపోవటానికి దోహద పడ్డాయి.  ఆ రెండు కార్య క్రమాలలో వచ్చే పాటలన్నీ శ్రావ్యమైనవే.. 
Advertisements
This entry was posted in పాటలు. Bookmark the permalink.

2 Responses to నాకు నచ్చిన రెండు రేడియో హిందీ పాటల కార్యక్రమాలు

  1. వివిధ భారతికి..ధన్యవాదములు చెబుతూ.. చాందిని రాత్..నాకు చాల ఇష్తమైన పాట.ఇలాటి రేడియో అనుబంధాలు మన తరం సొంతం..అని చెప్పుకోవడానికి గర్విస్తూ. ..

  2. ssnr999 says:


    Please listen these songs also

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s