పరభాషలో పదనిసలు – part 3

క్రితం టపాలో హిందీ నేర్చుకున్నానని చెప్పినా… అప్పుడప్పుడూ కొన్ని షాకులు తిన్నాను భాష లో నిష్ణాతుణ్ణి  కానందు వలన..

ఒకప్పుడు ముంబైలో ఓ కంపనీ లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. ఓ యంత్రం తయారు చేయటానికి ఇనుప రేకులతో కొంత fabrication చేయాలి. అదేంటో కాని, నేను ఏది fabricate చేసినా, అందులో ఏదో ఒక పెద్ద లోపం తలెత్తేది. నాకు సహాయం చేస్తున్న technician “శంకర శాస్త్రి ” టైపు.. మెషిన్ కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా పెదవి విరిచేవాడు.  మళ్ళీ ఉసూరుమంటూ మొదటి నుండి మొదలెట్టాలి.. అతను మహారాష్ట్ర కి చెందిన వ్యక్తి.. అంతా హిందీ లోనే సంభాషణలు.. నా మిడి మిడి జ్ఞానంతో హిందీ లో నేట్టుకొస్తున్నాను అతనితో..

ఒక రోజు పొద్దుటి నుండి కష్టపడి మెషిన్ పార్ట్ ఒకటి చేసాను.. తీసుకెళ్ళి అతనికి చూపించాను.. అర్ధ నిమీలిత నేత్రాలతో అతను ఓ సారి తేరిపార చూసి… ముఖం వికారంగా పెట్టి… “ఏ చాలూ హై..” అన్నాడు.. నాకు ఆతను చెప్పింది  అర్థం కాలేదు.. కాని అతని హావ భావాలు చూసి “శంకర శాస్త్రి మళ్లీ పెదవి విరిచాడు ” అని మనసులో ఓ సారి నిట్టూర్చి… మళ్ళీ workshop లో దూరాను..  నాకు తోచినంతలో మళ్లీ చిన్న చిన్న adjustments చేసి.. మళ్లీ తన దగ్గరకు పట్టుకెళ్ళాను … మళ్ళీ అదే తంతు.. అదే డైలాగ్.. మళ్ళీ నిట్టూర్పులు.. మళ్లీ workshop లో modifications చేయటం జరిగాయి.. మూడో సారి కూడా అదే డైలాగ్.. ఓపిక నశించిన నేను “कल आप ही बनाके देदीजिए..” ( మీరే చేసి రేపటికి  ఇవ్వండి) అని విసురుగా వచ్చేసాను..

ఆ రోజు సాయంత్రం ఇంకో తెలుగు మిత్రుడు (హిందీలో నా కంటే బెటర్) తో మాట్లాడుతూ నా గోడు చెప్పుకున్నాను.. అతను అంతా విని.. విపరీతంగా  నవ్వి  అసలు సంగతి చెప్పాడు.. “ఏ చాలూ హై..” అంటే ” ఇది పని చేస్తుంది” అని… అంటే మూడు సార్లు పని చేస్తుంది అన్న దానిని నేను ఏదో ఏదో చేసి పట్టుకెళ్ళాను అని అప్పుడర్థమయ్యింది.. హావ భావాలకు మేచ్ కాని అతని డైలాగ్ ని నేను అపార్థం చేసుకున్నానని అప్పుడు బోధ పడింది.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

3 Responses to పరభాషలో పదనిసలు – part 3

  1. oh..Good.. chesina panine cheyadam.. :))))))

  2. Ramakrishna.hope u belongs to mandapampalli?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s