200 టపాలు పూర్తయిన సందర్భంగా మన బ్లాగు విశ్లేషణ

ఇది మన 201 వ టపా. గత టపా ప్రచురించాక తెలిసింది అదే మన 200 వ టపా అని. కాకతాళీయంగా 25000 హిట్స్ ని కూడా ఈ టపాతో పూర్తి చేసుకున్నాము. ఈ బ్లాగు ప్రారంభించింది కేవలం మన క్లాస్ మేట్స్ ని కలపటానికే అయినా, సంకలినులలో మన టపాలు రావటం మొదలయ్యాక, మన స్కూలు విశేషాలతో పాటు, నాకు నచ్చిన కొన్ని విషయాలను ఈ బ్లాగు మాధ్యమంగా చేసుకుని అందరితో పంచుకోవటం మొదలయ్యింది. సగటున టపాకి 125 హిట్స్ ని పొందిన మన బ్లాగు, బ్లాగ్లోకంలో ఇంకా ఎదిగే దశలోనే ఉందని చెప్పాలి. తెలుగు రాయటం మానేసి దాదాపుగా మూడు దశాబ్దాలయ్యాక, ఈ బ్లాగులో రాయటం మొదలెట్టాక, అడపా దడపా భాష లో ఇప్పటికీ దోషాలు దొర్లుతూనే ఉన్నాయి. కాని ఒక fulfilling experience ని  పొందటం మొదలయ్యింది ఈ రాతలతో. మన లాగే ఆలోచించే ఎంతో మంది, వారి కామెంట్స్ ద్వారా తెలుపుతుంటే, ఈ రచన వ్యాసంగానికి ఫలితం దక్కుతోంది అనిపించింది. ఓ సారి మన మిత్రుడు విజయ్ కృష్ణ మాట్లాడుతూ, “ఈ బ్లాగు రాయటం లో చాల శ్రమ తీసుకుంటున్నావు” అని అంటే… “లేదు… శ్రమ నుండి relax అవటానికే  ఈ బ్లాగు లో రాస్తున్నాను” అన్నాను.

పదునాలుగు నెలల ఈ బ్లాగు ప్రస్థానం లో ఎంతో మంది మిత్రులు తోడయ్యారు.. మన స్కూలు లో చదివిన వారు, కాని మనకు తెలియని వారు.. ఐదు మంది మన బ్లాగు ని చూసి మనకు పరిచయమయ్యారు. మన స్కూలు కాకపోయినా… మన టపాలను ఆదరిస్తూ మన వెంట నడుస్తున్న వారు సుమారు పది మంది దాకా ఉన్నారు.

నన్ను అమితంగా ఆశ్చర్య పరిచిన ఒక టపా “సుబ్బయ్య హోటల్ @ కాకినాడ…”. ఈ టపాకి ఎక్కువ వ్యాఖ్యలు రావటమే కాదు…  ఇప్పటికీ హిట్స్ వస్తూనే ఉన్నాయి. ఎక్కువగా చూసిన టపా ఇదే.. దీని తరవాతి స్థానం లో ఉన్న టపాకి కనీసం అందులో సగం హిట్స్ కూడా లేవు.
బాగా రాసాను అనుకున్న టపాని చూసిన వారు తక్కువ.. బాధ పెట్టిన వ్యాఖ్యలు కేవలం మూడో నాలుగో వచ్చాయి.. అంతే..
ఏమీ రాయని రోజు కూడా, మన మిత్రులు బ్లాగుని చూస్తుండటంతో హిట్స్ వస్తుంటాయి.. అప్పుడప్పుడూ అన్ని టపాలు చదువుకుంటుంటే.. ఏదో డైరీ ని చదువుతున్న ఫీలింగ్ … ఇది నాకే కాదు, మన మిత్రులలో చాల మంది కి కలిగే ఫీలింగ్..

 

“नाम गुम जाएगा , चेहरा ऐ बदल जाएगा… हमारी “ब्लॉग” ही पहचान है.. गर याद रहे… ” అన్న గీతాన్ని మా బ్లాగుకి వర్తింపచేసుకుంటే … మేము పండుటాకులైనా… మా తరవాత  మాకు పూచిన చివుళ్ళు కూడా ఈ బ్లాగుని ఆఘ్రాణిస్తూనే  వుంటాయి…
Advertisements
This entry was posted in నాడు-నేడు. Bookmark the permalink.

6 Responses to 200 టపాలు పూర్తయిన సందర్భంగా మన బ్లాగు విశ్లేషణ

  1. రామకృష్ణ గారు మీ 201 ఠపా బాగుంది. జ్ఞాపకాలు,అనుభవాలు,ఆలొచనలు పంచుకోవడానికే బ్లాగ్ లోకంలోకి.. వస్తుంటారు అందరు. అందులో ఏవి నచ్చితే అవి చూస్తుండటం సాధారణ విషయం.ఒకరి కొరకు వ్రాస్తుండటం అనుకోకుండా వ్రాయాలి అనిపించినప్పుడు వ్రాయడం అంటె.. మన డైరీ లో ఇస్తమైనప్పుడు వ్రాసుకోవడం అన్నమాట. యెన్ని హిట్స్ అనేది మనని చూసే వారికి కానీ మనకి కాదు అనుకుంటె స్పందంతో వ్రాయగలం. నలుగురికి నచ్చెటట్లు వ్రాయడం అంటే ..మనకు ఇష్టమైనదాన్ని,నచ్చినదాన్ని ఒదులుకోవడం. నేను మీలాగే నచ్చిన పాటల గురించి వ్రాయకుండా ఉండలేను .ఆకట్టుకునే విధంగా వ్రాస్తున్నందుకు అభినందనలు. శుభాకాంక్షలు

  2. chinni says:

    congratulations:-):)

  3. Congrats Ramakrishna for completion 200 postings in the blog&25000 hits within a span of 14 months for our blog.

  4. congratulations !! keep blogging.

  5. sugunasri says:

    Very good analysis! Looking forward for your next milestone.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s